Home /News /national /

DELHI ENDS ALL COVID CURBS SCHOOLS OFFLINE FROM APRIL 1 PVN

Covid Curbs Ends : కోవిడ్ ఆంక్షలన్నీ ఎత్తివేత..స్కూల్స్ రీఓపెన్,అర్థరాత్రి దాకా రెస్టారెంట్లు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

All Covid Restrictions Ends: వ్యాపారాలు కోల్పోవడం వల్ల వ్యాపార కార్యకలాపాలు నిర్వహించేవాళ్లు,అందులో పనిచేసేవాళ్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,నైట్ కర్ఫ్యూ ముగుస్తున్న నేపథ్యంలో దుకాణాలు, రెస్టారెంట్లు మరియు ఇతర సంస్థలు అర్థరాత్రి వరకు గతంలో మాదరిగానే తెరిచి ఉంటాయని తెలిపాయి.

ఇంకా చదవండి ...
All Covid Restrictions Ends:  దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో కూడా వైరస్ కేసులు తగ్గిన నేపథ్యంలో అన్ని కోవిడ్ ఆంక్షలను ఎత్తివేయాలని కేజ్రీవాల్ ప్రభుత్వం నిర్ణయించింది. కోవిడ్ నేపథ్యంలో గతంలో ఢిల్లీలో విధించిన నైట్ కర్ఫ్యూ సోమవారం నుండి ముగుస్తుందని కేజ్రీవాల్ ప్రభుత్వం ఇవాళ ప్రకటించింది. పాఠశాలలను కూడా ఒకటో తేదీ నుంచి పూర్తిగా తెరవాలని నిర్ణయం తీసుకున్నట్లు ఢిల్లీ ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. వ్యాపారాలు కోల్పోవడం వల్ల వ్యాపార కార్యకలాపాలు నిర్వహించేవాళ్లు,అందులో పనిచేసేవాళ్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని,నైట్ కర్ఫ్యూ ముగుస్తున్న నేపథ్యంలో దుకాణాలు, రెస్టారెంట్లు మరియు ఇతర సంస్థలు అర్థరాత్రి వరకు గతంలో మాదరిగానే తెరిచి ఉంటాయని తెలిపాయి.

ఢిల్లీ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ(DDMA)..మాస్క్ ధరించనందుకు జరిమానాను రూ. 1,000 నుండి రూ. 500కి తగ్గించింది. అయితే ప్రజలు కోవిడ్-19 భద్రతా చర్యలను పాటించేలా ప్రభుత్వం గట్టి నిఘా ఉంచుతుందని ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ తెలిపారు.

ALSO READ Russia-Ukraine War : పుతిన్ కు ఊహించని షాక్..బందీలుగా 1700మంది రష్యన్ లు

కాగా, COVID-19 కేసులు మరియు ఇన్‌ఫెక్షన్ రేటు తగ్గుతున్నందున, ఆంక్షలను పూర్తిగా తొలగించాలని డిమాండ్ చేస్తూ ఢిల్లీలోని వ్యాపారుల సంఘం ఛాంబర్ ఆఫ్ ట్రేడ్ అండ్ ఇండస్ట్రీ ఇటీవల లెఫ్టినెంట్ గవర్నర్‌కు లేఖ రాసిన విషయం తెలిసిందే. కేంద్ర హోం  మంత్రిత్వ శాఖ కూడా.. సామాజిక, క్రీడలు, వినోదం, అకడమిక్ మరియు మతపరమైన ఈవెంట్‌లతో పాటు రాత్రి కర్ఫ్యూ వేళల కోసం కోవిడ్ నియంత్రణలను సడలించడాన్ని పరిగణించాలని రాష్ట్రాలు మరియు కేంద్ర పాలిత ప్రాంతాలను కూడా కోరింది.
Published by:Venkaiah Naidu
First published:

Tags: Covid 19 restrictions, Covid cases, Delhi

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు