Home /News /national /

Rajastan : కరోనాతో కొడుకు మృతి.. కోడలిపై అత్తామామలు తీసుకున్న ఆ నిర్ణయం ..

Rajastan : కరోనాతో కొడుకు మృతి.. కోడలిపై అత్తామామలు తీసుకున్న ఆ నిర్ణయం ..

కోడలికి పెళ్లి చేస్తున్న అత్తమామలు

కోడలికి పెళ్లి చేస్తున్న అత్తమామలు

Rajastan : కోడలినే కూతురుగా మార్చుకున్నారు ఓ ఆదర్శంగా నిలిచారు. కరోనాతో కొడుకు మృతి చెందితే.. కోడలినే కూతురుగా మార్చుకున్నారు.. ఆమెకు మళ్లి పెళ్లి చేసి తమ ఇంట్లోనే పెట్టుకున్నారు.

    కరోనాతో ( corona ) లక్షల మంది కుటుంబాలను రోడ్డున పడేసిన విషయం తెలిసిందే.. ఒకే ఇంట్లో భార్య,భర్తలతో పాటు మరణించారు. దీంతో వారి పిల్లలు అనాధాలుగా మిగిలిన పరిస్థితి నెలకొంది. మరి కొన్ని కుటుంబాల్లో తల్లిదండ్రులతోపాటు పిల్లలు కూడా కరోనా బారిన పడి ప్రాణాలు విడిచారు. ఇలా కరోనా కొన్ని కుటుంబాలను అతలాకుతలం చేసిన విషయం చేస్తున్న విషయం తెలిసిందే.. అయితే ఇలాంటీ విపత్కర పరిస్థితుల్లో కొంతమంది తమ ధైర్యాన్ని , మానవతను చాటారు. ఆపన్నులను ఆదుకుని కనిపించే దేవుళ్లుగా మారారు.

    ఇలా కరోనాతో రాజస్థాన్‌లోని ( Rajastan ) ఓ వృద్ద జంట తమ ఉన్న ఒక్క కొడుకుని కరోనా తీసుకుపోయింది. అయితే ఆయనకు భార్యతో పాటు పదహారు నెలల ఆడపిల్ల కూడా ఉన్నారు. దీంతో తమ కొడుకు చనిపోయినందుకు భాద పడకుండా కొడుకు మీదే ఆధారపడిన కోడలు భవితవ్వంపై దృష్టి సారించారు. ఇలాంటీ అత్తమామలు ఉంటే నిజంగా ఏ కుటుంబంలో కూడా కలహాలు రావని నిరూపించారు.


    child rape and murder : సింగరేణి కాలనీ తరహాలో మరో సంఘటన.. ట్రంకుపెట్టెలో ఆరేళ్ల చిన్నారి శవం




    అయితే కరోనాతో తమకు ఉన్న ఒక్క కొడుకు ప్రాణాలు ( Death ) కోల్పోయిన తల్లిదండ్రులు కోడలు విషయంలో ఆదర్శంగా నిలిచారు.. కోడలినే కూతురుగా మార్చుకున్నారు.. ఆ తర్వాత పెళ్లి చేసి ఆదర్శంగా నిలిచారు. భర్తను కోల్పోయి 16 నెలల బిడ్డతో ఇంట్లో ఉన్న ఆమెకు మళ్లీ పెళ్లి చేశారు. ఆమెను తమ కూతురిలా మార్చుకుని తమ ఇంట్లోనే ఉంచుకున్నారు.

    వివరాల్లోకి వెళితే.. రాజస్థాన్‌లోని ( Rajastan )సికార్ జిల్లాకు చెందిన సికార్‌కు చెందిన ఓంప్రకాశ్, అభా దంపతులకు విశాల్ ఒక్కడే కొడుకు. మూడేళ్ల క్రితం కిరణ్ అనే మహిళను వివాహం చేసుకున్న అతనికి ఓ కూతురు ఉంది. 2020లో కరోనాకు గురైన విశాల్ అదే ఏడాది మే నెలలో చనిపోయాడు. దీంతో అందరూ విషాదంలో కూరుకుపోయారు. కొద్ది రోజుల తర్వాత కొడుకు పోయాడనే బాధ నుంచి కోలుకున్న తల్లిదండ్రులు కోడలి గురించి ఆలోచించారు. 16 నెలల బిడ్డతో ఒంటరి అయిపోయిన కోడలికి మళ్లీ పెళ్లి చేయాలనుకున్నారు.


    Peddapally : పంచాయితీలోనే భార్యను.. బండతో కొట్టి ప్రాణాలు తీసిన భర్త


    స్థానికంగా ఉండే అరుణ్ కుమార్‌ అనే యువకుడితో వారే దగ్గరుండి పెళ్లి ( Marriage )  నిశ్చయించారు.కోడలికి తల్లిదండ్రులుగా మారి వారిద్దరూ దగ్గరుండి పెళ్లి జరిపించారు. గురువారం ఈ పెళ్లి జరిగింది. కూతురికి ఇచ్చినట్టే బహుమతులు కూడా ఇచ్చారు. అంతేకాదు నూతన దంపతులిద్దరినీ ( Wife and husband ) తమతో పాటే తమ ఇంట్లోనే ఉండమన్నారు. దీంతోఆ వృద్ధ దంపతులు చేసిన పనిని ఎంతో మంది ప్రశంసిస్తున్నారు. తమ పెద్ద మనసుతో వీరు ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు.

    (Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Corona, Rajastan

    తదుపరి వార్తలు