హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Indian Railways: కోల్‌కతా అగ్ని ప్రమాదంలో 9కి చేరిన మృతుల సంఖ్య

Indian Railways: కోల్‌కతా అగ్ని ప్రమాదంలో 9కి చేరిన మృతుల సంఖ్య

కోల్‌కతాలో అగ్ని ప్రమాదం (image credit - twitter

కోల్‌కతాలో అగ్ని ప్రమాదం (image credit - twitter

Indian Railways: కోల్‌కతాలోని తూర్పు రైల్వే ప్రధాన కార్యాలయం దగ్గర జరిగిన అగ్ని ప్రమాదం... దేశవ్యాప్తంగా రైల్వే అధికారులను అప్రమత్తం చేసింది.

మన రైల్వే స్టేషన్లు సేఫ్టీగా ఉన్నాయా... అగ్ని ప్రమాదం జరిగితే... ప్రాణ నష్టం జరగకుండా అన్ని ముందస్తు చర్యలూ తీసుకుంటున్నారా... అనే ప్రశ్న తాజగా తెరపైకి వచ్చింది. ఇందుకు కారణం కోల్‌కతాలోని తూర్పు రైల్వే ప్రధాన కార్యాలయం దగ్గర జరిగిన భారీ అగ్ని ప్రమాదమే. ఈ విషాదంలో 9 మంది చనిపోయారు. ఘటనా స్థలానికి వెళ్లిన సీఎం మమతా బెనర్జీ... మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటించారు. సోమవారం సాయంత్రం ఈ ప్రమాదం జరగ్గా.... మంగళవారం ఉదయానికి మృతుల సంఖ్య 9కి చేరింది. స్ట్రాండ్ రోడ్‌లోని 14 అంతస్థుల న్యూ కోయిలఘాట్ భవనంలో... 13వ అంతస్థులో అగ్ని ప్రమాదం జరిగి మంటలు చెలరేగాయి. ప్రమాదంలో చనిపోయిన వారిలో నలుగురు అగ్నిమాపక సిబ్బంది, ఇద్దరు RPF జవాన్లు, ఓ కోల్‌కతా ASI ఉన్నట్లు బెంగాల్ ఫైర్ అండ్ ఎమర్జెన్సీ సేవల మంత్రి సుజిత్ బోస్ తెలిపారు.

కోయిలఘాట్ భవనంలో... రైల్వేకి సంబంధించిన హౌస్ ఆఫీసులు ఉన్నాయి. అగ్ని ప్రమాదం జరగగానే రైల్వే అధికారులు, కోల్‌కతా సీపీ సౌమెన్ మిత్రా, ఫైర్ మంత్రి సుజిత్ బోస్, క్రైమ్ జాయింట్ సీపీ మురళీధర్ తదితరులు స్పందించారు. ప్రమాదంలో మంటలు వెంటనే ఆర్పడానికి వీలు లేకుండా పోయింది. ఎందుకంటే ఆ భవనం చాలా ఇరుకుగా ఉంది. అగ్ని మాపక సిబ్బంది నిచ్చెనలు వేసుకొని ఎక్కే అవకాశం కూడా లేకుండాపోయింది.

సోమవారం రాత్రి ఘటనా స్థలానికి వచ్చిన ముఖ్యమంత్రి మమతా బెనర్జీ... సహాయ కార్యక్రమాలు ఎలా జరుగుతున్నాయో పరిశీలించారు. "చాలా బాధాకరం. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల చొప్పున పరిహారం ప్రకటిస్తున్నాం. అలాగే... కుటుంబ సభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తాం..." అని ఆమె తెలిపారు.

అగ్ని ప్రమాదం కారణంగా... కరెంటు సప్లైకి అంతరాయాలు కలిగాయి. దాంతో... అక్కడి రైల్వే స్టేషన్లలో కంప్యూటరైజ్డ్ టికెట్ బుకింగ్‌కి అంతరాయం కలిగింది. సర్వర్ రూమ్, ప్రయాణికుల రిజర్వేషన్ వ్యవస్థ అన్నీ ఆ భవనంలోనే ఉన్నాయి. మొత్తం 10 ఫైరింజన్లు మంటల్ని అదుపులోకి తెచ్చాయి. ప్రస్తుతం పరిస్థితి కంట్రోల్‌లో ఉంది.

ఈ ప్రమాదంపై రైల్వే మంత్రి పియూష్ గోయల్ ఆవేదన వ్యక్తం చేశారు. మృతుల కుటుంబీకులకు సంతాపం తెలిపారు. ఘటనపై హై లెవెల్ ఎంక్వైరీ జరిపిస్తామన్నారు.

ఇది కూడా చదవండి: Viral Video: నువ్వా...నేనా... చెట్టుపై తలపడిన చిరుతపులి... నల్ల చిరుతపులి

ఈ ఘటనకు ముందు... జమ్మూకాశ్మీర్‌లోని సోపోర్‌లో అగ్ని ప్రమాదం జరిగి 20 షాపులు తగలబడ్డాయి. అలాగే... మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌లో ఓ అగ్ని ప్రమాదం జరిగింది. అక్కడి ఎంఐడీసీలోని ప్రసిద్ధ వికో కంపెనీలో మంటలు చెలరేగాయి. ఇలా ఎండాకాలం మొదలవుతున్న సమయంలో జరుగుతున్న అగ్ని ప్రమాదాలు అలర్ట్ చేస్తున్నాయి.

First published:

Tags: Fire Accident, Kolkata

ఉత్తమ కథలు