Home /News /national /

DEATH BLOW TO PAKISTAN IN THAT WAR INDIA IS SHOCKED TO SEE THE ATTACKS IF YOU READ THIS STORY YOU WILL SALUTE UMG GH

Kargil Vijay Diwas: ఆ యుద్ధంలో పాక్ కు చావు దెబ్బ! భారత్ దాడులను చూసి బెంబేలెత్తింది.. ఈ స్టోరీ చదివితే సెల్యూట్ చేస్తారు

 ఆ  యుద్ధంలో పాక్  కు చావు దెబ్బ! భారత్ దాడులను చూసి బెంబేలెత్తింది ..  ఈ  స్టోరీ చదివితే సెల్యూట్ చేస్తారు

ఆ యుద్ధంలో పాక్ కు చావు దెబ్బ! భారత్ దాడులను చూసి బెంబేలెత్తింది .. ఈ స్టోరీ చదివితే సెల్యూట్ చేస్తారు

నేడు కార్గిల్ విజయ్ దివస్ (Kargil Vijay Diwas) 23వ వార్షికోత్సవం. కార్గిల్ యుద్ధంలో విజయానికి గుర్తుగా నేడు భారతదేశం ఘనంగా వేడుకలు నిర్వహిస్తోంది. 1999లో ఇదే రోజున కార్గిల్ యుద్ధం అధికారికంగా ముగిసింది. పాకిస్థాన్‌ చొరబాటుదారులు స్వాధీనం చేసుకున్న కశ్మీర్(Kashmir) పర్వత శిఖరాలను భారత సైన్యం పాక్ కు దీటుగా సమధానం చెప్పి మళ్ళీ మన ప్రాంతాలను అధీనంలోకి తెచ్చుకున్నాం.

ఇంకా చదవండి ...
నేడు కార్గిల్ విజయ్ దివస్ (Kargil Vijay Diwas) 23వ వార్షికోత్సవం. కార్గిల్ యుద్ధంలో విజయానికి గుర్తుగా నేడు భారతదేశం ఘనంగా వేడుకలు నిర్వహిస్తోంది. 1999లో ఇదే రోజున కార్గిల్ యుద్ధం అధికారికంగా ముగిసింది. పాకిస్థాన్‌ చొరబాటుదారులు స్వాధీనం చేసుకున్న కశ్మీర్(Kashmir) పర్వత శిఖరాలను భారత సైనికులు విజయవంతంగా తిరిగి స్వాధీనం చేసుకున్నారు. ఈ యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన భారత జవాన్లకు ప్రధాని నరేంద్ర మోదీ(Pm Modi), హోంమంత్రి అమిత్ షా(Amith sha), రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ సహా ఇతర నేతలు ట్విట్టర్‌ వేదికగా నివాళులర్పించారు. ప్రధాని నరేంద్ర మోదీ చేసిన ట్వీట్‌లో.. ‘కార్గిల్ విజయ్ దివస్ దేశానికి గర్వకారణం, కీర్తి చిహ్నం. ఈ సందర్భంగా మాతృభూమి రక్షణలో తమ పరాక్రమాన్ని చూపిన వీరులు అందరికీ నా వందనం. జై హింద్’ అని ట్వీట్ చేశారు.

వీరుల స్ఫూర్తి ఎప్పటికీ నిలిచిపోతుంది
రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ చేసిన ట్వీట్‌లో.. ‘కార్గిల్ విజయ్ దివస్ నాడు, మన సాయుధ బలగాల ధైర్యసాహసాలు, త్యాగాలకు భారతదేశం సెల్యూట్ చేస్తోంది. మన మాతృభూమిని రక్షించుకోవడానికి అత్యంత కఠినమైన పరిస్థితుల్లో జవాన్లు ధైర్యంగా పోరాడారు. వారి పరాక్రమం, అణగదొక్కలేని స్ఫూర్తి భారతదేశ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతుంది.’ అని పేర్కొన్నారు. దేశంలోని సాయుధ దళాల మూడు సేవల మధ్య సమన్వయాన్ని పెంపొందించడానికి జాయింట్ థియేటర్ కమాండ్‌ల ఏర్పాటును ఆదివారం రాజ్‌నాథ్ సింగ్ ప్రకటించారు.

జమ్మూలో జరిగిన 'కార్గిల్ విజయ్ దివస్' కార్యక్రమంలో రక్షణ మంత్రి ప్రసంగిస్తూ.. ‘పాక్ ఆక్రమిత కాశ్మీర్ (PoK) భారతదేశంలో అంతర్భాగంగా ఉంది, ఎల్లప్పుడూ ఉంటుంది. పీవోకేపై పార్లమెంటులో ఆమోదించిన తీర్మానానికి మేం కట్టుబడి ఉన్నాం. పీవోకే భారతదేశంలో ఎప్పుడూ అంతర్భాగమే. బాబా అమర్‌నాథ్ (శివుని రూపం) భారతదేశంలో, శారదా శక్తిపీఠం నియంత్రణ రేఖ వద్ద ఉండటం ఎలా సాధ్యమవుతుంది.’ అని చెప్పారు. అనంతరం ద్రాస్‌లోని కార్గిల్‌ యుద్ధ స్మారకం వద్ద జవాన్లకు పూలమాల వేసి నివాళులర్పించారు.

