హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలిసిన లాలూ యాదవ్, నితీష్ కుమార్ .. కారణం ఏంటంటే..

కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కలిసిన లాలూ యాదవ్, నితీష్ కుమార్ .. కారణం ఏంటంటే..

సోనియాగాంధీ, నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ (ఫైల్)

సోనియాగాంధీ, నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ (ఫైల్)

Delhi: కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీతో.. బీహార్ సీఎం నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్ భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కీలక అంశాలను గురించి చర్చించినట్లు తెలుస్తోంది.

  • News18 Telugu
  • Last Updated :
  • Delhi, India

బీహార్ (Bihar)  సీఎం నితీష్ కుమార్ (nitish kumar) పట్టువదలని విక్రమార్కుడిలా దూసుకుపోతున్నాడు. 2024 లో లోక్ సభ ఎన్నికలే టార్గెట్ గా ఢిల్లీలోని (Delhi)  కీలక నేతలను ఏ ఒక్కరిని వదలడంలేదు. వరుస పెట్టి మరీ అపోసిషన్ నాయకులను కలసి నాయకుల లీడర్ల ఐక్యత కోసం శక్తివంచనలేకుండా ప్రయత్నాలు చేస్తున్నారు. తాజాగా, ఆయన లాలు ప్రసాద్ యాదవ్ తో (lalu prasad  yadav)  కలిసి, ఢిల్లీలో కాంగ్రెస్ తాత్కలిక అధినేత్రి సోనియా గాంధీతో భేటీ అయ్యారు. ఈ క్రమంలో కొద్ది సేపు ఇద్దరు కూడా బీజేపీని ఎలాగైన గద్దెను దింపాలని చర్చించుకున్నట్లు సమాచారం. కాగా, ప్రస్తుతం కాంగ్రెస్ చీఫ్ ఎన్నికల నేపథ్యంలో సోనియా గాంధీ (sonia gandhi) తగినంత సమయం ఇవ్వలేకపోయారని తెలుస్తోంది.

ఈ నేపథ్యంలోనే సోనియా గాంధీ.. నితీష్ కుమార్ తో ఎన్నికల తర్వాత మరోసారి భేటీ అవుదామని చెప్పినట్లు సమాచారం. ఇదిలా ఉండగా సోనియా గాంధీతో భేటీ తర్వాత నితీష్ ఇంకాస్త జోష్ గా కన్పించారు. కాంగ్రెస్ తో కలిస్తే బీజేపీని సునాయసంగా ఓడించవచ్చని నితీష్ కుమార్ వ్యాఖ్యలు చేశారు.

గతంలో ఢిల్లీ పర్యటనకు వచ్చినప్పుడు సోనియా గాంధీ విదేశాల్లో ఉన్నారని అందుకే మరల ఇప్పుడు కలిసినట్లు నితీష్ కుమార్ తెలిపారు. మరోవైపు రాహుల్ గాంధీ (Rahul gandhi)  భారత్ జోడో యాత్ర (Bharat jodo yatra) కొనసాగుతుంది. ప్రజల నుంచి కూడా ఆయనకు మంచి ఆదరణ వస్తుంది.

ఇదిలా ఉండగా స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం.. షాడోల్ జిల్లాలోని జైసింగ్ నగర్‌లో ఓ ప్రభుత్వ పాఠశాల ఉంది.

ఐతే ఇటీవల ఓ ఐదో తరగతి బాలిక స్కూల్‌కు మురికి దుస్తులతో వచ్చింది. ఎప్పుడూ పరిశుభ్రత గురించి మాట్లాడే... ఓ టీచర్‌కు ఇది అస్సలు నచ్చలేదు. ఆ బాలికకు క్లాస్ తీసుకున్నాడు. అంతటితో ఆగలేదు.. ఆమె బట్టలు విప్పించి.. స్కూల్ ఆవరణలోనే సబ్బు పెట్టిమరీ ఉతికాడు. దుస్తులు పూర్తిగా ఆరిన తర్వాత.. ఆ విద్యార్థిని మళ్లీ వాటిని ధరించింది. అప్పటి వరకు గంటల తరబడి అర్ధనగ్నంగానే ఉంచారు. బాలిక దుస్తులను ఉతికిన ఫొటోలను సదరు ఉపాధ్యాయుడు.. డిపార్ట్‌మెంటల్ గ్రూప్‌లో పోస్ట్ చేశాడు. క్లీన్ ఫ్రెండ్ అని క్యాప్షన్ కూడా పెట్టాడు. అలా ఆ ఫొటో వైరల్ అయింది.

Published by:Paresh Inamdar
First published:

Tags: Delhi, Lalu Prasad Yadav, Nitish Kumar, Sonia Gandhi

ఉత్తమ కథలు