హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Surat Girls: తండ్రికి వజ్రాల వ్యాపారం.. వందల కోట్ల ఆస్తి.. అవేమీ వద్దని మైనర్ బాలికల సన్యాసం

Surat Girls: తండ్రికి వజ్రాల వ్యాపారం.. వందల కోట్ల ఆస్తి.. అవేమీ వద్దని మైనర్ బాలికల సన్యాసం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Surat Girls: సూరత్‌ నగరానికి చెందిన కోటిశ్వరుడైన వజ్రాల వ్యాపారి దీపక్‌ షా కూతురు పన్నెండు సంవత్సరాల ఆన్షి షా. సన్యాసిగా మారాలనే ఆసక్తి పెంపొందడంతో ఈ అమ్మాయి తన ఎనిమిదవ ఏటనే చదువులు విడిచిపెట్టింది.

12 ఏళ్ల వయసున్న పిల్లలు ఎంచక్కా స్కూల్‌కు వెళ్తారు. స్నేహితులతో ఆడుకుంటారు. ఇదే వారికి తెలిసింది. కానీ గుజరాత్‌ రాష్ట్రంలోని సూరత్‌కు చెందిన బాలికలు అరుదైన మార్గంలో నడవాలని నిర్ణయించుకున్నారు. వీరిలో ఒకరి వయస్సు 11 సంవత్సరాలు, మరో అమ్మాయి వయస్సు 12 సంవత్సరాలు. వీరి మధ్య మూడేళ్లగా స్నేహబంధం ఉంది. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఈ ఇద్దరు అమ్మాయిలు ఈ ప్రపంచాన్ని త్యజించి సన్యాస దీక్ష స్వీకరించనున్నారు. ఈ దీక్ష కోసం వీళ్లిద్దరూ గడచిన రెండున్నర సంవత్సరాలుగా కఠినమైన శిక్షణ తీసుకున్నారు. అంతే కాదు ఇద్దరు 700 కిలోమీటర్లకు పైగా దూరం నడిచారు. సూరత్‌ నగరానికి చెందిన కోటిశ్వరుడైన వజ్రాల వ్యాపారి దీపక్‌ షా కూతురు పన్నెండు సంవత్సరాల ఆన్షి షా. . సన్యాసిగా మారాలనే ఆసక్తి పెంపొందడంతో ఈ అమ్మాయి తన ఎనిమిదవ ఏటనే చదువులు విడిచిపెట్టింది. అప్పటి నుంచి వేర్వేరు ప్రదేశాల్లోని జైన సాధువులతో సమయం గడపుతోంది. ఇతర సాధువులతో కలిసి కిలోమీటర్ల దూరం నడవటమే కాదు 30 రోజుల పాటు కఠినమైన ఉపవాస దీక్ష కూడా చేపట్టింది.

Vegetarian Crocodile: ప్రపంచంలోనే ఏకైక శాఖాహార మొసలి.. అన్నం తప్ప  ముక్క తినదు

జైన గురువులు గుణరత్న సురీశ్వర స్వామీజీ మహారాజ్‌, రష్మిరత్న సురీశ్వర స్వామీజి నేతృత్వంలో ఆన్షి సన్యాస దీక్ష తీసుకోనున్నారు. జీవితాన్ని నేను ఎంతో ఆస్వాదించాను, కాని నాకు నిజమైన సంతోషం, శాంతి, ఐక్యత భావం సాధువులతో ఉన్నప్పుడే కలిగింది కాబట్టి నా మిగిలిన జీవితాన్ని వారితోనే గడపాలని నిర్ణయించుకున్నానని చెప్తోంది ఆన్షి. భౌతిక ప్రపంచాన్ని తన కూతురు పరిత్యజించాలని నిర్ణయించుకోవడంతో సన్యాస దీక్ష స్వీకరించడానికి ముందే ఆమెకు జీవితంలో అన్ని సంతోషాలు అందించాలని తండ్రి దీపక్‌ షా కోరుకుంటున్నారు. సన్యాసినిగా మారాలన్న తన కూతురి నిర్ణయం చూసి తాను ఎంతో గర్విస్తున్నానని షా అంటున్నారు. ఈ లోపు కనీసం ఒక విదేశమైన కూతురికి చూపించాలని ఆశపడుతున్న ఆయన పాపను దుబాయ్‌ తీసుకువెళ్లనున్నారు.

Corona vaccine : టీకా లక్కి డ్రా.. రిఫ్రిజిరేటర్.. వాషింగ్ మిషన్.. ఇలా ఎన్నో బహుమతులు

అన్షి స్నేహితురాలు కూడా అదే బాటలో..

మరోవైపు,ఆన్షి స్నేహితురాలైన 11 సంవత్సరాల విహా షా కూడా సన్యాస దీక్ష స్వీకరించాలని నిర్ణయించుకుంది. ఈ సంవత్సరమే దీక్ష తీసుకోవాలని విహా భావించినా, కొంచెం పెద్దయ్యేంత వరకు వేచి ఉండాలని ఆమె తల్లిదండ్రులు నచ్చజెప్తున్నారు. విహాతో పాటు ఆమె తల్లిదండ్రులు శ్రావక్‌ (45), సోనల్‌ (43) కూడా ఒకే రోజు సన్యాస దీక్ష స్వీకరించనున్నారు. వీరి కుమారుడు క్షమా శ్రమణ్‌ విజయ్‌జీ మహారాజ్‌ వయస్సు ఇప్పుడు 18 సంవత్సరాలు. అతను 13వ ఏటే సన్యాస దీక్ష తీసుకున్నాడు. తాము దీక్ష చేపట్టేందుకు అతడేప్రేరణఅని తల్లిదండ్రులు చెప్తున్నారు.విహా తండ్రి శ్రావక్‌ వజ్రాల కంపెనీలో పనిచేసేవారు.దీక్ష తీసుకోవాలని నిర్ణయించుకోవడంతో కఠిన నియమాలు అర్థం చేసుకునేందుకు ఆయన తన ఉద్యోగాన్ని వదిలేసారు.

First published:

Tags: Gujarat, National News, Surat

ఉత్తమ కథలు