భారీగా తగ్గిన డీజిల్ ధర... అక్కడ ఒకేసారి 8 రూపాయలు తగ్గింపు

ప్రతీకాత్మక చిత్రం

ఢిల్లీలో డీజిల్‌పై విధిస్తున్న వ్యాట్ (VAT)ను 30శాతం నుంచి 16.75 శాతానికి తగ్గించారు. వ్యాట్ తగ్గించడంతో డీజిల్ ధరలు భారీగా తగ్గనున్నాయి.

 • Share this:
  కరోనా కష్టాల్లో ఉన్న ఢిల్లీ ప్రజలకు సీఎం అరవింద్ కేజ్రీవాల్ గుడ్ న్యూస్ చెప్పారు. ప్రజలపై ఆర్థిక భారం పడకుండా ఉండేందుకు కేబినెట్ సంచలన నిర్ణయం తీసుకుంది. ఢిల్లీలో డీజిల్‌పై విధిస్తున్న వ్యాట్ (VAT)ను 30శాతం నుంచి 16.75 శాతానికి తగ్గించారు. వ్యాట్ తగ్గించడంతో డీజిల్ ధరలు భారీగా తగ్గనున్నాయి. ఢిల్లీ లీటర్ డీజిల్‌పై రూ.8.36 తగ్గుతుందని సీఎం కేజ్రీవాల్ తెలిపారు. ఢిల్లీలో ప్రస్తుతం 82 రూపాయలున్న లీటర్ డీజిల్ ఇకపై రూ.73.64కే లభిస్తుంది.

  ఢిల్లీ ప్రభుత్వం ఇటీవల లాంచ్ చేసిన జాబ్ పోర్టల్‌కు మంచి స్పందన వస్తోందని సీఎం కేజ్రీవాల్ చెప్పారు. దాని ద్వారా యువత ఉపాధి అవకాశాలు కల్పిస్తామని చెప్పారు. అందులో ఇప్పటి వరకు 7,577 కంపెనీలు నమోదచేసుకున్నాయని.. 2లక్షలకు పైగా జాబ్స్‌ని అడ్వటైజ్ చేశాయని పేర్కొన్నారు. ఆ పోర్టల్‌లో 3,22,865 మంది యువత తమ పేర్లను నమోదు చేసుకున్నట్లు వెల్లడించారు. కరోనా సమయంలో వారందరికీ ఉపాధి కల్పించాలన్న ఉద్దేశంతోనే జాబ్ పోర్టల్‌ను లాంచ్ చేసినట్లు సీఎం కేజ్రీవాల్ తెలిపారు.

  కాగా, ఢిల్లీ వైద్య ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం.. అక్కడ ఇప్పటి వరకు 1,33,310 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కరోనా జయించి 1,18,633 మంది కోలుకోగా.. 3,907 మంది మరణించారు. ప్రస్తుతం ఢిల్లీలో 10,770 కరోనా యాక్టివ్ కేసులున్నాయి. కరోనా కేసులు ఎక్కువ నమోదైన రాష్ట్రాల్లో ఢిల్లీ మూడో స్థానంలో ఉంది. మహారాష్ట్ర, తమిళనాడు తర్వాత దేశ రాజధానిలోనే ఎక్కువ మంది కోవిడ్ బారినపడ్డారు.
  Published by:Shiva Kumar Addula
  First published: