DEEPA JAYAKUMAR THE NIECE OF JAYALALITHAA ANNOUNCED SHE QUIT POLITICS MK
జయలలిత మేనకోడలు దీప రాజకీయాలకు గుడ్ బై...
దీపా జయలలిత, జె. జయలలిత (Image : Facebook)
తాను రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్టు దీప తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. అంతే కాదు తాను స్థాపించిన పార్టీని అన్నాడీఎంకేలో విలీనం చేశానని, ఇకపై తాను ఎలాంటి రాజకీయ కార్యకలాపాలకు దిగనని ప్రకటించారు. తనను ఎలాంటి రాజకీయ మీటింగులకు పిలవొద్దని కోరారు.
తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మేనకోడలు దీప తాను రాజకీయాలనుంచి శాశ్వతంగా తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. జయలలిత మరణం తర్వాత తెరపైకి వచ్చిన దీప కొద్ది కాలం వార్తల్లో వ్యక్తిగా నిలిచారు. అంతే కాదు ‘ఎంజీఆర్ అమ్మా దీపా పేరవై’ అని ఒక కొత్త పార్టీని సైతం ప్రారంభించి ఆవిడ రాజకీయ ఆరంగేట్రం చేశారు. అయితే క్రియాశీలక రాజకీయాల్లో ఆమె పెద్దగా రాణించలేక పోయారు. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికలు, అలాగే ఉపఎన్నికల్లో సైతం దీప పార్టీ పెద్దగా సోదిలోకి రాకుండా పోయింది. దీంతో తాజాగా తాను రాజకీయాల నుంచి వైదొలగుతున్నట్టు దీప తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. అంతే కాదు తాను స్థాపించిన పార్టీని అన్నాడీఎంకేలో విలీనం చేశానని, ఇకపై తాను ఎలాంటి రాజకీయ కార్యకలాపాలకు దిగనని ప్రకటించారు. తనను ఎలాంటి రాజకీయ మీటింగులకు పిలవొద్దని కోరారు.
రాజకీయాల్లో తాను మోసపోవడం వల్లే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆమె ప్రకటించారు. అలాగే తాను రాజకీయాల్లో అడుగుపెట్టినప్పటికీ నుంచి అనేక బూతు కామెంట్లు వస్తున్నాయని, దీన్ని భరించలేనని ఆమె అన్నారు. మహిళలు రాజకీయాల్లో రాణించకుండా ఇలాంటి బూతు కామెంట్లు కారణం అవుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.