Delhi Earthquake Alert: రాజస్తాన్‌లో భూకంపం.. ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో భూ ప్రకంపనలు..

ప్రతీకాత్మక చిత్రం

Delhi Earthquake Alert: రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో గురువారం 4.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ప్రభావంతో దేశ రాజధాని ఢిల్లిలోని కొన్ని ప్రాంతాల్లో కూడా భూప్రకంపనలు సంభవించాయి.

  • Share this:
    రాజస్థాన్‌లోని అల్వార్ జిల్లాలో గురువారం 4.2 తీవ్రతతో భూకంపం సంభవించింది. ఈ ప్రభావంతో దేశ రాజధాని ఢిల్లిలోని కొన్ని ప్రాంతాల్లో కూడా భూప్రకంపనలు సంభవించాయి. భూ ప్రకంపనలతో రాజధాని ప్రాంత వాసులు ఆందోళన చెందారు. ఢిల్లీలో భూప్రకంపనలు చోటుచేసుకున్న విషయాన్ని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ(NCS) తెలిపింది. భూకంప కేంద్రం రాజస్థాన్ జిల్లాలోని అల్వార్ ప్రాంతంలో కేంద్రీకతమైనట్టుగా పేర్కొంది. రాత్రి 11.46 గంటలకు ఐదు కిలోమీటర్ల లోతులో రిక్టర్‌ స్కేలుపై 4.2 తీవ్రతో భూకంపం సంభవించిందని తెలిపింది. ఇక, ఢిల్లోని కొన్ని ప్రాంతాలతో పాటు, నోయిడా, గురుగ్రామ్, ఘజియాబాద్ ప్రాంతాల్లో భూప్రకంపనలు చోటు చేసుకున్నట్టుగా పలువురు ట్విట్టర్ యూజర్లు తెలిపారు. అయితే దీని వల్ల ఎటువంటి ప్రాణ నష్టం గానీ, ఆస్తి నష్టం గానీ జరగలేదు.

    ఈ నెల ప్రారంభం నుంచి గుజరాత్‌లోని గిర్ సోమనాథ్ జిల్లాలో రిక్టర్ స్కేలుపై 1.7 నుంచి 3.3 తీవ్రత పరిధిలో 19 భూకంపాలు సంభవించాయి. వీటి వల్ల ఎటువంటి ప్రాణ నష్టం గానీ, ఆస్తి నష్టం గానీ సంభవించలేదు. ఇందుకు సంబంధించి గాంధీనగర్ కేంద్రంగా ఉన్న ఇనిస్టిట్యూట్ ఆఫ్ సీస్మోలాజికల్ రీసెర్చ్‌లోని ఓ సీనియర్ అధికారి మాట్లాడుతూ.. వీటిని రుతుపవనాల ప్రేరిత భూకంపం ఫలితంగా వచ్చిన ప్రకంపనలుగా పేర్కొన్నారు.
    Published by:Sumanth Kanukula
    First published: