Home /News /national /

DELHI BUSINESSMEN REQUESTED LIEUTENANT GOVERNOR TO CHANGE COVID 19 RESTRICTIONS AK

Delhi: మా గోడు వినండి.. లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌కు ఢిల్లీ వ్యాపారుల లేఖ.. అసలేం జరిగిందంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Delhi: మార్కెట్ల పని వేళలను ఉదయం 10.00 నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్ణయించవచ్చని అన్నారు. కోవిడ్ సేఫ్టీ ప్రోటోకాల్‌ల నిర్వహణతో భోజన హోటళ్లు, రెస్టారెంట్లు 50 శాతం సామర్థ్యంతో పనిచేయడానికి అనుమతించబడవచ్చని లేఖలో పేర్కొన్నారు.

    దేశ రాజధాని ఢిల్లీలో కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన తర్వాత ఆంక్షలను తొలగించాలని వ్యాపారులు డిమాండ్ చేశారు. రాత్రిపూట కర్ఫ్యూ ఎత్తివేయకూడదన్న నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని కోరారు. ఈ మేరకు ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ అనిల్ బైజాల్‌కు లేఖ రాశారు. కోవిడ్ వైరస్ వ్యాప్తి తగ్గుతున్నప్పుడు నిబంధనలను ఎందుకు సడలించడం లేదని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడర్స్ అసోసియేషన్ (CAIT) లేఖలో పేర్కొంది. కరోనా ఆంక్షల వల్ల తీవ్రంగా ఢిల్లీలో వ్యాపారం బాగా ప్రభావితమైందని లేఖలో వివరించారు. ప్రస్తుతం సమయంలో బేసి-సరి వ్యవస్థను, వారాంతపు లాక్‌డౌన్‌ను రద్దు చేయకూడదనే నిర్ణయాన్ని పునఃపరిశీలించవలసిందిగా అభ్యర్థిస్తున్నామని కోరారు. జనవరి 1 నుండి జనవరి 20 వరకు కరోనా ఆంక్షల కారణంగా ఢిల్లీలో వ్యాపారం దాదాపు 60% తగ్గిందని వ్యాపారులు తెలిపారు.

    గత రెండేళ్లుగా ఢిల్లీలో వ్యాపారం తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది. ఢిల్లీ లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌కి లేఖ ద్వారా సీఏఐటీ పలు విజ్ఞప్తులు చేసింది. బేసి-సరి వ్యవస్థ, వారాంతపు లాక్‌డౌన్‌ను తొలగించాలని కోరారు. టీకాలు వేసుకోని వ్యక్తులను వెళ్లడానికి అనుమతించకూడదని లేఖలో పేర్కొన్నారు. ట్రేడ్ యూనియన్‌లు తమ దుకాణాల్లో ఇప్పటికే పాటిస్తున్న కరోనా భద్రతా ప్రోటోకాల్‌లను తప్పనిసరిగా పాటించవలసిందిగా కోరవచ్చని అన్నారు.

    మార్కెట్‌కు వచ్చే సందర్శకుల నియంత్రణను నిర్ధారించడానికి వర్తక సంఘాల సహకారంతో స్థానిక పరిపాలనను నియమించవచ్చని అన్నారు. ప్రతి మార్కెట్‌లో ఇద్దరూ సంయుక్తంగా కొనుగోలుదారులకు తగిన స్క్రీనింగ్ ఉండేలా చూడాలని అన్నారు. దీనితో పాటు మార్కెట్ల పని వేళలను ఉదయం 10.00 నుండి సాయంత్రం 5 గంటల వరకు నిర్ణయించవచ్చని అన్నారు. కోవిడ్ సేఫ్టీ ప్రోటోకాల్‌ల నిర్వహణతో భోజన హోటళ్లు, రెస్టారెంట్లు 50 శాతం సామర్థ్యంతో పనిచేయడానికి అనుమతించబడవచ్చని లేఖలో పేర్కొన్నారు.

    UP Election : ప్రియాంక క్లారిటీ..యూపీ కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఆమే!

    Uttar Pradesh: ఉత్తరప్రదేశ్ ఎన్నికల కోసం మారిన బీజేపీ నినాదం.. మోదీ ఔర్ యోగి అంటూ..

    టీకాలు వేసుకోని వ్యక్తులను ఏ రెస్టారెంట్‌లోకి అనుమతించకూడదని అన్నారు. ఢిల్లీలోని ట్రేడ్ యూనియన్లు ఈ విషయంలో కచ్చితంగా ప్రభుత్వానికి సహకారం హామీ ఇచ్చారు. ఆర్థిక వ్యవస్థ, మంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఆర్థిక కార్యకలాపాలను కూడా అనుమతించాలని వ్యాపారులు సూచించారు. ఈ మేరకు లెఫ్ట్‌నెంట్ గవర్నర్‌ను కలిసేందుకు సమయం ఇవ్వాలని సీఏఐటీ కోరింది.
    Published by:Kishore Akkaladevi
    First published:

    Tags: Aravind Kejriwal, Delhi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు