Sub-Machine Gun: సైనికుల చేతికి బ్రహ్మాస్త్రం అందించిన DRDO...ఇక చైనాకు చుక్కలే...

ప్రతీకాత్మకచిత్రం

జాయింట్ ప్రొటెక్టివ్ వెంచర్ కార్బైన్ (JVPC)గా పిలిచే ఈ సబ్ మెషిన్ గన్.. గ్యాస్ -ఆపరేటెడ్ సెమీ ఆటోమేటిక్ ఆయుధంగా పనిచేస్తుందని డీఆర్డీఓ తెలిపింది. నిమిషానికి 700 రౌండ్ల కంటే ఎక్కువ బుల్లెట్లు దూసుకువెళ్లే సామర్థ్యం ఉంటుందని డీఆర్డీఓ(DRDO) పేర్కొంది.

  • Share this:
భారత రక్షణ దళం(Indian Army)లోకి సరికొత్త మెషిన్ గన్ వచ్చి చేరింది. ఈ సబ్ మెషిన్ గన్(Sub-Machine Gun)ను పూర్తి స్వదేశీ టెక్నాలజీతో రూపొందించింది డిఫెన్స్ రిసెర్చ్ డెవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO). దీనికి సంబంధించిన చివరి దశ ట్రయల్స్ ను కూడా విజయవంతంగా పూర్తి చేసింది. ఈ మేరకు రక్షణ మంత్రిత్వ శాఖ ప్రకటన విడుదల చేసింది. కాగా, ట్రయల్స్ విజయవంతంగా పూర్తి కావడంతో 5.56x30 మి.మీ తుపాకీని త్రివిధ దళాలు వినియోగించుకునేందుకు మార్గం సుగమం అయిందని రక్షణ మంత్రిత్వ శాఖ(defence ministry) తెలిపింది. జాయింట్ ప్రొటెక్టివ్ వెంచర్ కార్బైన్ (JVPC)గా పిలిచే ఈ సబ్ మెషిన్ గన్.. గ్యాస్ -ఆపరేటెడ్ సెమీ ఆటోమేటిక్ ఆయుధంగా పనిచేస్తుందని డీఆర్డీఓ తెలిపింది. నిమిషానికి 700 రౌండ్ల కంటే ఎక్కువ బుల్లెట్లు దూసుకువెళ్లే సామర్థ్యం ఉంటుందని డీఆర్డీఓ(DRDO) పేర్కొంది. కాగా, జనరల్ స్టాఫ్ క్వాలిటేటివ్ రిక్వైర్మెంట్స్ (GSQR)లో దీని చివరి దశ ట్రయల్స్ విజయవంతంగా పూర్తిచేసింది డీఆర్డీఓ(DRDO). ఇది తీవ్రమైన ఎండలోనూ, అత్యంత చలి పరిస్థితుల్లోనూ పనిచేయగలదని తెలిపింది. దీనికి సంబంధించి విపరీతమైన ఉష్ణోగ్రత ఉన్న వేసవి పరిస్థితుల్లో, అత్యధిక ఎత్తులోని శీతాకాల పరిస్థితుల్లో నిర్వహించిన పరీక్షల్లో విజయవంతంగా నెగ్గింది.

100 మీటర్ల దూరంలోని శత్రువు గుండెల్లో బుల్లెట్లు దింపగలదు..

కాగా, పలు ఉత్తమ సామర్థ్యాలు కలిగిన ఈ గన్ 100 మీటర్ల కంటే ఎక్కువ దూరంలో ఉన్న శత్రువు గుండెల్లోకి బుల్లెట్లను సూటిగా దింపగలదని డీఆర్డీఓ(DRDO) పేర్కొంది. దీని మొత్తం బరువు మూడు కిలోల ఉంటుందని తెలిపింది. కాగా, క్వాలిటీ టెస్ట్తో పాటు రిలియబిలిటీ(reliability), ఆక్యురెసీ(accuracy), కఠినమైన పరిస్థితుల్లో పనితీరు వంటి వాటిని ఈ సబ్ మెషిన్ గన్ విజయవంతంగా పూర్తి చేసుకుంది. రక్షణ మంత్రిత్వ శాఖ(home ministry) పరిధిలోని DGQA (డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ క్వాలిటీ అస్యూరెన్స్) ఈ పరీక్షలను జరిపింది. త్రివిధ దళాలు ఈ ఆయుధాన్ని ఉపయోగించుకోవడానికి ఇప్పటికే హోం మంత్రిత్వ శాఖ ఆమోద ముద్ర వేసింది. కేంద్ర సాయుధ పోలీసు దళాలకు(central armed police forces), వివిధ రాష్ట్ర పోలీసు సంస్థలకు ఈ సబ్ మెషిన్ గన్ను అందివ్వడానికి చర్యలను ప్రారంభించాయని మంత్రిత్వ శాఖ ప్రకటనలో పేర్కొంది
Published by:Krishna Adithya
First published: