రూ.60 కేజీ ఉల్లి రూ.24 కే.. బంపరాఫర్ ప్రకటించిన సీఎం

ప్రస్తుతం ఉల్లిని సేకరిస్తున్నామన్న కేజ్రీవాల్.. మొబైల్‌ వ్యాన్లలో ప్రజల వద్దకే ఉల్లిని పంపిస్తామని తెలిపారు. ఇతర కూరగాయల ధరలను కూడా నియంత్రిస్తున్నామని.. అందుబాటులో ధరల్లోనే ఢిల్లీ ప్రజలకు పంపిణీ చేస్తామని వెల్లడించారు.

news18-telugu
Updated: September 23, 2019, 7:43 PM IST
రూ.60 కేజీ ఉల్లి రూ.24 కే.. బంపరాఫర్ ప్రకటించిన సీఎం
ఉల్లి రైతు
  • Share this:
ఉల్లి ధరలు భగ్గుమంటున్నాయి. రోజు రోజుకూ పెరుగుతూ జనాలకు కన్నీళ్లు తెప్పిస్తున్నాయి. హైదరాబాద్‌లో కిలో ఉల్లి ధర రూ.50 ఉండగా.. దేశ రాజధాని ఢిల్లీలో మాత్రం రూ.60-70 పలుకుతోంది. మరింతగా పెరిగే అవకాశముందని మార్కెట్ నిపుణులు అంచనా వేయడంతో ఉల్లిని కొనలేని పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రజలకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ శుభవార్త చెప్పారు. మండుతున్న ఉల్లి నుంచి ఉపశమనం కల్పించే వార్త చెప్పారు. ఢిల్లీ వాసులకు రూ.24కే కిలో ఉల్లిని అందించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు.

ప్రస్తుతం ఉల్లిని సేకరిస్తున్నామన్న కేజ్రీవాల్.. మొబైల్‌ వ్యాన్లలో ప్రజల వద్దకే ఉల్లిని పంపిస్తామని తెలిపారు. ఇతర కూరగాయల ధరలను కూడా నియంత్రిస్తున్నామని.. అందుబాటులో ధరల్లోనే ఢిల్లీ ప్రజలకు పంపిణీ చేస్తామని వెల్లడించారు. ఢిల్లీలో వచ్చే ఏడాది ఎన్నికల నేపథ్యంలో ప్రజలపై వరాల జల్లు కురిపిస్తున్నారు కేజ్రీవాల్. మెట్రో రైళ్లు, బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ సౌకర్యం అందిస్తామని ఇప్పటికే ప్రకటించారు. అంతేకాదు విద్యుత్, నీటి బిల్లుల బకాయిలను సైతం రద్దు చేశారు.

First published: September 23, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు