DEATH SENTENCE TO ACCUSED WHO KILLED A FARMER IN UP VRY
UP crime : మేక చేసిన పనికి ఇద్దరు బలి... మరో ముగ్గురికి కోర్టు ఉరి.. ఇంతకి ఆ మేక ఏం చేసిందంటే....?
court verdict
UP crime : చేను మేసిందని ఓ రైతు మేకను కొట్టి చంపితే... ఆ రైతును మేక యజమాని తన స్నేహితులతో కలిసి కత్తులతో పొడిచి చంపాడు. ( Death sentence to accused who killed a farmer ) అయితే ఇది జరిగి సంవత్సరాలే గడుస్తున్నా.. నిందితులకు ఉరిశిక్ష విధించింది.
ఆరు గాలం రైతులు పండించిన పంటలు చివరి దశలో నాశనమై పోతే ... ఆ రైతు భాద ఎలా ఉంటుందో అందరికి తెలుసు.. రైతుకు అనేక రూపాల్లో కష్టాలు, నష్టాలు రావడం సహజం.. అవి ప్రకృతి రూపాల్లో అయితే తాము ఏమి చేయలేమని రైతు వాపోతాడు... అదే కళ్ల ముందే పంటను ఏ జంతువో.. నాశనం చేస్తుంటే మాత్రం చూస్తూ ఊరుకోలేడు.. ( Death sentence to accused who killed a farmer )దీంతో ఆవేశంతో ఆ జంతువులను ఏదో ఒకటి చేసి కట్టేయడం లేదా.. విపరీతంగా కొట్టడం లాంటీ సంఘటనలు బహుశా వ్యవసాయం పుట్టినప్పటి నుండి కూడా ఉండి ఉంటాయి. అయితే దీనికి కారణం ఆ పశువుల యజమానులు..
కాని ఓ రైతు చేనును మేసిన మేకను ఆ రైతు ఆవేశంతో విపరీతంగా మేకను కొట్టాడు. దీంతో అది చనిపోవడంతో మేక యజమాని కూడా మరో ఇద్దరిని వెంటతీసుకుని వెళ్లి, ఆ రైతుతో పాటు మరోకరి ప్రాణాలు తీశాడు. దీంతో ఆ మేక యజమానితో పాటు ఆయనకు సహకరించిన మరో ఇద్దరికి కోర్టు మరణ శిక్ష విధించింది.
వివాలలోకి వెళితే.. మార్చి 2007 ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రంలోని మావ్ జిల్లా పరిధి భికారిపూర్ గ్రామంలో అక్లు చౌహాన్ అనే వ్యక్తికి చెందిన మేక రామ్ సనేహి అనే రైతు పొలంలోని పంటను నాశనం చేసింది.( Death sentence to accused who killed a farmer ) తన పంటను నాశనం చేసిన మేకను, రామ్ సనేహి కొట్టడంతో ఆ మేక చనిపోయింది. ఈ విషయం తెలిసిన అక్లు చౌహాన్ తన మేకను చంపినందుకు రామ్ సనేహితో గొడవపడ్డాడు.
గొడవ పెద్దదై ఒకరినొకరు కొట్టుకున్నారు. ఆ తరువాత అక్లు చౌహాన్ వెళ్లి తన మిత్రులైన జైచంద్, రామ్ సారన్‌లను వెంట తీసుకువచ్చాడు.( Death sentence to accused who killed a farmer ) ఆ ముగ్గురూ కలిసి రామ్ సనేహిని కత్తులతో పొడిచి చంపేశారు. రామ్ సనేహిని కాపాడడానికి వచ్చిన పబ్బర్ అనే మరో వ్యక్తి కూడా ఈ ఘర్షణలో ప్రాణాలు కొల్పోయాడు.. దీంతో చిన్న గోడవ ఇద్దరి ప్రాణాలు తీసినట్టయింది.
కాగా దీనిపై కేసు నమోదు తర్వాత కోర్టులో సుమారు 12 సంవత్సరాల పాటు విచారణ కొనసాగింది. దీంతో ఈ సంఘటనను ప్రత్యక్షంగా చూసిన ఏడుగురు..( Death sentence to accused who killed a farmer ) కోర్టులో సాక్ష్యం చెప్పడంతో జిల్లా సెషన్స్ కోర్టు నిందితులకు ఉరిశిక్ష విధించింది. సో... చిన్న సంఘటనకే విచక్షణ కొల్పోడవం ద్వారా ఇద్దరి ప్రాణాలతో పాటు మరో ముగ్గురి ప్రాణాలకు కూడా కోర్టు తీర్పుతో ముప్పు ఏర్పడింది.
Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News
Published by:yveerash yveerash
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.