హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

అమ్మా... మావయ్య ఒళ్లంతా తడుముతున్నాడు.. ఏం చెయ్యను.. ఆ వివాహిత ఏం చేసిందంటే...

అమ్మా... మావయ్య ఒళ్లంతా తడుముతున్నాడు.. ఏం చెయ్యను.. ఆ వివాహిత ఏం చేసిందంటే...

కీచక మామ?

కీచక మామ?

సొంత బంధువులే కీచకుల్లా మారితే ఎలా? తప్పించుకునే ఛాన్సే లేకపోతే ఏం చెయ్యాలి? ఇలాంటి పరిస్థితి ఎదురైన ఆ కొత్త పెళ్లికూతురు ఏం చేసింది? తన అమ్మకు ఆమె ఏయే విషయాలు చెప్పింది?

  గుజరాత్... అహ్మదాబాద్‌లో... గత వారం ఓ యువతి అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన కేసులో కొత్త విషయాలు వెలుగులోకి వచ్చాయి. ఆమె సూసైడ్ చేసుకుందని ప్రాథమికంగా తెలుస్తున్నా... దాని వెనక ఆమె మామగారి ప్రభావం ఉందని తెలుస్తోంది. ఇంట్లో ఎవరూ లేని సమయంలో... ఆమెపై మావయ్య అసభ్యంగా ప్రవర్తించడం వల్లే ఆమె సూసైడ్ చేసుకుందని తెలుస్తోంది. అసలేమైందంటే... గుజరాత్... ఆనంద్ జిల్లాలో 40 ఏళ్ల ఓ మహిళ... 1999లో వివాహం చేసుకుంది. ఆమెకు ఓ కూతురు ఉంది. ఐతే... పెళ్లైన కొన్నాళ్లకే... భర్తతో గొడవలు రావడంతో... భర్తకు దూరంగా ఉంటూ... కూతుర్ని పెంచి పెద్ద చేసింది. ఆ తర్వాత ఆమెకు ఓ మంచి సంబంధం చూసి పెళ్లి చేసింది.

  కూతురికి పెళ్లి చేసి తన బాధ్యత తీరిందనుకుంది ఆ తల్లి. ఐతే... అత్తవారింట్లో జరిగిన ఘటనలు ఏకంగా కూతురినే తనకు దూరం చేస్తాయని ఆ తల్లి ఊహించలేదు. 2021 జనవరిలో కూతురి పెళ్లి జరిగింది. ఆ తర్వాత అత్తారింటికి వెళ్లిన కొత్త పెళ్లికూతురు... అత్తమామలకు సేవలు చేస్తూ... కుటుంబ సభ్యులతో బాగానే కలిసిపోయింది. ఐతే... ఆ ఇంట్లోని మామగారికి క్రైమ్ సీరియళ్లు చూసే అలవాటు ఉంది. అవి చూస్తూ... పెద్దాయన లేనిపోనివి ఊహించుకుంటూ... కోడలి కన్నేశాడు.

  ఓ రోజు ఇంట్లో ఎవరూ లేని టైమ్‌లో సోఫాలో కూర్చొని టీవీ చూస్తూ... కోడలిని టీ తెమ్మన్నాడు. ఆమె టీ తెచ్చి ఇచ్చింది. తిరిగి వంటగదిలోకి వెళ్తుంటే... పక్కన కూర్చోమన్నాడు. తర్వాత తలనొప్పిగా ఉందంటూ... ఆమె ఒళ్లో తల పెట్టి పడుకున్నాడు. ఏం చెయ్యాలో ఆమెకు అర్థం కాలేదు. మతిపోయింది. మైండ్ బ్లాంక్ అయ్యింది. మెల్లగా పెద్దాయన తలను సోఫాలో పడుకోబెట్టేందుకు ప్రయత్నిస్తుంటే... అదేపనిగా కదులుతూ... ఆమె తొడలను తడిమాడు. మామగారి చేష్టలతో ఆమె షాకైంది.

  మరోసారి... ఇంట్లో ఎవరూ లేని టైమ్‌లో ఆమె వంటగదిలో వంట చేస్తుంటే... వెనక నుంచి వెళ్లి పట్టుకొని... ఒళ్లంతా తడిమాడు... ఇదేంటి... ఎందుకిలా చేస్తున్నారని అడిగితే... కంగారు పడకు... ఏం కాదు... ఇలాంటివి మామూలే... తేలిగ్గా తీసుకో... అంటూ.. నాటకాలు ఆడాడు.

  భర్తకేమో... తన తండ్రి అంటే విపరీతమైన అభిమానం. ఇంట్లోవాళ్లంతా పెద్దాయన పట్ల ఎంతో అన్యోన్యతతో ఉంటారు. దాంతో ఆ ఇంట్లో కొత్త కోడలు ఒంటరి అయిపోయింది. తన సమస్యను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాలేదు. రాన్రానూ తనపై లైంగిక వేధింపులు పెరిగిపోతుంటే... తట్టుకోలేక తల్లికి విషయం చెప్పింది. ఒంటరిదైన తల్లి కూతుర్ని ఓదార్చిందే తప్ప... ఏమీ చెయ్యలేకపోయింది. దీనిపై గొడవకు వెళ్తే... కూతురికి విడాకులు ఇచ్చేస్తారేమో అని భయపడింది.

  ఇది కూడా చదవండి:త్వరలోనే ఆ టీనేజర్ అమ్మాయితో ప్రేమ పెళ్లి... అంతలోనే ఆ కుర్రాడు చేసిన పనికి ఏమైందంటే...

  ఇలా తల్లి మనసులో మథనం సాగుతుండగానే... ఓ రోజు... అత్తవారింటి నుంచి కాల్ వచ్చింది. కోడలు సూసైడ్ చేసుకుందని చెప్పారు. వెళ్లి చూస్తే... బెడ్‌రూంలో శవమై కనిపించింది కూతురు. కన్నీళ్ల సంద్రమైన ఆమె... మామగారి లైంగిక వేధింపుల వల్లే తన కూతురు సూసైడ్ చేసుకుందని తాజాగా ఆరోపించింది. పోలీసులు కేసును ఈ కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. మామను అదుపులోకి తీసుకున్నారు.

  Published by:Krishna Kumar N
  First published:

  Tags: Crime news, Gujarath, RAPE

  ఉత్తమ కథలు