కార్గిల్ యుద్ధం గురించి తెలుసుకోవాల్సిన అంశాలు..

- భారత సైన్యం 1999 జులై 26న యుద్ధంలో పాకిస్థాన్‌ను ఓడించింది. అప్పటి నుంచి, భారత సాయుధ దళాల పోరాటాలను, త్యాగాలను గుర్తుచేసుకోవడానికి ఆ రోజును కార్గిల్ విజయ్ దివస్‌గా నిర్వహిస్తున్నారు.

- కార్గిల్ యుద్ధంలో చివరిసారిగా భారతదేశం, పాకిస్థాన్‌ పూర్తిస్థాయి సాయుధ పోరాటానికి వచ్చాయి. అణ్వాయుధ శక్తిగా మారిన తర్వాత భారతదేశం, పాకిస్థాన్‌లు సాయుధ పోరాటానికి దిగింది కూడా కార్గిల్ యుద్ధంలోనే.

- నియంత్రణ రేఖ దాటి భారత్‌లోకి చొరబడిన పాకిస్థాన్‌ సైన్యం, వ్యూహాత్మక పర్వత శిఖరాలను స్వాధీనం చేసుకోవడంతో కార్గిల్ యుద్ధం ప్రారంభమైంది.

- చొరబాటును మొదటిసారి 1999 మే లో గుర్తించారు. అయితే ఆ సమయంలో చొరబాటుదారులు తీవ్రవాదులు లేదా ఉగ్రవాదులు అయి ఉంటారని, సాధారణ పాకిస్థాన్‌ సైన్యం కాదని భావించారు.

- మే 9న, మరింత మంది చొరబాటుదారులను భారతదేశం వైపుకు దాటడానికి సహాయం చేయడానికి కవర్ ఫైర్‌ను చేయడానికి పాకిస్థాన్‌ భారీ షెల్లింగ్ ప్రారంభించింది.

- భారత సైన్యం మరింత శక్తితో స్పందించింది. జమ్మూ, కశ్మీర్‌లోని ఎత్తైన కార్గిల్-ద్రాస్ సెక్టార్ యుద్ధానికి వేదికగా మారింది.

- మే చివరి నాటికి, భారత వైమానిక దళం కూడా లిమిటెడ్‌ స్ట్రైక్‌ను ప్రారంభించింది. IAF తన రెండు యుద్ధ విమానాలు, ఒక హెలికాప్టర్‌ను కోల్పోయింది. పాకిస్థాన్‌ సైన్యం రహస్యంగా ఆక్రమించిన కీలక స్థానాలను తిరిగి తీసుకోవడానికి జూన్‌, జులైలో భారత్‌ దాడిని తీవ్రం చేసింది.

ఇదీ చదవండి: WhatsApp: వారెవ్వా వాట్సాప్.. రోజుకో కొత్త ఫీచర్లు.. ఇక ఎవరికి తెలియకుండా లెఫ్ట్ అయ్యే ఫీచర్.. ఎలాగో లుక్కేయండి !



- తర్వాతి కొద్ది వారాల్లో, కార్గిల్ ఎత్తైన ప్రాంతాలను తిరిగి పొందేందుకు భారత సైనికులు పరాక్రమంగా పోరాడారు. వాస్తవానికి నియంత్రణ రేఖ దాటి చొరబడినది పాకిస్థాన్‌ సైన్యమే అని స్పష్టమైంది.

- ప్రతిస్పందనగా, భారతదేశం సైనిక, దౌత్యపరమైన మెరుపుదాడిని ప్రారంభించింది. పాకిస్థాన్‌ చొరబాటుదారులను స్వాధీనం చేసుకున్న ప్రాంతాల నుంచి నెట్టివేసి, ఇస్లామాబాద్‌ను ప్రపంచ స్థాయిలో ఒంటరిగా చేసింది.



- టైగర్ హిల్ కోసం జరిగిన యుద్ధం ఒక కీలక మలుపు. కార్గిల్-ద్రాస్ సెక్టార్‌లో ఇది ఎత్తైన శిఖరం. 11 గంటల సుదీర్ఘ కాల్పుల తర్వాత భారత సైన్యం టైగర్ హిల్‌ను తిరిగి స్వాధీనం చేసుకుంది. ఇటలీ నుంచి వివాదాస్పద ఒప్పందంలో కొనుగోలు చేసిన బోఫోర్స్ తుపాకులు యుద్ధంలో భారత సైన్యానికి అత్యంత సమర్థమైన ఆయుధాలుగా ఉపయోగపడ్డాయి.

- భారతదేశం 1999 జులై 26 నాటికి అన్ని శిఖరాలను తిరిగి స్వాధీనం చేసుకుంది, కార్గిల్ యుద్ధాన్ని ముగించింది.

- కార్గిల్ యుద్ధంలో 500 మందికి పైగా భారత సైనికులు మరణించారు.
Published by:Mahesh
First published:

Tags: Indian Army, Kargil Vijay Diwas, Pakistan, Pm modi

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు