• HOME
  • »
  • NEWS
  • »
  • NATIONAL
  • »
  • DELHI ASSEMBLY ELECTIONS 2020 POLLING STARTS FOR DELHI ASSEMBLY ELECTIONS NK

Delhi Elections 2020 : ప్రారంభమైన ఢిల్లీ పోలింగ్... ఓటు వేసేందుకు వస్తున్న ప్రజలు

Delhi Elections 2020 : ప్రారంభమైన ఢిల్లీ పోలింగ్... ఓటు వేసేందుకు వస్తున్న ప్రజలు

Delhi Elections 2020 : ప్రారంభమైన ఢిల్లీ పోలింగ్... ఓటు వేసేందుకు వస్తున్న ప్రజలు (credit - twitter - DD India)

Delhi Assembly Elections 2020 : ఢిల్లీలో ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్... సాయంత్రం 6 గంటల వరకూ కొనసాగనుంది. ఆమ్ ఆద్మీ పార్టీ, బీజేపీ హోరాహోరీ పోరులో గెలిచేదెవరు?

  • Last Updated:
  • Share this:
    Delhi Assembly Elections 2020 : ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ప్రారంభమైంది. ఇప్పుడిప్పుడే ఓటర్లు పోలింగ్ కేంద్రాలకు వస్తున్నారు. ప్రారంభంలో పోలింగ్ మందకొడిగా ఉంది. కాసేపైతే... పోలింగ్ కేంద్రాలకు వచ్చే ఓటర్ల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. అధికార ఆమ్ ఆద్మీ పార్టీకి బీజేపీకి గట్టి పోటీ ఇస్తూ ప్రచారం సాగించడంతో... ఢిల్లీలో మళ్లీ గెలిచేది ఎవరన్నది ఆసక్తి రేపుతోంది. ఆల్రెడీ సర్వేలన్నీ ఆమ్ ఆద్మీ పార్టీవైపే మొగ్గు చూపినా... బీజేపీ ఏ స్థాయిలో పోటీ ఇస్తుందన్నది చర్చనీయాంశమైంది. ఇక ఈ ఎన్నికల్లో ప్రత్యేకతలేంటన్నది పరిశీలిస్తే... ఢిల్లీ అసెంబ్లీలోని మొత్తం 70 స్థానాలకూ ఇవాళ పోలింగ్ జరగబోతోంది. ఆప్, బీజేపీ, కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ ఉంది. మొత్తం 668 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. 1.47 కోట్ల మంది ఓటర్లు ఓటు వేయబోతున్నారు 13,750 పోలింగ్ కేంద్రాలున్నాయి. ఆసక్తికర విషయమేంటంటే... ఈసారి ఎలాగైనా గెలవాలని బీజేపీ... ఏకంగా 240 మంది ఎంపీలు, 59 మంది కేంద్ర మంత్రులు, 11 రాష్ట్రాల సీఎంలు, వెయ్యి మంది బీజేపీ కార్యకర్తల్ని రంగంలోకి దింపి భారీ ప్రచారం సాగించింది. కాంగ్రెస్ నుంచి రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, కొందరు సీనియర్ నేతలు ప్రచారం చేశారు. అనారోగ్యం వల్ల పార్టీ అధినేత్రి సోనియాగాంధీ ప్రచారానికి దూరంగా ఉన్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ తరపున కన్వీనర్, సీఎం కేజ్రీవాల్, పార్టీ కీలక నేతలు ప్రచారం సాగించారు. ఐతే... ఆప్ ఎక్కడా బీజేపీని ఇతర పార్టీలనూ టార్గెట్ చెయ్యలేదు. తమ పథకాలు, తాము చేసిన పనులను మాత్రమే చెబుతూ వచ్చింది. 2015లో ఇదే ఆప్... 67 అసెంబ్లీ స్థానాలు గెలవగా... బీజేపీ 3 గెలిచింది. ఈసారి ఆప్ ఎన్ని గెలుస్తుంది? బీజేపీకి ఎన్ని దక్కుతాయి అన్నదానిపై ప్రజలు ఎదురుచూస్తున్నారు. ఇవాళ పోలింగ్ ముగిశాక... 11న ఫలితాలు వస్తాయి.

    ఇవాళ ఎవరు ఎక్కడ ఓటు వేస్తారన్నది మరో ఆసక్తికర విషయం. కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ... నిర్మాణ్ భవన్ పోలింగ్ బూత్‌లో ఓటు వేయబోతున్నారు. మాజీ ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్... ఉదయం 10.30కి నిర్మాణ్ భవన్ పోలింగ్ బూత్‌లో ఓటు వేయబోతున్నారు. అలాగే కాంగ్రెస్ నేత ప్రియాంక గాంధీ ఉదయం 11.30 నుంచీ మధ్యాహ్నం 1 మధ్య... లోధీ ఎస్టేట్ దగ్గరున్న సర్దార్ పటేల్ విద్యాలయ పోలింగ్ బూత్‌కి వచ్చి ఓటు వేయబోతున్నారు. ఆప్ కన్వీనర్ కేజ్రీవాల్... ఉదయం 9 గంటలకు రాజ్‌పూర్ రోడ్డులోని రాజ్‌పురా స్టేట్ ట్రాన్స్‌పోర్ట్ అథార్టీ దగ్గరున్న పోలింగ్ కేంద్రంలో ఓటు వేస్తారు. ఇక ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా... ఉదయం 10 గంటలకు B32 పాండవ్ నగర్‌లోని MCD స్కూల్లో ఓటు వేస్తారు. మరో నేత గోపాల్ రాయ్... ఉదయం 8.30కి బాబర్ పూర్ రోడ్డులోని నగర్ నిగమ్ ప్రతిభా బాల్ బాలిక విద్యాలయంలో ఓటు వేస్తారు. మరో నేత సంజయ్ సింగ్ ఉదయం 11 గంటలకు నార్త్ అవెన్యూ లోని సెయింట్ కొలంబస్ స్కూల్ లో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్‌లో ఓటు వేస్తారు.


    Published by:Krishna Kumar N
    First published: