ED Raids : ఢిల్లీ కొత్త ఎక్సైజ్ విధానం(Delhi New Excise Police)లో అవకతవకలు కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ED)దేశవ్యాప్త దాడులు చేపట్టింది. శుక్రవారం ఉదయం హైదరాబాద్,ముంబై,ఢిల్లీ,బెంగళూరు,లక్నో సహా దేశంలోని 35 ప్రదేశాల్లో ఈడీ బృందాలు సోదాలు చేపట్టాయి. హైదరాబాద్,పంజాబ్,ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో ఈడీ సోదాలు నిర్వహించింది. కొందరు లిక్కర్ డిస్ట్రిబ్యూటర్లు, కంపెనీలు, అనుబంధ సంస్థలపై సోదాలు జరుగుతున్నాయని వర్గాలు తెలిపాయి.
ఈ కేసులో ఇడి ఇప్పటి వరకు 103 కంటే ఎక్కువ రైడ్స్ నిర్వహించింది. ఈ కేసులో గత నెలలో మద్యం వ్యాపారవేత్త, మద్యం తయారీ కంపెనీ ఇండోస్పిరిట్ మేనేజింగ్ డైరెక్టర్ సమీర్ మహంద్రును కూడా ఈడీ అరెస్టు చేసింది.
ఈడీ దాడులపై ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ట్విట్టర్ ద్వారా స్పందించారు. "500 కంటే ఎక్కువ దాడులు, 3 నెలల నుండి 300 కంటే ఎక్కువ CBI/ED అధికారులు మనీష్ సిసోడియాకు వ్యతిరేకంగా సాక్ష్యాలను కనుగొనడానికి 24 గంటల పాటు పని చేస్తున్నారు. కానీ ఏమీ దొరకడం లేదు. ఎందుకంటే ఏమీ చేయలేదు కాబట్టి. వారి నీచ రాజకీయాల కోసం చాలా మంది అధికారుల సమయాన్ని వృధా చేస్తున్నారు. అలాంటి దేశం ఎలా పురోగమిస్తుంది?"అని కేజ్రీవాల్ ఓ ట్వీట్ లో తెలిపారు.
Medical Alert: నాలుగు భారత దగ్గు టానిక్లపై WHO మెడికల్ అలర్ట్.. ఆ సిరప్లు ఇవే!
ఢిల్లీ నూతన మద్యం పాలసీ
కేజ్రీవాల్ ప్రభుత్వం గతేడాది నవంబర్లో తీసుకొచ్చిన ఎక్సైజ్ పాలసీ-2022(నూతన మద్యం విధానం) నిబంధనలకు విరుద్ధంగా ఉందనే ఆరోపణల నేపథ్యంలో దీనిపై దర్యాప్తు చేపట్టాలని ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా కొద్దిరోజుల కింద సీబీఐకి సిఫార్సు చేశారు. నూతన మద్యం విధానంలో జరిగిన నియమాల ఉల్లంఘనతో పాటు విధానపరమైన లోపాలపై దర్యాప్తు చేపట్టాలని సూచించారు. మద్యం విధానంపై చీఫ్ సెక్రటరీ దాఖలు చేసిన నివేదికను చూస్తే జీఎన్సీటీడీ యాక్ట్ 1991, ట్రాన్సాక్షన్ ఆఫ్ బిజినెస్ రూల్స్, దిల్లీ ఎక్సైజ్ యాక్ట్-2009తోపాటు దిల్లీ ఎక్సైజ్ రూల్స్-2010ల నియమాలు ఉల్లంఘించినట్లు ప్రాథమికంగా తెలుస్తోందని గవర్నర్ తెలిపారు. వీటితోపాటు టెండర్ల తర్వాత లైసెన్సుదారులకు ప్రయోజనం చేకూర్చేలా ఉద్దేశపూర్వకంగానే ప్రభుత్వం విధానపరమైన లోపాలకు పాల్పడినట్లు కనిపిస్తోందన్నారు. ఈ వ్యవహారంలో ఎక్సైజ్ శాఖకు ఇన్ఛార్జ్గా ఉన్న మనీశ్ సిసోడియా పాత్రనూ అందులో ప్రస్తావించారు.ఎల్జీ సీబీఐ విచారణకు ఆదేశించిన నేపథ్యంలో గత నెలలో నూతన మద్యం విధానాన్ని ఉపసంహరించుకుంటున్నట్లు కేజ్రీవాల్ ప్రభుత్వం ప్రకటించింది. మరో ఆరు నెలల పాటు పాత మధ్యం విధానాన్నే కొనసాగించనున్నట్లు పేర్కొంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.