Home /News /national /

Shashi Tharoor: కాంగ్రెస్ నేత శశి థరూర్‌కు బిగ్ రిలీఫ్.. సునంద పుష్కర్ కేసులో కీలక పరిణామం

Shashi Tharoor: కాంగ్రెస్ నేత శశి థరూర్‌కు బిగ్ రిలీఫ్.. సునంద పుష్కర్ కేసులో కీలక పరిణామం

శశి థరూర్

శశి థరూర్

Shashi Tharoor | Sunanda Pushkar death Case: కోర్టు తీర్పుపై కేంద్రమాజీ మంత్రి శశి థరూర్ హర్షం వ్యక్తం చేశారు. చాలా సంతోషంగా ఉందని.. ఈ కేసు ఏడున్నరేళ్ల పాటు తనను వేధింపులకు గురించేసిందని అన్నారు.

    దేశవ్యాప్తంగా సంచలనం రేపిన సునంద పుష్కర్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. సునంద పుష్కర్ అనుమానాస్పద మృతి కేసులో ఆమె భర్త, కాంగ్రెస్ సీనియర్ నేత శశి థరూర్‌కు పెద్ద ఊరట లభించింది. ఆయనపై నమోదైన అన్ని అభియోగాలను ఢిల్లీలోని రౌస్ ఎవెన్యూ కోర్టు కొట్టివేసింది. చార్జిషీట్‌లో సరైన ఆధారాలు లేవంటూ శశిథరూర్‌ను నిర్దోషిగా ప్రకటిస్తూ.. తీర్పును వెల్లడించింది. కోర్టు తీర్పుపై కేంద్రమాజీ మంత్రి శశి థరూర్ హర్షం వ్యక్తం చేశారు. చాలా సంతోషంగా ఉందని.. ఈ కేసు ఏడున్నరేళ్ల పాటు తనను వేధింపులకు గురించేసిందని అన్నారు.


    సుంనంద పుష్కర్ 2014, జనవరి 17న అనుమానాస్పద స్థితిలో మరణించారు. ఢిల్లీలోని ఓ ఫైవ్ స్టార్‌ హెోటల్‌లలో ఆమె చనిపోయారు. ఈ కేసులో ఆమె భర్త శశి థరూర్ ప్రధాన నిందితుడిగా ఉన్నారు. సునంద పుష్కర్ ఆత్మహత్య చేసుకునేంత పరికిది కాదని.. శశిథరూరే చంపేశారని ఆమె తల్లిదండ్రులు కేసు పెట్టారు. ఈ నేపథ్యంలో సునంద పుష్కర్‌ను ఆమె భర్త మానసిక వేధింపులకు గురిచేశారని, ఆత్మహత్యకు ప్రేరేపించారని ఢిల్లీ పోలీసులు అభియోగాలు మోపారు.  వరకట్నం కోసం వేధించడంతో పాటు నిత్యం టార్చర్ పెట్టడం వల్లే ఆత్మహత్య చేసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ కేసులో పాకిస్తాన్ జర్నలిస్ట్ మెహర్ తరార్ పేరు ప్రధానంగా వినిపించింది. ఆమెతో స్నేహం తర్వాతే భార్యను దూరం చేస్తూ వచ్చారని ప్రచారం జరిగింది.

    సునంద్ పుష్కర్ కేసులో బెయిల్‌పై బయట ఉన్నారు శశిథరూర్. ఒకవేళ ఆయనపై అభియోగాలు రుజువై ఉంటే మూడు నుంచి పదేళ్ల వరకు జైలు శిక్ష పడేది. కానీ సరైన సాక్షాధారాలు లేని కారణంగా ఆయనపై నమోదైన అభియోగాలను కోర్టు కొట్టివేసింది.

    ఇవి కూడా చదవండి:

    ఆ సహజీవనం నేరమే... రాజస్థాన్ హైకోర్టు తీర్పుపై దేశవ్యాప్తంగా చర్చ

    Wife revange : భర్తపై ప్రతీకారం..కరెంట్ షాక్‌తో చుక్కలు చూపించిన భార్య
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Congress, Shashi tharoor

    తదుపరి వార్తలు