హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Miracle: చనిపోయిన కొన్ని గంటల తర్వాత బతికి వచ్చాడు! తర్వాత ఏం జరిగిందో తెలిస్తే మళ్లీ షాక్‌ అవుతారు

Miracle: చనిపోయిన కొన్ని గంటల తర్వాత బతికి వచ్చాడు! తర్వాత ఏం జరిగిందో తెలిస్తే మళ్లీ షాక్‌ అవుతారు

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మరణాన్ని ఎవరూ ఆపలేరని.. విధి ఆడే నాటకంలో ప్రతీ ఒక్కరూ ఏదో ఒక రోజు చనిపోవాల్సిందేనన్న చేదు నిజాన్ని గ్రహించారు. ఇక అంతిమ సంస్కారాలకు అంతా సిద్ధం చేశారు.. అంతిమ స్నానం చేస్తుండగా ఓ షాకింగ్‌ ఘటన వెలుగుచూసింది.. చనిపోయిన వ్యక్తి లేచి మాట్లాడాడు..

ఇంకా చదవండి ...
  • Local18
  • Last Updated :
  • Hyderabad, India

క్యాన్సర్‌తో చనిపోయాడు.. చివరి చూపు కోసం బంధువులు, స్నేహితులు, తెలిసిన వాళ్లు భారీగా తరలివచ్చారు. అతను లేడన్న విషయాన్ని తలచుకుంటూ బోరున విలపించారు.. ఇక తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడని బాధ పడ్డారు.. ఇక సొంత కుటుంబసభ్యుల బాధకు వర్ణించాలేని విధంగా మారిపోయింది. వాళ్లను కంట్రోల్ చేయడం ఎవరీ వల్ల కాలేదు.. మరణాన్ని ఎవరూ ఆపలేరని.. విధి ఆడే నాటకంలో ప్రతీ ఒక్కరూ ఏదో ఒక రోజు చనిపోవాల్సిందేనన్న చేదు నిజాన్ని గ్రహించారు. ఇక అంతిమ సంస్కారాలకు అంతా సిద్ధం చేశారు.. అంతిమ స్నానం చేస్తుండగా ఓ షాకింగ్‌ ఘటన వెలుగుచూసింది.. చనిపోయిన వ్యక్తి లేచి మాట్లాడాడు.. నమ్మలేపోతున్నారా.?? ఈ ఘటన ఎక్కడ జరిగిందని ఆలోచిస్తున్నారా..? అయితే తెలుసుకోండి.

చనిపోయిన కొన్ని గంటలకు కళ్లుతెరిచాడు:

ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ జిల్లాలో ఈ వింత ఘటన వెలుగులోకి వచ్చింది. రూర్కీలోని ఝబ్రెడా పట్టణానికి చెందిన 58 ఏళ్ల దీపక్ కుమార్ కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతున్నాడు. అయితే ఉన్నట్టుండి దీపక్ ఆరోగ్యం అకస్మాత్తుగా క్షీణించింది. కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తీసుకెళ్లేలోపే మృతి చెందాడు. దీపక్ మరణవార్తతో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. కుటుంబ సభ్యులు బంధువులను సమాచారమిచ్చారు. అంతా వచ్చి దీపక్‌కు నివాళులు అర్పించారు. దీపక్ మృతదేహాన్ని శ్మశానవాటికకు తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. మృతదేహానికి అంతిమ స్నానం చేస్తుండగా దీపక్ లేచాడు. అక్కడున్న వారిని చూసి 'ఏం చేస్తున్నారు?' అని అడిగాడు. ఈ సీన్‌ చూసిన అక్కడున్న వారిలో కొంత స్పృహ కోల్పోయారు. వెంటనే తెరుకున్న కుటుంబసభ్యులు దీపక్‌ను మరోసారి ఆస్పత్రికి తరలించారు.

ఆస్పత్రికి తరలించేలోపే మళ్లీ మృతి:

అంతిమ స్నానం సమయంలో దీపక్ లేచి.. మాట్లాడి మళ్లీ పడిపోవడంతో ఆస్పత్రికి తరలించారు కుటుంబసభ్యులు. దీపక్‌ను రూర్కీ ఆస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కుటుంబ సభ్యులు మృతదేహంతో మళ్లీ గ్రామానికి చేరుకోవడంతో గ్రామస్తులు భారీగా తరలివచ్చారు. మృతదేహానికి కుటుంబసభ్యులు దహన సంస్కారాలు నిర్వహించారు. ఈ వింత సంఘటన ఝబ్రెడా ప్రాంతంలో చర్చనీయాంశంగా మారింది. అయితే గతంలోనూ ఇలాంటి ఘటనలు కొన్ని చోట్ల జరిగాయి. మృతదేహాన్ని శవపేటికలో పెట్టి గొయ్యిలో దించబోతుండగా బతికి మాట్లాడిన సందర్భాలూ గతంలోనూ జరిగాయి. చావు అంచుల వరకు వెళ్లి బతికి వచ్చినవాళ్లను చూసి ఉంటాం కానీ.. ఇలా చనిపోయిన వాళ్లు మాట్లాడి.. మళ్లీ తిరిగి చనిపోవడం కొన్ని సార్లు మాత్రమే జరిగింది.

First published:

Tags: Dead body, Uttarakhand

ఉత్తమ కథలు