Home /News /national /

DEAD WOMAN COMES BACK HOME TWO DAYS AFTER BURIAL IN TAMILANDU INTERESTING CRIME STORY SK

చనిపోయిన ఆ మహిళ.. అంత్యక్రియల తర్వాత తిరిగొచ్చింది.. ఇదెక్కడి వింత.. ఎలా జరిగింది?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

గురువారం ఉదయం మూడో రోజు సందర్భంగా.. తల్లికి ఇష్టమైన వంటకాలను సిద్ధం చేసి.. సమాధి వద్ద పెట్టాలని కుటుంబ సభ్యులు అనుకున్నారు. ఆ ఏర్పాట్లలో ఉండగానే..చంద్ర ఇంటికి వచ్చింది.  ఆమెను చూసి అందరూ షాక్ తిన్నారు

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    ఆమె చనిపోయింది. సమాధిలో పూడ్చిపెట్టి అంత్యక్రియలు చేశారు. ఐతే మూడో రోజు కార్యక్రమాల్లో బంధువులంతా నిమగ్నమై ఉండగా..ఆమె మళ్లీ తిరిగొచ్చింది. చనిపోయిన ఆ మహిళ.. ఇంటికి రావడం (Dead woman comes back home) చూసి.. అందరూ షాక్ అయ్యారు. ఇదేం వింత.. అని నోరెళ్లబెట్టారు. కానీ దీని వెనక ఆసక్తికరమైన కథ ఉంది. వాస్తవానికి ఆ మహిళ చనిపోలేదు. మరణించిన వేరొక మహిళను.. ఆమెగా భావించి.. కుటుంబ సభ్యులు అంత్యక్రియలు చేశారు. ఆ తర్వాత మరుసటి రోజే ఆమె తిరిగి రావడం స్థానికంగా చర్చనీయాంశమైంది. తమిళనాడు (Tamilnadu) లోని చెంగల్పట్టు జిల్లా గుండువంచరీ ప్రాంతానికి చెందిన చంద్ర అనే 72 ఏళ్ల మహిళ నివసిస్తోంది.  చాలా ఏళ్ల క్రితమే భర్త చనిపోవడంతో.. పెద్ద కుమారుడు వడివేలు (48) ఇంట్లో ఆమె ఉంటోంది.  వడివేలు.. కూవత్తూరులోని ఓ ప్రైవేట్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. చంద్ర ఎప్పుడైనా మానసిక ఒత్తిడికి గురైనప్పుడు, మనసు బాగా లేనప్పుడు.. సింగపెరుమాల్ కోయిల్‌లో ఉన్న ఓ దేవాలయానికి వెళ్తుంది. తమ ప్రాంతం నుంచి అది 22కి.మీ. దూరంలో ఉంటుంది.  సోమవారం కూడా ఎప్పటిలానే ఆలయానికి వెళ్లింది చంద్ర.  కానీ చీకటి పడినా ఆమె తిరిగిరాలేదు. తల్లి కోసం వడివేలు అంతటా వెతికారు. కానీ ఎక్కడా ఆచూకీ దొరకలేదు. ఈ క్రమంలోనే పోలీస్ స్టేషన్‌లో మిస్సింగ్ కేసు పెట్టాడు. మంగళవారం సాయంత్రం పోలీసులు వడివేలుకు ఫోన్ చేసి..  తాంబరం సమీపంలో ఓ మహిళ రైల్వే ప్రమాదంలో చనిపోయిందని.. ఆమె మీ అమ్మే అయి ఉండొచ్చని సమాచారం ఇచ్చారు. పోలీసులు ఆ విషయం చెప్పగానే.. వడివేలుకు కాలుచేతులూ ఆడలేదు. వెంటనే అక్కడికి వెళ్లిపోయాడు. మృతదేహం ముఖం గుర్తుపట్టరాని విధంగా చిధ్రమైంది. చీర మాత్రం తన తల్లి చీరలాగే ఉంది. చేతిపై మచ్చను కూడా గుర్తుపట్టాడు. ఆమె తన తల్లేనని.. వడివేలు రోదించాడు.  పోలీసులు మృతదేహాన్ని అప్పగించడంతో బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు. గురువారం ఉదయం మూడో రోజు సందర్భంగా.. తల్లికి ఇష్టమైన వంటకాలను సిద్ధం చేసి.. సమాధి వద్ద పెట్టాలని కుటుంబ సభ్యులు అనుకున్నారు. ఆ ఏర్పాట్లలో ఉండగానే..చంద్ర ఇంటికి వచ్చింది.  ఆమెను చూసి అందరూ షాక్ తిన్నారు. తాను చనిపోలేదని చెప్పడంతో.. ఖంగుతిన్నారు. మరి పూడ్చిన మృతదేహం ఎవరిదన్న దానిపై గందరగోళం నెలకొంది. సమాచారం అందుకున్న  పోలీసులు ఆ గ్రామానికి వెళ్లి.. సమాధిని తవ్వారు. మృతదేహాన్ని బయటకు తీసి.. క్రోమ్‌పేట్ ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు వెల్లడించారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Crime news, Tamilnadu

    తదుపరి వార్తలు