గతేడాది జనవరిలో జరిగిన రిపబ్లిక్ డే (Republic Day) హింసాకాండ కేసులో బెయిల్‌పై బయటకు వచ్చిన పంజాబీ నటుడు దీప్ సిద్ధూ రోడ్డు ప్రమాదంలో మరణించారు. ఢిల్లీని దాటవేసే కుండ్లీ-మనేసర్-పల్వాల్ (కేఎంపీ) ఎక్స్‌ప్రెస్‌వేపై ఈ ప్రమాదం జరిగింది. గతేడాది ఢిల్లీలో రిపబ్లిక్ డే రోజు జరిగి అల్లర్లు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఈ అల్లర్లో నిందితుడిగా దీప్ సిద్దూ (Deep Sidhu) ఉన్నారు. ఆయన మంగళవారం ఢిల్లీకి సమీపంలోని కుండ్లీ - మానేశర్ జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో దీప్ సిద్దూ మరణించారు. అభిమానులు, సామాజిక వేత్తలు ఆయన మృతికి సోషల్ మీడియా వేదికగా సంతాపం తెలుపుతున్నారు.
Hijab Row: హిజాబ్ వ్యవహారంపై నితీష్ కుమార్ ఆసక్తికర వ్యాఖ్యలు
ఎవరీ దీప్ సిద్దూ..
దీప్ సిద్దూ 1984లో పంజాబ్‌లోని ముక్తసర్‌లో జన్మించారు. లా చేసిన సిద్దూ . అటువైపు కాకుండా మోడలింగ్ వైపు దృష్టి సారించారు. మొదట కింగ్‌ఫిషర్ సంస్థ నిర్వహించిన మోడల్ హంట్‌లో విజేతగా నిలిచారు. అనంతరం గ్రాసిమ్ మిస్టర్ ఇండియా పోటీల్లో పాల్గొని గ్రాసిమ్ మిస్టర్ పర్సనాలిటీ, గ్రాసిమ్ మిస్టర్ టాలెంటెడ్‌గా గెలిచారు. హేమంత్ త్రివేది, రోహిత్ గాంధీ వంటి డిజైనర్ల కోసం ఆయన ముంబైలో ర్యాంప్ వాక్ నిర్వహించేవారు. అనంతరం న్యాయాయవాదిగా ప్రాక్టీస్ మొదలుపెట్టారు. మొదట సహారా ఇండియా పరివార్‌కు న్యాయ సలహాదారుగా ఆయన సేవలందించారు. తర్వాత హమ్మండస్ అనే బ్రిటీష్ న్యాయ సంస్థలో సిద్ధూ పనిచేశారు. ఈ కంపెనీ డిస్నీ, సోనీ పిక్చర్స్, ఇతర హాలీవుడ్ స్టూడియోలకు న్యాయ సేవలు అందించింది.
నటుడిగా అడుగులు..
మోడలింగ్, న్యాయవాద వృత్తి తర్వాత సిద్ధూ నటనవైపు అడుగుల వేశాడు. బాలాజీ టెలిఫిల్మ్స్‌కు లీగల్ హెడ్‌గా పనిచేసే క్రమంలోనే ఏక్తా కపూర్ సలహాతో నటలనోకి అడుగు పెట్టాడు. 2015లో రామ్తా జోగి అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
రాజకీయాలు..
నటనలో రాణిస్తూనే సిద్దూ రాజకీయాల్లోకి అడుగుపెట్టాడు. 2019 లోక్‌సభ ఎన్నికల సమయంలో రాజకీయాల్లోకి ప్రవేశించిన దీప్ సిద్ధూ.. గురుదాస్‌పూర్ నుంచి బీజేపీ ఎంపీగా బరిలోకి దిగిన బాలీవుడ్ నటుడు సన్నీ డియోల్ కోసం ప్రచారం చేశారు.
Allu Arjun: అప్పుడు మోదీ, యోగి.. ఇప్పుడు "పుష్ప".. సూరత్ మార్కెట్‌లో "పుష్ప" క్రేజ్
సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమం..
రాజకీయాల్లో ఉన్నప్పుడే కేంద్ర ప్రభుత్వం (Central Govt) తీసుకొచ్చిన సాగు చట్టాల (Farm Laws)కు వ్యతిరేకంగా రైతుల ఆందోళనలో ఆయన పాల్గొన్నారు. అయితే 2021లో జరిగిన గణతంత్ర దినోత్సవ పరేడ్ సందర్భంగా రైతులు నిర్వహించిన ర్యాలీలో పాల్గొన్న దీప్ సిద్ధూ.. చారిత్రక ఎర్రకోటపై మతపరమైన జెండా ఎగురవేసినందుకు రైతు సంఘాల నుంచి విమర్శలు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో సిద్ధూ, గ్యాంగ్‌స్టర్ లఖా సిధనాలపై పోలీసులు కేసులు సైతం నమోదు చేశారు.
రోడ్డు ప్రమాదంలో మృతి..
ఫిబ్రవరి 15, 2022న సిద్ధూ ఢిల్లీ నుంచి పంజాబ్ (Punjab) లోని భటిండాకు వెళుతుండగా, రాత్రి 9:30 గంటలకు ఆయన ప్రయాణిస్తున్న కారు ట్రైలర్ ట్రక్కును ఢీకొట్టిందని పోలీసులు తెలిపారు. అతనితో పాటు ప్రయాణిస్తున్న ఓ మహిళ ప్రాణాలతో బయటపడిందని పోలీసులు తెలిపారు. ఆయన మృతి చెందినట్లు ఆసుపత్రి అధికారులు తెలిపారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Farm Laws, Republic Day 2021