Home /News /national /

DAY AFTER BHAI DOOJ GIFT KEJRIWAL BOARDS DELHI BUSES FOR FEEDBACK ON FREE TRAVEL FOR WOMEN SK

సిటీ బస్సులో సీఎం జర్నీ.. ప్రయాణికులతో ముచ్చట్లు

డీటీసీ బస్సులో కేజ్రీవాల్

డీటీసీ బస్సులో కేజ్రీవాల్

ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ లెక్కల ప్రకారం బుధవారం ఒక్క రోజే సుమారు 4.77 లక్షల మంది పింక్ టికెట్లను తీసుకొని, సిటీ బస్సుల్లో ప్రయాణించారు.

    వచ్చే ఏడాది అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఢిల్లీ వాసులపై సీఎం అరవింద్ కేజ్రీవాల్ వరాల జల్లు కురిపిస్తున్నారు. ఢిల్లీ బస్సు, మెట్రో సర్వీసుల్లో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం మంగళవారం ప్రారంభమైంది. ఈ పథకం గురించి ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకునేందుకు సీఎం కేజ్రీవాల్ DTC (ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్) బస్సుల్లో ప్రయాణించారు. పథకం గురించి మహిళలను స్వయంగా అడిగి తెలుసుకున్నారు. ఈ పథకం పట్ల ఢిల్లీ మహిళలందరూ ఆనందం వ్యక్తం చేశారని ట్విటర్‌లో పేర్కొన్నారు కేజ్రీవాల్.

    ఢిల్లీ ట్రాన్స్‌పోర్ట్ కార్పొరేషన్ లెక్కల ప్రకారం బుధవారం ఒక్క రోజే సుమారు 4.77 లక్షల మంది పింక్ టికెట్లను తీసుకొని, సిటీ బస్సుల్లో ప్రయాణించారు. ఈ పథకం ద్వారా 5600 DTC బస్సులు, క్లస్టర్ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Arvind Kejriwal, New Delhi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు