డేంజర్ బెల్స్... ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం..

డేంజర్ బెల్స్... ఢిల్లీలో ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం..

ప్రతీకాత్మక చిత్రం

Delhi Air Pollution : ఏక్యూఐ 0-50 మధ్యలో ఉంటే.. అక్కడ ఉన్న గాలి మంచిదిగా పరిగణిస్తారు. 51-100 మధ్యలో ఉంటే సంతృప్తికరమైనదిగా,101-200మధ్యలో ఉంటే ఒక మాదిరి పర్లేదు అన్నట్టుగా భావిస్తారు.

  • Last Updated:
  • Share this:
    ఢిల్లీలో వాయుకాలుష్యం తీవ్రమవుతోంది. ఆదివారం ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్(ఏక్యూఐ) 256కి చేరింది. శుక్రవారం 208,శనివారం 222గా నమోదైన ఏక్యూఐ ఆదివారం ఒక్కరోజే 30 పాయింట్లకు పైగా పెరగడం గమనార్హం. ఇక ఢిల్లీ శివారు ప్రాంతాలైన గజియాబాద్, ఫరీదాబాద్, నోయిడా, బాగ్‌పట్, ముర్తల్‌లో పరిస్థితి మరింత దారుణంగా ఉంది.ఈ ప్రాంతాల్లో ఏక్యూఐ 287,233, 275, 258,245గా నమోదైంది. హర్యానాలోని కర్నల్ జిల్లాలో ఏక్యూఐ ఏకంగా 351 పాయింట్లకు చేరినట్టు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు డేటాలో వెల్లడైంది.

    కాగా,ఏక్యూఐ 0-50 మధ్యలో ఉంటే.. అక్కడ ఉన్న గాలి మంచిదిగా పరిగణిస్తారు. 51-100 మధ్యలో ఉంటే సంతృప్తికరమైనదిగా, 101-200మధ్యలో ఉంటే ఒక మాదిరి పర్లేదు అన్నట్టుగా భావిస్తారు. ఇక 201-300 మధ్యలో ఏక్యూఐ ఉంటే అతి చెడుగాలిగా పరిగణిస్తారు. 301-400 మధ్యలో ఉంటే అత్యంత చెడు గాలిగా,401 దాటితే ప్రమాదకర స్థాయిగా భావిస్తారు. ఈ లెక్కన ఢిల్లీలో వాయు కాలుష్యం ఇప్పుడు ప్రమాదకర స్థాయికి దగ్గరలో ఉందనే చెప్పాలి. పంజాబ్,హర్యానా రాష్ట్రాల్లో పంటలు కోశాక.. వ్యర్థాలను తగలబెట్టడం కూడా వాయు కాలుష్యానికి కారణంగా చెబుతున్నారు.
    First published: