JNU క్యాంపస్‌లో దీపికా పదుకొణె.. విద్యార్థుల ఆందోళనకు మద్దతు

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె మంగళవారం సాయంత్రం జేఎన్‌యూ క్యాంపస్‌లో ప్రత్యక్షమయ్యారు. హింసాత్మక ఘటనలను నిరసిస్తూ.. జేఎన్‌యూ బయట ఆందోళన చేస్తున్న విద్యార్థులకు ఆమె మద్దతు ప్రకటించారు.


Updated: January 7, 2020, 8:59 PM IST
JNU క్యాంపస్‌లో దీపికా పదుకొణె.. విద్యార్థుల ఆందోళనకు మద్దతు
జేఎన్‌యూ క్యాంపస్‌లో దీపికా పదుకొణె
  • Share this:
జేఎన్‌యూలో హింసాత్మక ఘటనలపై దేశవ్యాప్తంగా దుమారం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొణె మంగళవారం సాయంత్రం జేఎన్‌యూ క్యాంపస్‌లో ప్రత్యక్షమయ్యారు. హింసాత్మక ఘటనలను నిరసిస్తూ.. జేఎన్‌యూ బయట ఆందోళన చేస్తున్న విద్యార్థులకు ఆమె మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జేఎన్‌యూఎస్‌యూ మాజీ అధ్యక్షుడు కన్నయ్ కుమార్ కూడా పాల్గొన్నారు. ఐతే దీపికా జేఎన్‌యూకు వెళ్లడంపై బీజేపీ నేత తజిందర్ బగ్గా మండిపడ్డారు. దేశాన్ని ముక్కలు ముక్కలు చేస్తామంటూ నినదించిన వారికి దీపికా మద్దతు తెలపడం దౌర్భాగ్యమని విమర్శలు గుప్పించారు. దీపికా పదుకొణె వెంటనే క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.
ఆదివారం జేఎన్‌యూ క్యాంపస్‌లో హింస చెలరేగింది. గుర్తు తెలియని వ్యక్తులు ముసుగులు ధరించి క్యాంపస్‌లోకి చొరబడి విద్యార్థులు, అధ్యాపకులపై దాడి చేశారు. రాళ్లు, కర్రలతో హాస్టల్స్‌లోకి చొరబడి బీభత్సం సృష్టించారు. ఈ ఘటనలో జేఎన్‌ఎన్‌యూ విద్యార్థి సంఘం అధ్యక్షురాలు ఐషీ ఘోష్‌ సహా 40 మందికి పైగా విద్యార్థులు, అధ్యాపకులు గాయపడ్డారు. ప్రస్తుతం వారు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనతో జేఎన్‌యూలో పోలీస్ బలగాలు భారీగా మోహరించాయి. ఐతే జేఎన్‌యూలో హింసకు ఏబీవీపీయే కారణమని లెఫ్ట్ విద్యార్థి సంఘాలు ఆరోపిస్తున్నాయి. వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
Published by: Shiva Kumar Addula
First published: January 7, 2020, 8:45 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading