Home /News /national /

DELETE CHINA APPS GET FREE MASKS UP BJP MLA STARTS NEW CAMPAIGN SK

చైనా యాప్స్ డిలీట్ చేస్తే... బీజేపీ ఎమ్మెల్యే బంపర్ ఆఫర్

బీజేపీ జెండా

బీజేపీ జెండా

బీజేపీ యువ మోర్చా సహకారంతో ఆమె నియోజకవర్గంలో ఈ ప్రచారం చేస్తున్నారు. దీనికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది.

    గల్వాన్ ఘర్షణ తర్వాత చైనాపై భారతీయులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు. చైనా ఉత్పత్తులను నిలిపివేయాలని పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నారు. కొందరైతే రోడ్ల మీదకు చేరుకొని చైనా వస్తువులను తగులబెట్టారు. ఈ క్రమంలోనే కేంద్రం సంచలన నిర్ణయం తీసుకుంది. టిక్ టాక్‌తో పాటు 59 చైనీస్ యాప్స్‌ను భారత్‌లో నిషేధిస్తూ సంచలన నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పలు యాప్స్‌ ప్లే స్టోర్ నుంచి అదృశ్యమయ్యాయి. ఆల్రెడీ ఇన్‌స్టాల్ చేసిఉన్నా పనిచేయడం లేదు. ఐతే తాజాగా చైనీస్ యాప్స్‌కు సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే ప్రజలకు సంచలన ఆఫర్ ఇచ్చారు.

    యూపీలోని బహ్రెయిచ్ బీజేపీ ఎమ్మెల్యే అనుపమ జైస్వాల్ తన నియోజకవర్గం ప్రజలకు బంపర్ ఆఫర్ ఇచ్చారు. తమ మొబైల్ ఫోన్లలోని చైనా అప్లికేషన్స్‌ను డిలీట్ చేసిన వారికి ఉచితంగా ఫేస్ మాస్క్‌లను అందిస్తామని ప్రకటించారు. ఇప్పటికే తమ నియోజకవర్గంలో ఉచిత ఫేస్ మాస్క్‌ల పంపిణీ కార్యక్రమాన్ని చేపట్టారు. ప్రజలు స్వతహాగా చైనా అప్లికేషన్లను తొలగించేందుకే ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఆమె పేర్కొన్నారు. బీజేపీ మహిళా మోర్చా సహకారంతో ఆమె నియోజకవర్గంలో ఈ ప్రచారం చేస్తున్నారు. దీనికి ప్రజల నుంచి పెద్ద ఎత్తున స్పందన వస్తోంది.

    కాగా, టిక్ టాక్ సహా మొత్తం 59 చైనీస్ అప్లికేషన్స్‌ను భారత ప్రభుత్వం నిషేధించిన విషయం తెలిసిందే. విస్తృత డిజిటల్ మార్కెట్‌గా అవతరించిన భారతదేశంలో కోట్లాది భారతీయుల గోప్యతపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని.. చైనా యాప్స్‌తో దేశ సార్వభౌమత్వానికి, భద్రతకు ముప్పుందని ఫిర్యాదులు అందాయని ప్రభుత్వం పేర్కొంది. వీటిని దుర్వినియోగం చేస్తూ, డౌటా చౌర్యంతో పాటు విదేశాల్లో సర్వర్లకు అనధికారికంగా డేటాను తరలిస్తున్నారన్న సమాచారం ఉందని తెలిపింది. ఈ క్రమంలోనే చైనీస్ యాప్స్‌ను దేశంలో నిలిపివేస్తున్నట్లు స్పష్టం చేసింది.
    First published:

    Tags: Bjp, China Products, India-China, Uttar pradesh

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు