ఆరున్నర గంటల పాటు క్యూలైన్‌లోనే ఢిల్లీ సీఎం

బీజేపీ నేతలు ఉద్దేశపూర్వకంగానే డమ్మీ అభ్యర్థులను పంపి కేజ్రీవాల్ నామినేషన్‌కు అడ్డంకులు సృష్టించారని ఆమాద్మీ నేతలు ట్విటర్‌లో విమర్శలు గుప్పించారు. దీని వెనక పెద్ద కుట్రే జరుగుతోందంటూ ఆరోపించారు. ఐతే వారి ట్వీట్స్‌పై స్పందించిన కేజ్రీవాల్.. స్వతంత్ర అభ్యర్థులతో పాటు ఇలా వేచిచూడడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు.


Updated: January 21, 2020, 8:57 PM IST
ఆరున్నర గంటల పాటు క్యూలైన్‌లోనే ఢిల్లీ సీఎం
అరవింద్ కేజ్రీవాల్
  • Share this:
ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ఎట్టకేలకు నామినేషన్ దాఖలు చేశారు. ఉదయం నుంచి ఆరు గంటల పాటు క్యూలైన్‌లో ఉండి చివరి నిమిషంలో నామినేషన్ వేశారు. ఢిల్లీలో నామినేషన్ల దాఖలుకు ఇవాళే ఆఖరి రోజు. వాస్తవానికి సోమవారమే నామినేషన్ వేయాలని కేజ్రీవాల్ అనుకున్నారు. కానీ రోడ్ షో ఆలస్యం కావడంతో సాధ్యం కాలేదు. ఈ క్రమంలో ఇవాళ నామినేషన్ వేసేందుకు జామ్‌నగర్ హౌస్‌కు వెళ్లారు. ఐతే ఆయన కంటే ముందే 50 మంది స్వతంత్ర అభ్యర్థులు క్యూలైన్‌లో ఉన్నారు. కేజ్రీవాల్ టోకెన్ నెం.45 రావడంతో ఆరుగంటల పాటు వేచిచూసి ఎట్టకేలకు సాయంత్రం నామినేషన్ దాఖలు చేశారు.

ఐతే నామినేషన్ల చివరి రోజున కేజ్రీవాల్‌తో పాటు 50 మంది నామినేషన్ల వేయడంపై ఆమాద్మీ నేతలు అనుమానం వ్యక్తం చేశారు. బీజేపీ నేతలు ఉద్దేశపూర్వకంగానే డమ్మీ అభ్యర్థులను పంపి కేజ్రీవాల్ నామినేషన్‌కు అడ్డంకులు సృష్టించారని ఆమాద్మీ నేతలు ట్విటర్‌లో విమర్శలు గుప్పించారు. దీని వెనక పెద్ద కుట్రే జరుగుతోందంటూ ఆరోపించారు. ఐతే వారి ట్వీట్స్‌పై స్పందించిన కేజ్రీవాల్.. స్వతంత్ర అభ్యర్థులతో పాటు ఇలా వేచిచూడడం సంతోషంగా ఉందని పేర్కొన్నారు. మొదటి సారి నామినేషన్ వేసినప్పడు తప్పులు జరగడం సహజమని.. అందుకే వారి నానిమినషన్ల దాఖలు ప్రక్రియ ఆలస్యం అయి ఉంటుందని అభిప్రాయపడ్డారు.

న్యూఢిల్లీలో సీఎం కేజ్రీవాల్‌పై బీజేపీ నుంచి యువమోర్చా అధ్యక్షుడు సునీల్ యాదవ్ పోటీ చేస్తున్నారు. కాగా, ఢిల్లీ అసెంబ్లీలోని మొత్తం 70 స్థానాలకు ఒకే దశలో పోలింగ్ జరగనుంది. ఫిబ్రవరి 8 పోలింగ్ జరగనుండగా.. ఫిబ్రవరి 11న ఫలితాలు వెల్లడిస్తారు.First published: January 21, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు