హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

టార్గెట్ పంజాబ్.. మూడు కీలక హామీలు ప్రకటించిన కేజ్రీవాల్.. ఢిల్లీ తరహాలోనే..

టార్గెట్ పంజాబ్.. మూడు కీలక హామీలు ప్రకటించిన కేజ్రీవాల్.. ఢిల్లీ తరహాలోనే..

అరవింద్ కేజ్రీవాల్ (ఫైల్ ఫోటో)

అరవింద్ కేజ్రీవాల్ (ఫైల్ ఫోటో)

Arvind Kejriwal: ఢిల్లీలో మొదటిసారి 2013లో తాము పోటీ చేసినప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్లుల భారంతో ప్రజలు విసిగిపోయేవారని కేజ్రీవాల్ అన్నారు.

  ఢిల్లీ తరువాత పంజాబ్‌లో కాస్త ఎక్కువ ప్రభావం చూపించే ఆమ్ ఆద్మీ పార్టీ... వచ్చే ఏడాది ఆ రాష్ట్రంలో జరగబోయే అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటేందుకు ప్రయత్నాలు మొదలుపెట్టింది. ఈ క్రమంలో అక్కడ ప్రజలను ఆకర్షించే హామీలు కురిపించింది. పంజాబ్‌లో తమ పార్టీ గెలిస్తే ప్రతి కుటుంబానికి 300 యూనిట్ల వరకూ ఉచిత విద్యుత్ ఇస్తామని ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ హామీ ఇచ్చారు. వీటితోపాటు ఇళ్లకు వాడే విద్యుత్ బిల్లుల బకాయిలను రద్దుచేస్తామని అన్నారు. విద్యుత్ కనెక్షన్లను పునరుద్ధరిస్తామని, 24 గంటలూ విద్యుత్ సరఫరా చేస్తామని తెలిపారు.

  ఢిల్లీలో మొదటిసారి 2013లో తాము పోటీ చేసినప్పుడు ఎలక్ట్రిసిటీ బిల్లుల భారంతో ప్రజలు విసిగిపోయేవారని కేజ్రీవాల్ అన్నారు. పంజాబ్‌ తరహాలోనే అక్కడి ప్రభుత్వం విద్యుత్ కంపెనీలతో కుమ్మక్కయ్యేదని ఆరోపించారు. ఇప్పుడు అతి తక్కువ ధరకే నిరంతరాయ విద్యుత్‌ను అందిస్తున్నామని తెలిపారు. పంజాబ్‌లోనూ అదే పని చేస్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఏ ఒక్కరూ పాత బిల్లులు చెల్లించవద్దని.. తాము అధికారంలోకి రాగానే విద్యుత్ బిల్లుల బకాయిలు రద్దు చేస్తామని హామీ ఇచ్చారు.

  Published by:Kishore Akkaladevi
  First published:

  Tags: AAP, Aravind Kejriwal, Punjab

  ఉత్తమ కథలు