• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • DELHI COURT AWARDS DEATH PENALTY TO CONVICT ARIZ KHAN IN 2008 BATLA HOUSE ENCOUNTER CASE BA

Batla House Enounter: బాట్లా హౌస్ ఎన్ కౌంటర్ కేసులో దోషికి ఉరిశిక్ష

Batla House Enounter: బాట్లా హౌస్ ఎన్ కౌంటర్ కేసులో దోషికి ఉరిశిక్ష

ప్రతీకాత్మక చిత్రం

బాట్లా హౌస్ ఎన్ కౌంటర్ కేసులో ఢిల్లీ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో దోషిగా తేలిన ఆరిజ్ ఖాన్‌కు ఉరి శిక్ష విధించింది. ఈ కేసులో అత్యంత అరుదైన కేసుగా అభివర్ణించారు న్యాయమూర్తి. అందుకే దోషికి ఉరిశిక్ష విధిస్తున్నట్టు చెప్పారు.

  • Share this:
    బాట్లా హౌస్ ఎన్ కౌంటర్ కేసులో ఢిల్లీ కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో దోషిగా తేలిన ఆరిజ్ ఖాన్‌కు ఉరి శిక్ష విధించింది. ఈ కేసులో అత్యంత అరుదైన కేసుగా అభివర్ణించారు న్యాయమూర్తి. అందుకే దోషికి ఉరిశిక్ష విధిస్తున్నట్టు చెప్పారు. దేశంలో సంచలనం సృష్టించిన బాట్లా ఎన్ కౌంటర్ కేసులో టెర్రరిస్టు అరిజ్ ఖాన్‌ను దోషిగా తేలుస్తూ మార్చి 8న ఢిల్లీ కోర్టు తీర్పు చెప్పింది. ఇండియన్ ముజాహిదీన్‌కు చెందిన అరిజ్ ఖాన్‌ను దోషిగా నిర్ధారించింది. ఇన్ స్పెక్టర్ మోహన్ చంద్ శర్మను అరిజ్ ఖాన్ హత్య చేసినట్టు ప్రాసిక్యూషన్ ససాక్ష్యాలతో సహా నిరూపించిందని కోర్టు విశ్వసించింది.  2008లో బాట్లా హౌస్ ఎన్ కౌంటర్ జరిగింది. ఇండియన్ ముజాహిదీన్ టెర్రరిస్ట్ గ్రూప్‌నకు చెందిన ఇద్దరు టెర్రరిస్టులు అక్కడ దాక్కుని ఉన్నారన్న సమాచారం రావడంతో ఢిల్లీ పోలీసులు జామియా నగర్ లోని బాట్లా హౌస్ ప్రాంతంలో ఎన్ కౌంటర్ మొదలు పెట్టారు. అయితే, ఆ ఎన్ కౌంటర్‌లో ఇన్ స్పెక్టర్ మోహన్ చంద్ శర్మ టెర్రరిస్టుల కాల్పుల్లో అమరుడయ్యారు.

    2008 సెప్టెంబర్ 19న ఈ ఘటన జరిగింది. అరిజ్ ఖాన్ స్పాట్‌లో ఉన్నాడని, అతడే మోహన్ చంద్ శర్మ మీద కాల్పులు జరిపాడని పోలీసులు చెప్పారు. మరో నలుగురితో కలసి ఉన్నట్టు తెలిపారు. ఎన్ కౌంటర్ తర్వాత అతడు పారిపోయినట్టు వెల్లడించారు. అతడి కోసం వేటాడుతున్న సమయంలో సుమారు పదేళ్ల తర్వాత నిందితుడు దొరికాడు. 2018లో నిందితుడు అరిజ్ ఖాన్‌ను ఢిల్లీ స్పెషల్ సెల్ పోలీసులు అరెస్టు చేశారు.



    బాట్లా హౌస్ లోని అపార్ట్ మెంట్‌లో మొత్తం ఐదుగురు ఉన్నారు. అందులో మొహమ్మద్ సాజద్, అతిఫ్ అమన్ ఎన్ కౌంటర్‌లో చనిపోయారు. జునైద్, షాజాద్ అహ్మద్ అప్పుడు పారిపోయారు. కానీ, కొన్నాళ్ల తర్వాత మళ్లీ పోలీసులు వారిని పట్టుకున్నారు. వారిలో మొహమ్మద్ సైఫ్ పోలీసుల ఎదుట లొంగిపోయాడు. 2013 జూలైలో షాజాద్ అహ్మద్‌కు ఇదే కేసులో ట్రయల్ కోర్టు జీవిత ఖైదు విధించింది.
    Published by:Ashok Kumar Bonepalli
    First published:

    అగ్ర కథనాలు