‘హిందూరాష్ట్రగా ప్రకటించండి.. లేదంటే చనిపోనివ్వండి..’ రాష్ట్రపతి, ప్రధానికి అయోధ్య మహంత్ సంచలన లేఖ

Ayodhya Mahant Paramhans das సంచలన లేఖ విడుదల చేశారు. ఏడు డిమాండ్లతో కూడిన లేఖను ఆయన రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ (kovind), ప్రధాని మోడీ (MODI) లకు లేఖ రాశారు.

news18
Updated: December 1, 2020, 6:23 PM IST
‘హిందూరాష్ట్రగా ప్రకటించండి.. లేదంటే చనిపోనివ్వండి..’ రాష్ట్రపతి, ప్రధానికి అయోధ్య మహంత్ సంచలన లేఖ
పరమహంస దాస్ (ఫైల్ ఫోటో)
  • News18
  • Last Updated: December 1, 2020, 6:23 PM IST
  • Share this:
కొద్దిరోజులుగా దేశంలో Right wing కార్యకర్తలు లేవనెత్తుతున్న డిమాండ్ తాజాగా మరోసారి చర్చనీయాంశమైంది. భారత్ ను హిందూరాష్ట్రగా ప్రకటించాలని డిమాండ్ చేస్తూ అయోధ్య మహంత్ పరమహంస దాస్.. రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్ర మోడీ లకు సంచలన లేఖ రాశారు. దేశం ఇప్పటికే విభజన కారణంగా చాలా కోల్పోయిందని.. మరో విభజన జరగకముందే దేశాన్ని హిందూ రాష్ట్రగా ప్రకటించాలని ఆయన డిమాండ్ చేశారు. దీంతో పాటే పలు ఇతర డిమాండ్లను కూడా తన లేఖలో ప్రస్తావించారు. తన డిమాండ్లను నెరవేర్చని పక్షంలో మరణానికైనా అవకాశమివ్వాలని ఆయన కోరారు. లేఖ పూర్తి సారాంశం కింది విధంగా ఉంది.

అయోధ్య లోని తపస్వి ఛాన్వి కి మహంత్ గా ఉన్న పరమహంస దాస్ తాజాగా మరోసారి వార్తల్లో వ్యక్తి అయ్యారు. ఏడు డిమాండ్లతో కూడిన లేఖను ఆయన విడుదల చేశారు. దేశం ఇప్పటికే ఒక విభజన కారణంగా చాలా కోల్పోయిందని.. మరో విభజనను చూడటానికి తాము ఒప్పుకోమని తెలిపారు. తాను రాస్తున్న ఈ లేఖ.. దేశాన్ని ఆ ప్రమాదం నుంచి తప్పించడానికే అని స్పష్టం చేశారు.

పరమహంస డిమాండ్లు

  1. దేశంలో జనాభా నియంత్రణ

  2. యూనిఫామ్ సివిల్ కోడ్ అమలు

  3. భారత్ ను హిందూరాష్ట్రగా ప్రకటించడం


  4. అమ్మాయిలకు ఉచిత విద్య

  5. యువతకు ఉపాధి

  6. ఆవును జాతీయ జంతువుగా గుర్తించడం

  7. రామాయణాన్ని జాతీయ ఇతిహాసంగా ప్రకటించడం.. దానిని సిలబస్ లో చేర్చడం.


పై ఏడు డిమాండ్లను నెరవేర్చాలని.. లేని పక్షంలో తన మరణానికైనా అనుమతి ఇవ్వాలని ఆయన కోవింద్, మోడీ లతో పాటు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యానాథ్, అయోధ్య మెజిస్ట్రేట్ లకు లేఖ లు రాశారు. ఇవే డిమాండ్ల మీద ఆయన అక్టోబర్ లో కూడా నిరవధిక దీక్షకు పూనుకున్న విషయం విధితమే. అయితే ఆయన ఆరోగ్యం క్షీణించడం.. పోలీసులు, ప్రభుత్వం సర్ది చెప్పడంతో ఆయన ఆ దీక్షను అర్థాంతరంగా ముగించారు. ఇక తాజాగా ఈ లేఖను విడుదల చేయడం గమనార్హం.
Published by: Srinivas Munigala
First published: December 1, 2020, 6:23 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading