DELHI CM SWEARING IN CEREMONY KEJRIWAL TO TAKE OATH TODAY IN DELHI NK
Kejriwal Oath : కేజ్రీవాల్ నేడు ఢిల్లీలో ప్రమాణ స్వీకారం... ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ
Kejriwal Oath : కేజ్రీవాల్ నేడు ఢిల్లీలో ప్రమాణ స్వీకారం... ముఖ్య అతిథిగా ప్రధాని మోదీ
Kejriwal Oath Ceremony : మూడోసారి ఢిల్లీ ముఖ్యమంత్రిగా అరవింద్ కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చెయ్యబోతున్నారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ వస్తారా అన్నది అనుమానం ఉంది.
Delhi | CM Kejriwal Oath Ceremony : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి అద్భుత విజయం సాధించిన అరవింద్ కేజ్రీవాల్... ఇవాళ ఉదయం 10 గంటలకు ప్రజల మధ్యలో ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయబోతున్నారు. ఇందుకు ఢిల్లీలోని రామ్‌లీలా మైదానంలో... ఏర్పాట్లు పూర్తయ్యాయి. మొత్తం 40000 కుర్చీలు ఏర్పాటు చేశారు. అలాగే... ప్రజలంతా ఈ కార్యక్రమాన్ని చూసేందుకు.. అన్నివైపులా డిజిటల్ టీవీ స్క్రీన్లు సెట్ చేశారు. 3000 మంది పోలీసులు, పారామిలటరీ దళాలు భద్రత కల్పిస్తున్నాయి. అలాగే కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 2 వరకు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో ఉంటాయి. ప్రత్యేకత ఏంటంటే... ఈ ప్రమాణ స్వీకారానికి... ప్రధాని నరేంద్ర మోదీని అహ్వానించడంతోపాటూ... ఢిల్లీని అభివృద్ధి చేసినవారిలో 50 మందిని ప్రత్యేకంగా ఆహ్వానిస్తున్నారు. వారిలో టీచర్లు, డాక్టర్లు, విద్యార్థులు, రైతులు, కార్మికులు, ఆటోడ్రైవర్లు, మెట్రో రైలు డ్రైవర్లు, బస్సు డ్రైవర్లు, అంగన్ వాడి కార్యకర్తలు, ప్యూన్లు ఇలా వేర్వేరు రంగాల్లో సేవలు అందించిన వారే. వాళ్లంతా వేదికపై ఉండగా వాళ్ల మధ్యలో, వాళ్ల సమక్షంలో కేజ్రీవాల్ ప్రమాణ స్వీకారం చేయబోతున్నారు. కేజ్రీవాల్‌తో పాటు ఆరుగురు మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. వాళ్లంతా గత ప్రభుత్వంలో పనిచేసిన మంత్రులే. ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజల్... అరవింద్ కేజ్రీవాల్‌తో ప్రమాణ స్వీకారం చేయిస్తారు. మామూలుగా అయితే... ఇలాంటి కార్యక్రమాలకు ఇతర రాష్ట్రాల సీఎంలను ఆహ్వానిస్తుంటారు. కేజ్రీవాల్ మాత్రం తన కార్యక్రమానికి ఏ సీఎంలనూ, రాజకీయ నేతలనూ ఆహ్వానించట్లేదు. ప్రజలే గెలిపించారనీ, ప్రజల మధ్యే కార్యక్రమం ఉంటుందని తెలిపి అందర్నీ ఆకర్షించారు.
తాజా ఎన్నికల్లో ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాల్లో ఆప్... 62 గెలవగా... బీజేపీ 8 గెలుచుకుంది. బీజేపీ గతంలో కంటే 5 స్థానాలు మాత్రమే ఎక్కువగా గెలవగలిగింది. బుధవారం ఆప్ ఎమ్మెల్యేలు సంప్రదాయం ప్రకారం తమ శాసనసభాపక్ష నేతగా కేజ్రీవాల్‌ని ఎంచుకున్నారు. కేజ్రీవాల్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ప్రధాని నరేంద్ర మోదీని ఆహ్వానించడం చర్చనీయాంశం అయ్యింది. మరి మోదీ వస్తారో రారా అన్నది తేలలేదు. రాకపోవచ్చని ఢిల్లీ కేంద్ర వర్గాలు చెబుతున్నాయి. ఎందుకంటే... ప్రధాని మోదీ నేడు తన సొంత నియోజకవర్గం వారణాసిలో 30కి పైగా ప్రాజెక్టుల ప్రారంభానికి వెళ్లనున్నారు. అందువల్ల ఢిల్లీ నుంచి లోక్‌సభకు ఎన్నికైన ఏడుగురు బీజేపీ ఎంపీలు, ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికైన ఎనిమిది మంది కొత్త ఎమ్మెల్యేలు ఈ ప్రమాణ స్వీకారానికి వస్తారని తెలుస్తోంది.
Published by:Krishna Kumar N
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.