హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Delhi Fire Accident: 30 మంది మృతి.. మరో 29 మంది మిస్సింగ్.. వీరంతా ఏమయ్యారు?

Delhi Fire Accident: 30 మంది మృతి.. మరో 29 మంది మిస్సింగ్.. వీరంతా ఏమయ్యారు?

ఘటనా స్థలంలో దృశ్యాలు

ఘటనా స్థలంలో దృశ్యాలు

Delhi Fire Mishap: అగ్నిప్రమాద సమయంలో ఓ గదిలో మీటింగ్ జరిగిందని.. 50 మంది వరకు దానికి హాజరయ్యారని పేర్కొన్నారు. ఆ గదిలోనే ఎక్కువ శవాలు లభ్యమయినట్లు పేర్కొన్నారు.

ఢిల్లీ అగ్నిప్రమాద (Delhi Fire Accident) ఘటనలో మ‌ృతుల సంఖ్య భారీగా పెరుగుతోంది. మంటలు చల్లారిన తర్వాత ఆ భవనంలో రెస్క్యూ సిబ్బంది సెర్చ్ ఆపరేషన్ చేపట్టారు. మూడో అంతస్తులో కొన్ని చోట్ల మాంసపు ముద్దలు కనిపించాయని..  అవి మానవ మృతదేహాలవేనని అధికారులు స్పష్టం చేశారు. ఐతే ఎన్ని శవాలున్నాయన్న దానిపై స్పష్టత లేదు. మృతదేహాలు పూర్తిగా కాలిపోయి.. ముక్కలముక్కలవడంతో.. లెక్కించడం కష్టంగా మారింది. అర్ధరాత్రి వరకు 27 మృతదేహాలను వెలికితీశారు. ఇవాళ మూడో అంతస్తులో మరికొన్ని  మానవ అవయవాలు లభించడంతో.. మరో ముగ్గురు (Delhi Fire Mishap) మరణించిన ఉండొచ్చని అధికారులు తెలిపారు. మొత్తం 30 మంది మరణించినట్లుగా భావించవచ్చని పేర్కొన్నారు.

ఈ ఘటనకు సంబంధించి మరిన్ని కీలక వివరాలను అగ్నిమాపకశాఖ అధికారులు వెల్లడించారు. అగ్నిప్రమాద సమయంలో ఓ గదిలో మీటింగ్ జరిగిందని.. 50 మంది వరకు దానికి హాజరయ్యారని పేర్కొన్నారు. ఆ గదిలోనే ఎక్కువ శవాలు లభ్యమయినట్లు పేర్కొన్నారు.

ఢిల్లీలోని ముంద్కా మెట్రో స్టేషన్‌ (Mundka Metro station)సమీపంలో ఘోర అగ్నిప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ముంద్కా మెట్రో స్టేషన్ 544వ నంబరు స్తంభం వద్ద ఉన్న మూడంతస్తుల వాణిజ్య భవనంలో పెద్ద ఎత్తున మంటలు (Delhi Fure Accident) ఎగిసిపడ్డాయి. సాయంత్రం 04.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. పెద్ద ఎత్తున మంటలు, దట్టమైన పొగలు అలుముకోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అగ్నిమాపక సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి వెళ్లి సహాయక చర్యలు చేపట్టారు. 24 ఫైరింజన్లను రంగంలోకి దించారు. ఓ వైపు మంటలు అదుపు చేస్తూనే.. మరోవైపు భవనంలోని కార్యాలయాలలో చిక్కుకున్న పలువురిని కాపాడారు. దాదాపు 70 మందిని కాపాడి భవనం నుంచి బయటకు తీసుకొచ్చారు. మరికొందరు మాత్రం మంటల్లో కాలిపోయి మరణించారు. వారి మృతదేహాలను ఒక్కొక్కటిగా బయటకు తీశారు. ఐతే ఇంకా కొంద మంది ఆచూకీ మాత్రం దొరకలేదు.

Explained: పూరీ జగన్నాథ్ ఆలయ కారిడార్‌పై వివాదం.. ASI, ఒడిశా మధ్య గొడవకు కారణాలివే

ప్రమాదానికి గురైన భవనంలోని కార్యాలయాల్లో పనిచేసే వారి కుటుంబ సభ్యులు, బంధువులు.. ఘటనా స్థలానికి వెళ్లి, తమ వారి గురించి అధికారుల గురించి ఆరా తీస్తున్నారు. 29 మంది ఆచూకీ దొరకడం లేదని అధికారులు చెబుతున్నారు. మరి వారంతా కిందకు దూకేశారా? లేదంటే కాలి బూడిదయ్యారా? అనేది తెలియాల్సి ఉంది. ఒకవేళ బిల్డింగ్ నుంచి దూకి ప్రాణాలతో బయటపడితే.. కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి చెప్పేవారని.. కానీ ఇప్పటి వరకు వారి గురించి ఎలాంటి సమాచారం లేదు. అంటే ఈ లెక్కన వారు మరణించినట్లుగానే అర్థం చేసుకోవాలని కొందరు అధికారులు పేర్కొన్నారు. మూడంతస్తుల ఆ భవనంలో ఇంకా సెర్చ్ ఆపరేషన్ కొనసాగుతోందని తెలిపారు. కొన్ని మృతదేహాలు గుర్తుపట్టరాని విధంగా ఉన్నాయని.. డీఎన్ఏ పరీక్షలు చేసిన తర్వాతే, వాటిపై క్లారిటీ వస్తుందని చెప్పారు.

Judgement: భార్యాభర్తలు కోర్టు బయట రాజీపడితే.. అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు

మరోవైపు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఘటనా స్థలానికి వెళ్లారు. అగ్నిప్రమాదానికి గురైన భవనంలోకి వెళ్లి పరిశీలించారు. ఈ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా ఇస్తామని చెప్పారు. గాయపడ్డవారికి రూ.50వేల ఆర్థికసాయం చేస్తామని తెలిపారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా కేంద్ర తరపున ఎక్స్‌గ్రేషియా ప్రకటించిన విషయం తెలిసిందే. మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, క్షతగాత్రులకు రూ.50 వేల చొప్పున ఇస్తామని పేర్కొన్నారు.

సీసీ కెమెరాలు, రూటర్లు తయారు చేసే కంపెనీలోనే ముందుగా మంటలు చెలరేగాయని.. క్రమంగా ఇతర అంతస్తులకు వ్యాపించాయని అధికారులు చెప్పారు. అక్కడ ప్లాస్టిక్ వినియోగం ఎక్కువగా ఉండడం వల్ల మంటలు వేగంగా విస్తరించాయని తెలిపారు. భద్రతా ప్రమాణాలు పాటించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు సదరు కంపెనీ యాజమాన్యాన్ని ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేశారు.

First published:

Tags: Delhi, Fire Accident, New Delhi

ఉత్తమ కథలు