హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Shocking: గుర్తుతెలియని దుండగుల బీభత్సం.. నడిరోడ్డుమీద కాల్పులు.. ఎక్కడంటే..

Shocking: గుర్తుతెలియని దుండగుల బీభత్సం.. నడిరోడ్డుమీద కాల్పులు.. ఎక్కడంటే..

కాల్పులు జరిగిన ప్రదేశం

కాల్పులు జరిగిన ప్రదేశం

Delhi: దుండగులు రోడ్డుమీద తీవ్ర అలజడి సృష్టించారు. ముఖాలకు మాస్క్ ధరించి వచ్చి కాల్పులకు తెగబడ్డారు. దీంతో రోడ్డుమీద వెళ్తున్న అమాయకులు ఇద్దరు మృతి చెందారు.

  • News18 Telugu
  • Last Updated :
  • Delhi, India

దేశంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఉగ్రవాద దాడుల జరగ వచ్చని ఇప్పటికే అనేక నిఘా సంస్థలు.. కేంద్రంతోపాటు, పలు రాష్ట్రాలకు హెచ్చరికలను జారీచేశాయి. ఈ నేపథ్యంలో పలు చోట్ల కొన్ని కాల్పుల (Gun firing) ఘటనలు, బాంబులు పేలుడు ఘటనలు సంభవించాయి. తాజాగా, ఢిల్లీలోని (Delhi) ముండ్కాలోని జేజే కాలనీ ప్రాంతంలో.. గుర్తుతెలియని వ్యక్తులు ఈ రోజు తెల్లవారు జామున కాల్పులు జరిపారు. దీనిలో ఇద్దరు వ్యక్తులు మృతి చెందగా, మరోక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు.

ఆగంతకుల ముఖానికి మాస్క్ ధరించి వచ్చి కాల్పులకు తెగబడినట్లు సమాచారం. ఇద్దరు వ్యక్తులు ముఖాలు కప్పుకుని వచ్చి, నా సోదరుడు.. హెచ్‌తో కూర్చున్న మరో ఇద్దరు వృద్ధులపై కాల్పులు జరిపారని స్థానికులు తెలిపారు. అక్కడ ఒక్కసారిగా భీతావహాకంగా మారిపోయింది. వెంటనే స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

ఇదిలా ఉండగా గతంలో  మహబూబ్ నగర్ పట్టణంలో తుపాకీ కాల్పులు కలకలం రేపాయి.

జిల్లా కేంద్రంలోని తిమ్మసానిపల్లిలో రైల్వే ట్రాక్ వద్ద తుపాకీ పేలిన శబ్దం వినిపించింది. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో.. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. పారిపోతున్న రవి, చిన్నయ్య అనే ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని ఆయుధాలను సీజ్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏడాది క్రితం ఓ కార్యక్రమంలో రవిని కొంత మంది కలిసి కొట్టారు. వారిపై కక్ష పెంచుకున్న రవి.. ఎలాగైనా చంపాలని పథకం రచించాడు. అందుకోసం స్నేహితుల సహకారంతో రూ.20వేలకు ఓ నాటు తుపాకీ కొన్నాడు. తనపై దాడిచేసిన వారిని ఆ తుపాకీతో హతమార్చాలని ప్లాన్ చేశాడు.

ఐతే తుపాకీని పేల్చడంపై రవికి అవగాహన లేదు. ఈ క్రమంలో శనివారం ఉదయం రైల్వే ట్రాక్ వద్దకు వెళ్లి ప్రాక్టీస్ చేశాడు. తుపాకీ పేలిన శబ్ధం గట్టిగా వినిపించడంతో ఇద్దరూ అడ్డంగా బుక్కయ్యాడు. పోలీసులు వచ్చి వారిని అదుపులోకి తీసుకున్నారు. రవి వద్ద నుంచి తుపాకీతో పాటు బుల్లెట్లు, వేట కొడవలిని స్వాధీనం చేసుకున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Delhi, Gun fire, VIRAL NEWS

ఉత్తమ కథలు