DELHI CM KEJRIWAL SAYS CORONA RULES MUST BE FOLLOWED OR LOCKDOWN WILL BE IMPOSED EVK
Covid 19 Rules: రూల్స్ పాటించారా సరే.. లేదా లాక్డౌన్ తప్పదంటున్న సీఎం
(ప్రతీకాత్మక చిత్రం)
Corona Restrictions | దేశంలో కరోనా కేసులు రోజురోజుకు పెరగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు పలు ఆంక్షలు విధిస్తున్నాయి. దేశ రాజధానిలో ఢిల్లో పరిస్థితి మరీ ఎక్కువగా ఉంది. కరోనా కేసుల కారణంగా ఏయిమ్స్ వైద్య సిబ్బంది సెలవులు రద్దు చేశారు. తాజగా సీఎం కేజ్రీవాల్ రాష్ట్ర ప్రజలకు సున్నితమైన హెచ్చరింక చేశారు.
దేశంలో కరోనా కేసులు (Corona Cases) రోజురోజుకు పెరగిపోతున్నాయి. ఈ నేపథ్యంలో ఆయా రాష్ట్రాలు పలు ఆంక్షలు విధిస్తున్నాయి. దేశ రాజధానిలో ఢిల్లీ (Delhi) లో పరిస్థితి మరీ ఎక్కువగా ఉంది. కరోనా కేసుల కారణంగా ఏయిమ్స్ వైద్య సిబ్బంది సెలవులు రద్దు చేశారు. తాజగా సీఎం కేజ్రీవాల్ రాష్ట్ర ప్రజలకు సున్నితమైన హెచ్చరింక చేశారు. ప్రస్తుతం లాక్డౌన్ విధంచడం లేదని అన్నారు. ప్రజలు కోవిడ్ నిబంధనలు పాటించి.. మాస్కులు, భౌతిక దూరం పాటిస్తే మంచిదని అన్నారు. కోవిడ్ నిబంధనలు పాటించకుంటే లాక్డౌన్ (Lock Down) తప్పదని స్పష్టం చేశారు. కేసులు పెరుగుతున్నంత మాత్రానా భయ పడాల్సిన అవసరం లేదని అన్నారు. సమిష్టిగా కరోనా మహమ్మారిని ఎదుర్కొవచ్చని అన్నారు.
ప్రస్తుతం దేశ రాజధాని ఢిల్లీలో రోజువారీ కరోనా కేసులు రోజురోజుకి పెరిగిపోతోంది. శనివారం ఏకంగా 20 వేలు దాటిపోయాయి. పాజిటివిటీ రేటు సైతం 19.60 శాతానికి చేరుకుంది. మరోవైపు మహమ్మారి కట్టడి కోసం ఆప్ ప్రభుత్వం ఇప్ప టికే వీకెండ్ లాక్డౌన్ ప్రకటించింది.
దేశంలో రోజురోజుకి కరోనా కేసులు (Corona Cases) పెరుగుతున్నాయి. దాదాపుగా మూడో వేవ్ వచ్చినట్టే అని నిపుణులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఐఐటీ మద్రాస్ తాజాగా సర్వే నిర్వహించింది. దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో దేశంలో మూడో వేవ్ గరిష్టస్థాయికి ఎప్పుడు చేరుతుందో ప్రాథమిక విశ్లేషణ వేసింది.
ప్రస్తుతం దేశంలో కరోనా పెరుగుదల రేటు ఆధారంగా పలు విశ్లేషణలు చేసిన ఐఐటీ మద్రాస్.. ఫిబ్రవరి 1-15 మధ్య మూడవ వేవ్ యొక్క గరిష్ట స్థాయిని తాకుతుందని తెలిపింది. ఇన్ఫెక్షన్ రేటు అధికంగా ఉంటుందని సర్వేలో వివరించారు. అయితే వ్యాక్సినేషన్, కోవిడ్ నిబంధనలు ఈ రేటును ప్రభావితం చేయగలవని వైద్య నిపుణులు చెబుతున్నారు.
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం ఒమిక్రాన్ (Omicron) కారణంగా దేశంలో కరోనా కేసుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని తెలిపింది. కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో ఆర్-నాట్ విలువ 1.69 ఉందని తెలిపింది. ప్రస్తుతం భారతదేశంలో ఒకే రోజు 1,41,986 కొత్త కరోనావైరస్ (Corona Virus) కేసులు వచ్చాయి. ఇప్పటి వరకు కోవిడ్ కేసుల సంఖ్య 3,53,68,372కి చేరుకుంది. ఇందులో 27 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో ఇప్పటివరకు నమోదైన 3,071 ఓమిక్రాన్ వేరియంట్ కేసులు ఉన్నాయని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ శనివారం తెలిపింది.
Published by:Sharath Chandra
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.