అసలే కరోనాతో విలవిల్లాడుతున్న దేశ ప్రజలను కొత్త కొత్త వైరస్లు కూడా టెన్షన్ పెడుతున్నాయి. ఇప్పటికే కేరళ ప్రజలను జికా వైరస్ భయపెట్టగా.. తాజా బర్డ్ ఫ్లూ కారణంగా దేశంలో ఒకరు చనిపోవడం కలకలం రేపుతోంది. హర్యానా రాష్ట్రానికి చెందిన 11 నెలల బాలుడు బర్డ్ ఫ్లూ సోకి..ఢిల్లీ ఎయిమ్స్ లో చనిపోయారని వార్తలు వచ్చాయి. దీంతో ఒక్కసారిగా అందరిలోనూ ఆందోళన నెలకొంది. బర్డ్ ఫ్లూ అనేది మనుషులకు కూడా సోకుతుందా ? అనే సందేహాలు వ్యక్తమయ్యాయి. అయితే దీనిపై ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా స్పష్టత ఇచ్చారు. బర్డ్ ఫ్లూ వైరస్ మనుషుల నుంచి మనుషులకు సోకే అవకాశం చాలా అరుదని వెల్లడించారు. ఇందులో భయపడాల్సిన అవసరం లేదని వ్యాఖ్యానించారు.
H5N1 వైరస్ పక్షుల నుంచి మనుషులకు వ్యాప్తి చెందడం చాలా అరుదని కామెంట్ చేసిన గులేరియా.. దీనిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. అయితే ఫౌల్ట్రీల్లో పనిచేసే వారందరూ జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన సూచించారు. వ్యక్తిగత పరిశుభ్రత కచ్చితంగా పాటించాలని తెలిపారు. ఇప్పటి వరకు మనుషుల నుంచి మనుషులకు బర్డ్ ఫ్లూ సంక్రమించినట్టు ఆధారాలు లేవని వేవియన్స్లోని మెడిసిన్ విభాగంలో అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ నీరజ్ నిశ్చల్ తెలిపారు. అధిక ఉష్టోగ్రత వద్ద ఆహారం వండిన సమయంలో వైరస్ చచ్చిపోతుందని తెలిపారు. గతంలో ఫౌల్ట్రీలో బర్డ్ ఫ్లూ కేసులు నమోదైన సమయం ప్రారంభంలోనే వైరస్ వ్యాప్తిని నివారించడం జరిగిందని ఎయిమ్స్ డైరెక్టర్ రణ్ దీప్ గులేరియా తెలిపారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.