పెళ్లి తర్వాత యాసిడ్ బాధితురాలిగా దీపికా పదుకొనే

యాసిడ్ బాధితురాలిగా దీపికా పదుకొనే

పెళ్లి తర్వాత దీపిక.. చేస్తున్న తొలి చిత్రం కూడా ఇదే. ఈ సినిమాలో దీపికా జోడిగా విక్ర‌మ్ మాసే న‌టించ‌నున్నారు.

  • Share this:
ఇటీవలే బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ పెళ్లి చేసుకున్న దీపికా పదుకొనే వెండితెరపై మెరిసి ఏడాది అవుతోంది. అయితే తాజాగా ఆమె ఓ కొత్త సినిమాలో మరింత కొత్తగా కనపించబోతుంది. రోటిన్‌కు భిన్నమైన సినిమాల్లోనే ఎక్కువగా నటిస్తోంది దీపికా పదుకొనే. రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ చిత్రాలతో పాటు వైవిధ్య‌మైన చిత్రాల‌ను కూడా ఎంచుకుంటుంది దీపికా. ఇదే తరహాలో ఆమె ఢిల్లీ యాసిడ్ బాధితురాలు లక్ష్మీ అగర్వాల్ జీవితం ఆధారంగా తెరకెక్కుతున్న చప్పక్ చిత్రంలో దీపికా నటించబోతుంది. దీనిపై ‘చప్పక్’చిత్రానికి మొత్తం సిద్ధమయ్యిందంటూ దీపికా ట్విట్టర్‌లో ట్వీట్ చేశారు.

సంజయ్ లీలా భన్సాలీ డైరెక్షన్‌లో వచ్చిన పద్మావత్ తర్వాత దీపికా ఏ సినిమాలోనే నటించలేదు. పెళ్లి తర్వాత ఏం సినిమా చేయాలి? ఎలాంటి సినిమాల్లో నటించాలి అన్న దానిపై ఆలోచనలు చేసింది దీపికా. దీంతో ఆమె ఇప్పుడు చప్పక్ సినమాతో మరోసారి కెమెరా ముందుకొస్తోంది. చప్పక్ చిత్రానికి మేఘన్‌ గుల్జర్‌ దర్శకురాలు. ఈ సినిమా షూటింగ్‌ వచ్చే నెలలో స్టార్ట్‌ కానుంది. ప్రస్తుతం స్క్రిప్ట్‌ రీడింగ్‌ సెషన్స్‌ నడుస్తున్నాయి. ''చప్పక్‌' చిత్రానికి మొత్తం సిద్ధం' అని దీపికా తెలిపింది.

పెళ్లి తర్వాత దీపిక.. చేస్తున్న తొలి చిత్రం కూడా ఇదే. ఈ సినిమాలో దీపికా జోడిగా విక్ర‌మ్ మాసే న‌టించ‌నున్నారు. 2005లో యాసిడ్ దాడి కార‌ణంగా బాధింప‌బ‌డి, యాసిడ్ ఎటాక్స్‌కు వ్య‌తిరేకంగా పోరాటం చేస్తూ ప‌లు అవార్డులు అందుకున్నారు ల‌క్ష్మీ అగ‌ర్వాల్ . ఇప్పుడు ఆమె పాత్ర‌లో దీపిక న‌టించ‌నుండ‌టం బాలీవుడ్‌లో హాట్ టాపిక్ అయ్యింది.

First published: