బోర్డర్ దాటి మరీ చంపేస్తాం.. పాకిస్తాన్‌కు గవర్నర్ స్ట్రాంగ్ వార్నింగ్

సరిహద్దుల్లో ఉన్న ఉగ్రవాద స్థావరాలన్నింటినీ ధ్వంసం చేస్తామని.. అవసరమైతే పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి మరీ టెర్రరిస్టులను ఏరివేస్తామని స్పష్టంచేశారు.

news18-telugu
Updated: October 21, 2019, 4:25 PM IST
బోర్డర్ దాటి మరీ చంపేస్తాం.. పాకిస్తాన్‌కు గవర్నర్ స్ట్రాంగ్ వార్నింగ్
సత్యపాల్ మాలిక్
  • Share this:
ఇండియా-పాకిస్తాన్ మధ్య మళ్లీ ఉద్రిక్తతలు కనిపిస్తున్నాయి. పీవోకేలోని ఉగ్రస్థావరాలను భారత ఆర్మీ ధ్వంసం చేసిన తర్వాత ఇరుదేశాల మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. పాకిస్తాన్ ఆర్మీ వ్యవహరిస్తున్న తీరుపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తోంది. ఈ క్రమంలో పాకిస్తాన్ ప్రభుత్వానికి జమ్మూ కాశ్మీర్ గవర్నర్ సత్యపాల్ మాలిక్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. సరిహద్దుల్లో ఉన్న ఉగ్రవాద స్థావరాలన్నింటినీ ధ్వంసం చేస్తామని.. అవసరమైతే పాకిస్తాన్ భూభాగంలోకి వెళ్లి మరీ టెర్రరిస్టులను ఏరివేస్తామని స్పష్టంచేశారు.

ఉగ్రవాద స్థావరలన్నింటినీ ధ్వంసం చేస్తాం. పాకిస్తాన్ ప్రభుత్వం తీరు మార్చుకోకుంటే, వాళ్ల భూభాగంలోకి వెళ్లి మరీ తుదముట్టిస్తాం.
సత్యపాల్ మాలిక్, జమ్మూ కాశ్మీర్ గవర్నర్
ఆదివారం పీవోకోలేని ఉగ్రవాద స్థావరాలను టార్గెట్ చేసిన భారత ఆర్మీ.. శతఘ్నులతో విరుచుకుపడింది. నీలం వ్యాలీలోని నాలుగు టెర్రరిస్టుల లాంచ్ ప్యాడ్‌లపై దాడులు చేసి ధ్వంసం చేసింది. భారత ఆర్మీ దాడుల్లో 6-10 మంది పాకిస్తాన్ సైనికులు, సుమారు 40 మంది ఉగ్రవాదులు హతమయ్యారు.

అంతకుముందు తాంగ్‌ధర్ సెక్టార్‌ల వద్ద భారత్‌లోకి చొరబడేందుకు ఉగ్రవాదులు ప్రయత్నించారు. అదే సమయంలో భారత దళాల దృష్టిని మళ్లించేందుకు పాకిస్తాన్ సైన్యం కాల్పులు జరిగింది. పాక్ కాల్పుల్లో ఇద్దరు భారత జవాన్లు, ఓ పౌరుడు చనిపోయారు. పాకిస్తాన్ కాల్పులను తిప్పికొట్టిన భారత్.. ఉగ్రవాదుల చొరబాట్లను అడ్డుకుంది. అదే సమయంలో నీలం వ్యాలీలో ఉన్న టెర్రర్ లాంచ్ ప్యాడ్‌లను టార్గెట్ చేసి శతఘ్నులతో ధ్వంసం చేసింది.
First published: October 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు