Kejriwal : తన ప్రమాణ స్వీకారానికి మోదీని ఆహ్వానించిన కేజ్రీవాల్... వస్తారా?

Kejriwal Swearing-In Ceremony : వాలెంటైన్స్ డే నాడు ప్రమాణ స్వీకారం చేయదలచి... తీరా ఆదివారానికి వాయిదా వేసుకున్న అరవింద్ కేజ్రీవాల్... ప్రమాణ స్వీకారానికి ప్రధాని మోదీని ఆహ్వానించడం ఆసక్తికరం.

news18-telugu
Updated: February 14, 2020, 2:58 PM IST
Kejriwal : తన ప్రమాణ స్వీకారానికి మోదీని ఆహ్వానించిన కేజ్రీవాల్... వస్తారా?
Kejriwal : తన ప్రమాణ స్వీకారానికి మోదీని ఆహ్వానించిన కేజ్రీవాల్... వస్తారా?
  • Share this:
Delhi CM Kejriwal Swearing-In Ceremony : ఈసారి తాను ముఖ్యమంత్రిగా ప్రజల మధ్యలో ప్రమాణ స్వీకారం చేస్తానని ప్రకటించి సంచలనానికి తెరతీశారు ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో అద్భుత విజయాన్ని అందుకొని మూడోసారి సీఎం పీఠం ఎక్కబోతున్న అరవింద్ కేజ్రీవాల్. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఆహ్వానించడం ఇప్పుడు మరో సెన్సేషన్ అయ్యింది. ఢిల్లీ ఎన్నికల ప్రచారంలో... బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ హోరాహోరీగా తలపడ్డాయి. ఈ పోరులో... బీజేపీ పెద్దల ఎత్తుగడలేవీ ఫలించలేదు. దాంతో బీజేపీ అంచనాలన్నీ తలకిందులయ్యాయి. ఆ తర్వాత కేజ్రీవాల్‌కి ప్రధాని నరేంద్ర మోదీతోపాటూ... మమతా బెనర్జీ, ప్రకాష్ జవదేకర్, కమల్ హాసన్ తదితరులు కేజ్రీవాల్‌కి శుభాకాంక్షలు తెలిపారు. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సైతం... తమ అంచనాలు తప్పాయనీ... తాము అనుకున్నట్లుగా ఫలితాలు రాలేదని చెప్పారు. అంతమాత్రాన ఈ ఫలితాలతో ప్రజలు... పౌరసత్వ చట్టం (CAA), జాతీయ పౌర పట్టిక (NRC)ని వ్యతిరేకించినట్లు కాదని అన్నారు. అక్కడితో రాజకీయ పోరుకు తెరపడినట్లైంది. ఇప్పుడు ఆదివారం (ఫిబ్రవరి 16) రామ్ లీలా మైదానంలో ప్రమాణ స్వీకారం చేయబోతున్న కేజ్రీవాల్ పిలుపుతో... నరేంద్రమోదీ హాజరవుతారా లేదా అన్నది తేలాల్సి ఉంది.

తాజా ఎన్నికల్లో ఢిల్లీలోని 70 అసెంబ్లీ స్థానాల్లో ఆప్... 62 గెలవగా... బీజేపీ 8 గెలుచుకుంది. బీజేపీ గతంలో కంటే 5 స్థానాలు మాత్రమే ఎక్కువగా గెలవగలిగింది. తాజాగా బుధవారం ఆప్ ఎమ్మెల్యేలు సంప్రదాయం ప్రకారం తమ శాసనసభాపక్ష నేతగా కేజ్రీవాల్‌ని ఎంచుకున్నారు.

ఈసారి కేజ్రీవాల్ తన ప్రమాణ స్వీకారోత్సవానికి ఎలాంటి రాజకీయ హంగు ఆర్భాటాలు లేకుండా సింపుల్‌గా జరుపుకోవాలని అనుకున్నారు. అంతేకాదు ఇతర రాష్ట్రాలకు చెందిన సీఎంలు, రాజకీయ ప్రముఖులెవరికీ ఆహ్వానం ఇవ్వలేదు. తనపై నమ్మకంతో మళ్లీ అధికారం కట్టబెట్టిన ఢిల్లీ ప్రజల మధ్యే సీఎంగా ప్రమాణం చేయాలని నిర్ణయించుకున్నారు కేజ్రీవాల్. అలాంటి ఆయన మోదీని ఆహ్వానించడం ఇప్పుడు చర్చనీయాంశం అయ్యింది. మరి మోదీ వస్తారో రారో.

First published: February 14, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు