1975లో సరిగ్గా ఇదే రోజు అప్పటి ప్రధాని ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధిస్తూ ప్రకటన చేశారు. 1977 మార్చి 21 వరకు దేశంలో ఎమర్జెన్సీ అమల్లో ఉంది. ఎమర్జెన్సీని వ్యతిరేకిస్తూ పోరాటం చేసిన చాలా మంది జైళ్లలో కాలం గడిపారు. స్వతంత్ర భారతదేశ చరిత్రలో ప్రజాస్వామ్యానికి చీకటి రోజులుగా పిలుచుకునే ఎమర్జెన్సీకి నేటికి 46 ఏళ్లు. ఈ సందర్భంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ.. కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ విమర్శలు గుప్పించారు. ఎమర్జెన్సీ కాలంలో చీకటి రోజులు ఎప్పటికీ మరిచిపోలేనివని అన్నారు. ‘ఎమర్జెన్సీ కాలంలోని చీకటి రోజులు ఎప్పటికీ మరిచిపోలేము. 1975 నుంచి 1977 మధ్య కాలం వ్యవస్థలను క్రమ పద్దతిలో ఏ విధంగా నాశనం చేశారనే దానికి సాక్ష్యంగా నిలుస్తుంది. భారతదేశం ప్రజాస్వామ్య స్పూర్తిని బలోపేతం చేయడానికి, రాజ్యాంగంలో పొందుపరిచిన విలువలకు అనుగుణంగా జీవించడానికి చేతనైనా కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేద్దాం’అని మోదీ ట్వీట్ చేశారు.
అంతేకాకుండా ‘ఎమర్జెన్సీ కాలంలో కాంగ్రెస్ పార్టీ నిషేధించిన వాటిని మీరు నమ్మగలరా?’ అంటూ బీజేపీ ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన పోస్టు లింక్‌ను మోదీ ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. భారత ప్రజాస్వామ్య నీతిని కాంగ్రెస్ ఏ విధంగా తోక్కేసిందో చూడండని విమర్శించారు.ఎమర్జెన్సీని ప్రతిఘటించి భారత ప్రజాస్వామ్యాన్ని రక్షించిన గొప్పవాళ్లందరినీ గుర్తుంచుకుంటామని ట్వీట్‌లో పేర్కొన్నారు.
The #DarkDaysOfEmergency can never be forgotten. The period from 1975 to 1977 witnessed a systematic destruction of institutions.
Let us pledge to do everything possible to strengthen India’s democratic spirit, and live up to the values enshrined in our Constitution.
— Narendra Modi (@narendramodi) June 25, 2021
కేంద్ర హోం మంత్రి అమిత్ షా కూడా కాంగ్రెస్‌పై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. స్వతంత్ర భారత చరిత్రలో ఇదో చీకటి అధ్యాయం అన్నారు. ‘1975లో సరిగ్గా ఇదే రోజున అధికార స్వార్ధం, అహకారంతో దేశంలో అత్యవసర పరిస్థితులు విధించడం ద్వారా కాంగ్రెస్ పార్టీ.. ప్రంపచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్యాన్ని చంపేసింది. పెద్ద సంఖ్యలో సత్యాగ్రహులను రాత్రికి రాత్రే జైళ్లలో బంధించారు. ప్రెస్‌ను కూడా లాక్ చేశారు. ప్రజల ప్రాథమిక హక్కులను హరించి.. ప్లారమెంట్, కోర్టులను మాట్లాడలేని ప్రేక్షకులుగా మార్చేశారు. ఒక కుటుంబానికి వ్యతిరేకంగా ఉన్న గొంతులను నిలువరించడానికి దేశంలో ఎమర్జెన్సీ విధించారు. ఇది స్వతంత్ర భారత చరిత్రలో ఇదో చీకటి అధ్యాయం. 21 నెలల పాటు క్రూరమైన పాలనలో హింసను అనుభవిస్తూ.. రాజ్యంగం, ప్రజాస్వామ్యం పరిరక్షణ కోసం పోరాడిన దేశవాసులందరి త్యాగానికి నమస్కారం’అని అమిత్ షా ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
1975 में आज ही के दिन कांग्रेस ने सत्ता के स्वार्थ व अंहकार में देश पर आपातकाल थोपकर विश्व के सबसे बड़े लोकतंत्र की हत्या कर दी। असंख्य सत्याग्रहियों को रातों रात जेल की कालकोठरी में कैदकर प्रेस पर ताले जड़ दिए। नागरिकों के मौलिक अधिकार छीनकर संसद व न्यायालय को मूकदर्शक बना दिया। pic.twitter.com/SvFmEXKYcn
— Amit Shah (@AmitShah) June 25, 2021
‘1975లో ఇదే రోజున కాంగ్రెస్ పార్టీ రాజకీయ ప్రయోజనాల కోసం దేశంలో ఎమర్జెన్సీ ప్రకటించింది. ప్రపంచంలోనే గొప్పదైన భారత ప్రజాస్వామ్యానికి ఇది ఒక నల్లటి మచ్చ. భయంకరమైన హింసకు గురైనప్పటికీ.. అత్యవసర పరిస్థితిని వ్యతిరేకించిన, ప్రజాస్వామ్య విలువలు, విశ్వాసాన్ని కాపాడిన సత్యాగ్రహులందరికీ నేను నమస్కరిస్తున్నాను’అని బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
ఇక, పార్లమెంట్ ఎన్నికల్లో సమయంలో ఇందిరా గాంధీ అక్రమాలకు, అవినీతి చర్యలకు పాల్పడ్డారని అలహాబాద్ హైకోర్టు 1975లో తీర్పిచ్చింది. ఈ క్రమంలోనే ఆమెను పార్లమెంట్ సభ్యత్వానికి అనర్హురాలిగా పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఇందిరా గాంధీ దేశంలో ఎమర్జెన్సీ విధించారు. ఆ కాలంలో రాజ్యాంగ హక్కులు, పౌరుల హక్కుల నిలిపివేయడంతో పాటుగా, మీడియోపై తీవ్రమైన ఆంక్షలు విధించారు. దాదాపు 21 నెలల పాటు దేశంలో ఎమర్జెన్సీ కొనసాగింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amit Shah, Congress, Indira Gandhi, PM Narendra Modi