జయలలిత మేనకోడలు దీప రాజకీయాలకు గుడ్ బై...

తాను రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్టు దీప తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. అంతే కాదు తాను స్థాపించిన పార్టీని అన్నాడీఎంకేలో విలీనం చేశానని, ఇకపై తాను ఎలాంటి రాజకీయ కార్యకలాపాలకు దిగనని ప్రకటించారు. తనను ఎలాంటి రాజకీయ మీటింగులకు పిలవొద్దని కోరారు.

news18-telugu
Updated: July 31, 2019, 10:28 AM IST
జయలలిత మేనకోడలు దీప రాజకీయాలకు గుడ్ బై...
దీపా జయలలిత, జె. జయలలిత (Image : Facebook)
  • Share this:
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీప తాను రాజకీయాలనుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. జయలలిత మరణం తర్వాత తెరపైకి వచ్చిన దీప కొద్ది కాలం వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. అంతే కాదు ‘ఎంజీఆర్‌ అమ్మా దీపా పేరవై’ అని ఒక కొత్త పార్టీని సైతం ప్రారంభించి ఆవిడ రాజకీయ ఆరంగేట్రం చేశారు. అయితే క్రియాశీలక రాజకీయాల్లో ఆమె పెద్దగా రాణించలేక పోయారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలు, అలాగే ఉపఎన్నికల్లో సైతం దీప పార్టీ పెద్దగా సోదిలోకి రాకుండా పోయింది. దీంతో తాజాగా తాను రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్టు దీప తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. అంతే కాదు తాను స్థాపించిన పార్టీని అన్నాడీఎంకేలో విలీనం చేశానని, ఇకపై తాను ఎలాంటి రాజకీయ కార్యకలాపాలకు దిగనని ప్రకటించారు. తనను ఎలాంటి రాజకీయ మీటింగులకు పిలవొద్దని కోరారు.

రాజకీయాల్లో తాను మోసపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె ప్రకటించారు. అలాగే తాను రాజకీయాల్లో అడుగుపెట్టినప్పటికీ నుంచి అనేక బూతు కామెంట్లు వస్తున్నాయని, దీన్ని భరించలేనని ఆమె అన్నారు. మహిళలు రాజకీయాల్లో రాణించకుండా ఇలాంటి బూతు కామెంట్లు కారణం అవుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

First published: July 31, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు