2019 పుల్వామా ఉగ్రదాడి వెనక దవీందర్ సింగ్..?

పుల్వామా ఘటన లోతైన దర్యాప్తు చేయాలని.. దవీందర్ పాత్రపై దర్యాప్తు చేసి, అవసరమైతే నిందితుల జాబితాలో ఆయన పేరును చేర్చాలని అభిప్రాయపడ్డారు.

news18-telugu
Updated: January 14, 2020, 3:16 PM IST
2019 పుల్వామా ఉగ్రదాడి వెనక దవీందర్ సింగ్..?
దవీందర్ సింగ్
  • Share this:
ఉగ్రవాదులకు సాయం చేస్తూ పట్టుబడ్డ కశ్మీర్ డీఎస్పీ దవీందర్ సింగ్ వ్యవహారం తీవ్ర దుమారం రేపుతోంది. అతడిని అరెస్ట్ చేసి సస్పెండ్ చేసిన కశ్మీర్ పోలీసులు... ఉగ్ర సంబంధాలపై కూపీ లాగుతున్నారు. ఈ క్రమంలో దవీందర్ సింగ్ అంశం రాజకీయ రంగు పులుముకుంది. పుల్వామా ఉగ్రదాడి ఘటన వెనక దవీందర్ సింగ్ హస్తముందని కాంగ్రెస్ లోక్‌సభా పక్ష నేత అదిర్ రంజన్ చౌదరి ఆరోపించడంతో.. బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. పుల్వామా ఘటన లోతైన దర్యాప్తు చేయాలని.. దవీందర్ పాత్రపై దర్యాప్తు చేసి, అవసరమైతే నిందితుల జాబితాలో ఆయన పేరును చేర్చాలని అభిప్రాయపడ్డారు. ఆయన వ్యాఖ్యలపై బీజేపీ మండిపడింది. కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్‌ను వెనకేసుకొచ్చే ప్రయత్నం ఎందుకు చేస్తోందని బీజేపీ విమర్శలు గుప్పిస్తోంది.

ఐతే అదిర్ రంజన్ వ్యాఖ్యలను ప్రభుత్వం ఖండించింది. పుల్వామా ఉగ్రదాడి వెనక భారతీయులెవరూ లేరని పాకిస్తాన్‌కు చెందిన జైషే మహ్మద్ ఉగ్రవాదులే దాడి చేశారని వెల్లడించింది. దవీందర్ మాత్రం హిజ్బుల్ ముజాహిదీన్ ఉగ్రవాదులకు సాయం చేశారని తెలిపింది. అటు జమ్మూ కాశ్మీర్ పోలీసులు సైతం అదిర్ రంజన్ ఆరోపణలపై స్పందించారు. పుల్వామా దాడికి రెండు నెలల ముందే అతడు జిల్లా నుంచి ట్రాన్స్‌ఫర్ అయ్యారని తెలిపారు. 2018 డిసెంబరులో శ్రీనగర్ ఎయిర్‌పోర్టుకు బదిలీ అయ్యాడని.. అప్పటి నుంచీ యాంటి హైజాకింగ్ స్క్వాడ్‌లో డీఎస్పీగా పనిచేస్తున్నాడని క్లారిటీ ఇచ్చారు.

శనివారం షోపియాన్‌లో హిజ్బుల్ ముజాహిదీన్ కమాండర్ సయ్యద్ నవీద్ బాబా, టెర్రరిస్ట్ అల్తాఫ్‌తో కలిసి కారులో వెళ్తుండగా దవీందర్ సింగ్ పట్టుబడ్డాడు. బనిహాల్ టన్నెల్‌ను సురక్షితంగా దాటించేందుకు ఉగ్రవాదులతో దవీందర్ డీల్ కుదుర్చుకున్నాడు. రూ.12 లక్షల ఇస్తామనడంతో ఉగ్రవాదులను బనిహాల్ సొరంగాన్ని దాటించేందుకు అతడు సాయం చేశాడని ప్రాథమిక విచారణలో తేలింది. డీఎస్సీ వాహనంలో వెళ్తే ఎవరూ సెక్యూరిటీ సిబ్బంది ఎవరూ ఆపరని స్కెచ్ వేశారు. కానీ తనిఖీల్లో ముగ్గురూ అడ్డంగా దొరికిపోయారు. ఆ తర్వాత దవీందర్ సింగ్ ఇంట్లో తనిఖీలు చేసిన పోలీసులు రెండు పిస్టల్స్, ఒక ఏకే 47 రైఫిల్, పెద్ద మొత్తంలో మందు గుండు సామాగ్రి స్వాధీనం చేసుకున్నారు. ప్రస్తుతం అతడిని సస్పెండ్ చేసిన పోలీసులు పలు కోణాల్లో కేసును దర్యాప్తు చేస్తున్నారు.

కాగా, 2019 ఫిబ్రవరి 14న పుల్వామాలోని అవంతిపొరా ప్రాంతంలో ఉగ్రదాడి జరిగిన విషయం తెలిసిందే. రోడ్డుమార్గంలో వెళ్లున్న జవాన్ల కాన్వాయ్‌పై జైషే మహ్మద్ ఉగ్రవాది ఆదిల్ అహ్మద్ ఆత్మాహుతి దాడిచేశాడు. 100 కేజీల పేలుడు పదార్థాలు ఉన్న కారుతో జవాన్ల బస్సును ఢీకొట్టాడు. ఆ దాడిలో 44 మంది జవాన్లు అమరులయ్యారు.


First published: January 14, 2020
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు