Home /News /national /

DELHI CHIEF MINISTER ARVIND KEJRIWAL HAS GIVEN 5 PROMISES TO THE PEOPLE OF THE SCHEDULED CASTES PRV

Dalits: పంజాబ్​లోని దళితులకు ఐదు హామీలు ప్రకటించిన ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్​ కేజ్రీవాల్​.. జోరుగా సాగుతున్న ప్రచార పర్వం

ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ (ఫైల్ ఫోటో)

ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్ (ఫైల్ ఫోటో)

పంజాబ్​లో పలు వర్గాలకు ఇప్పటికే  వ‌రాల జల్లు కురిపించిన  ఢిల్లీ ముఖ్యమంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ ద‌ళితులు , అణ‌గారిన‌ వ‌ర్గాల కోసం మ‌రిన్ని హామీలు గుప్పించారు. షెడ్యూల్డ్ కులాల (Schedule caste) ప్రజలకు 5 హామీలు చేశారు.

  అరవింద్​ కేజ్రీవాల్ (Aravind Kejriwal). సమాజ సేవ పేరుతో రాజకీయాల్లోకి వచ్చి అనతికాలంలోనే అధికారాన్ని దక్కించుకున్న వ్యక్తి. ఢిల్లీలో అప్పటివరకు ఉన్న అధికార కాంగ్రెస్​.. ప్రతిపక్షంలో ఉన్న బీజేపీని మట్టికరిపించి అధికారాన్ని చేజిక్కించుకున్నారు. అయితే ఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతం కావడంతో కేంద్ర ప్రభుత్వంతో ఆప్​ ప్రభుత్వానికి ఇబ్బందులు తప్పట్లేదు. ఇదే క్రమంలో ఢిల్లీ సీఎం కేజ్రీవాల్​ (Delhi CM Aravind Kejriwal) పార్టీని విస్తరించే పనిలో పడ్డారు. దేశంలోని ఆయా రాష్ట్రాల్లో పోటీలో తన పార్టీ అభ్యర్థులను నిలుపుతున్నారు కేజ్రీవాల్​. ఇదే క్రమంలో పంజాబ్​లోనూ అధికారమే లక్ష్యంగా దూసుకెళుతున్నారు ఢిల్లీ సీఎం. అయితే పంజాబ్ (Punjab)​లో ఎన్నికలు కొన్ని నెలల్లోనే ప్రారంభం కానున్నాయి. ఈ క్రమంలో ఆయా పార్టీలు ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. వచ్చే ఏడాది జరగనున్న పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేందుకు ఆమ్ ఆద్మీ పార్టీ (Aam admi party) సరికొత్త హామీలను ప్రకటిస్తోంది.

  ఆమ్ ఆద్మీ పార్టీ ఆధ్వర్యంలో పంజాబ్​లోని హోషియార్‌పూర్‌లో నిర్వహించిన ఎన్నికల బహిరంగ సభలో కేజ్రీవాల్ ప్రసంగిస్తూ.. ఎస్సీ (Schedule caste) వ‌ర్గానికి చెందిన ముఖ్యమంత్రి చ‌న్ని ( CM channi) త‌న కులం కార్డు (caste card) వాడుతూ ఆ వ‌ర్గీయుల ఓట్లుకు గాలం వేశారని  ఆరోపించారు. తాను ఎస్సీ (Dalit) కాక‌పోయినా మీ కుటుంబ స‌భ్యుడిగా ముందుకొచ్చాన‌ని, కేవ‌లం కులం పేరుతో ఓట్లు కొల్లగొట్టాల‌ని చూస్తున్నార‌ని కేజ్రీవాల్ విమ‌ర్శించారు. ప్రతి బిడ్డకు మంచి విద్యను అందించాలని బాబాసాహెబ్ ఎన్నో కలలు కన్నారని, గత 75 ఏళ్లలో ఇదంతా జరగలేదన్నారు. ఇప్పుడు బాబా కలను నెరవేరుస్తామని కేజ్రీవాల్​ ప్రమాణం చేశారు . సమాజాన్ని వెనుకబాటుతనం నుండి పారద్రోలాలంటే, పేదరికాన్ని దూరం చేసి, మీ సమాజానికి హక్కులు కల్పించాలంటే, మంచి చదువులు చెప్పండి, మన పిల్లలు చదువుకుంటే, పేదరికం కలిసి పోతుందని, ఒక్కటే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పారని కేజ్రీవాల్ అన్నారు.

  5 వాగ్దానాలు..

  పంజాబ్​లో పలు వర్గాలకు ఇప్పటికే  వ‌రాల జల్లు కురిపించిన  ఢిల్లీ ముఖ్యమంత్రి అర‌వింద్ కేజ్రీవాల్ ద‌ళితులు (Dalits) , అణ‌గారిన‌ వ‌ర్గాల కోసం మ‌రిన్ని హామీలు గుప్పించారు. షెడ్యూల్డ్ కులాల (Schedule caste) ప్రజలకు ఐదు హామీలు చేశారు. తాము అధికారంలోకి వ‌స్తే ఎస్సీ విద్యార్ధుల‌కు (for students) ఉచిత విద్య అందించ‌డంతో పాటు ఐఏఎస్‌, మెడిక‌ల్‌, ఐఐటీల‌కు ఉచిత కోచింగ్‌ (free coaching), ఉచిత విదేశీ విద్య‌, ఉచిత వైద్యం (free treatment) అందుబాటులోకి తీసుకువ‌స్తామ‌ని హామీ ఇచ్చారు. 18 సంవత్సరాలు దాటిన మ‌హిళ‌ల‌కు నెల‌కు 1,000 రూపాయలు అందిస్తామ‌ని హామీ ఇచ్చారు.

  ప్రభుత్వ పాఠశాలలను నాశనం చేశారు..

  గత 75 ఏళ్లలో ఈ నాయకులు, పార్టీలు విద్యారంగాన్ని నాశనం చేశాయన్నారు. ఉద్దేశపూర్వకంగా నౌకాదళాన్ని, ప్రభుత్వ పాఠశాలలను (government schools) నాశనం చేశారని ఆరోపించారు. తద్వారా పేద దళిత, వెనుకబడిన తరగతుల పిల్లలు చదవలేకపోయారు. ఈ తరగతి వారి హక్కును సాధించలేక సమాన స్థాయిలో నిలబడలేకపోయారన్నారు.  కాంగ్రెస్‌కు ఓటేస్తే ప్రభుత్వ పాఠశాలలు బాగుపడవని ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ అన్నారు. మీ పిల్లలకు మంచి చదువులు చెప్పాలంటే ఈ ప్రభుత్వాన్ని మార్చండంటూ కేజ్రీవాల్ పిలుపునిచ్చారు.
  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: Aravind Kejriwal, Assembly Election 2022, Politics, Punjab

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు