Home /News /national /

DELHI CHIEF MINISTER ARAVIND KEJRIWAL ANNOUNCED THAT STATE GOVERNMENT GOING TO EXTEND FREE RATION SCHEME PRV

Aravind Kejriwal: ఢిల్లీ ప్రజలకు సీఎం అరవింద్​ కేజ్రివాల్​ శుభవార్త.. మరో 6 నెలలు ఆ పథకం పొడిగింపు

అరవింద్​ కేజ్రీవాల్​ (Photo: ANI/Twitter)

అరవింద్​ కేజ్రీవాల్​ (Photo: ANI/Twitter)

కరోనా తగ్గుముఖం పట్టడం.. వ్యాపారాలు, ఉపాధి అవకాశాలు మెరుగుపడటంతో ఆ ఉచిత రేషన్ పథకాన్ని ఈ నెలాఖరు తర్వాత నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. కానీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal) దీనిపై కీలక నిర్ణయం తీసుకున్నారు.

ఇంకా చదవండి ...
    కరోనా (corona) నేపథ్యంలో జీవితాలు తలకిందులయ్యాయి. లక్షలాది మంది ఉద్యోగాలు ఊడిపోయాయి. వారికి ప్రశాంతత (peace) కరువైంది. మిగతా వారు ఆర్థికంగా కుదేలయ్యారు. ఎన్నో మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నారు. కనీసం నిద్ర కూడా సరిగా పట్టనివారున్నారు. పేద, బడుగు వర్గాలు ఉపాధి కోల్పోయి దిక్కుతోచని స్థితికి చేరారు. ఈ నేపథ్యంలో దేశంలోని చాలా రాష్ట్రాలు ఉచిత రేషన్ (free ration) పంపిణీ చేశాయి. మొదటి వేవ్ నుంచి రెండో వేవ్ లో కూడా కేంద్ర ప్రభుత్వం (Union Government) కొనసాగించింది. అయితే, కరోనా తగ్గుముఖం పట్టడం.. వ్యాపారాలు, ఉపాధి అవకాశాలు మెరుగుపడటంతో ఆ ఉచిత రేషన్ పథకాన్ని ఈ నెలాఖరు తర్వాత నిలిపివేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

    మరో ఆరు నెలల పాటు పొడిగిస్తున్నట్లు..

    కానీ ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ (Aravind Kejriwal) దీనిపై కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ పథకాన్ని మరో ఆరు నెలల పాటు పొడిగిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన కీలక ఉత్తర్వులు జారీ చేశారు. కరోనా కష్టకాలంలో ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన కింద ఉచిత ఆహార ధాన్యాల సరఫరా ఈ నెలతో ముగియనుంది. అయితే దీనిని పొడిగించే ప్రతిపాదన లేదని కేంద్ర ప్రభుత్వం (Center government) శుక్రవారం స్పష్టం చేయడంతో.. దేశ రాజధాని ఢిల్లీలో ఉచిత రేషన్‌ పథకాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తున్నట్లు సీఎం అరవింద్ కేజ్రీవాల్ శనివారం ప్రకటించారు. దీనికి సంబంధించి సీఎం అరవింద్ ప్రకటన చేశారు.

    ఎన్నో రంగాలు అభివృద్ధికి దూరం అయ్యాయని..

    ఢిల్లీ (Delhi) లో మరో ఆరు నెలల పాటు ఉచిత రేషన్ పథకాన్ని పొడిగిస్తున్నట్లు సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రకటించారు. కరోనా కారణంగా ఎన్నో రంగాలు అభివృద్ధికి దూరం అయ్యాయని.. ద్రవ్యోల్బణం కూడా పెరిగిందని సీఎం (CM) ప్రస్తావించారు. కరోనా అనంతరం కూడా ఉపాధి అవకాశాలు మెరుగుపడక, నిరుద్యోగ సమస్య (Un employment) ఎక్కువగా ఉండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు సీఎం కేజ్రీవాల్ పేర్కొన్నారు. ఈ నిర్ణయంపై ప్రధాని మోడీ (Pm Narendra modi) ని ఆయన కోరినట్లు తెలిపారు. పేదలకు ఉచిత రేషన్ పథకాన్ని మరో ఆరు నెలల పొడిగించండి అంటూ ట్విట్టర్ ద్వారా అరవింద్ కేజ్రీవాల్ కోరారు . ఈ మేరకు పీఎం ప్రధాని మోదీకి ఉచిత రేషన్ (free ration) పథకాన్ని పొడిగించాలని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ట్వీట్ సైతం చేశారు. అయితే దీనిని పొడిగించే ప్రతిపాదన లేదని కేంద్ర ప్రభుత్వం (Center government) శుక్రవారం స్పష్టం చేయడంతో.. దేశ రాజధాని ఢిల్లీలో ఉచిత రేషన్‌ పథకాన్ని మరో ఆరు నెలలు పొడిగిస్తున్నట్లు సీఎం అరవింద్ కేజ్రీవాల్ శనివారం ప్రకటించారు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Aravind Kejriwal

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు