దంతెవాడ గ్రౌండ్ రిపోర్ట్: 250 మంది మావోయిస్టులు.. 45 నిమిషాల ఫైరింగ్..

దంతెవాడ జిల్లాలోని నీలభయ గ్రామంలలో ఐదు పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. ఆ వివరాలను కవర్ చేసేందుకు దూరదర్శన్ ప్రతినిధులు వెళ్లారు.

news18-telugu
Updated: October 30, 2018, 9:39 PM IST
దంతెవాడ గ్రౌండ్ రిపోర్ట్: 250 మంది మావోయిస్టులు.. 45 నిమిషాల ఫైరింగ్..
ప్ర‌తీకాత్మ‌క చిత్రం
  • Share this:
ఛత్తీస్‌గఢ్‌లోని దంతెవాడలో జరిగిన మావోయిస్టు దాడిలో ఇద్దరు సీఆర్పీఎఫ్ జవాన్లతో పాటు దూరదర్శన్ కెమెరామన్ అచ్యుతానంద సాహు కూడా ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. అచ్యుతానంద సాహుతోపాటు దూరదర్శన్ రిపోర్టర్, లైట్ అసిస్టెంట్ కూడా ఆ సమయంలో అక్కడే ఉన్నారు. ఆ భయానక ఘటనకు సంబంధించి వారు చెప్పిన వివరాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. దూరదర్శన్ రిపోర్టర్ ధీరజ్ కుమార్, లైట్ అసిస్టెంట్ మర్ముక్త్ శర్మ‌‌ న్యూస్‌18తో ప్రత్యేకంగా మాట్లాడారు. డ్రెస్ నిండా మురికి, కొట్టుకుపోయిన అరచేతులు, ముఖంలో నెత్తురు చుక్కలేదు. న్యూస్‌18ని కలిసే సమయానికి ధీరజ్ కుమార్ పరిస్థితి అది.

పోలింగ్‌ను బహిష్కరిస్తూ మావోయిస్టులు పోస్టర్లు వేశారు. మేం వాటిని వీడియో షూట్ చేస్తున్నాం. కెమెరామన్ సాహు మా కంటే ఓ 50 అడుగుల ముందు ఉన్నాడు. మేం ఇద్దరం (రిపోర్టర్ ధీరజ్ కుమార్, లైట్ అసిస్టెంట్ శర్మ) బైక్ మీద కొంచెం వెనుక వెళ్తున్నాం. మాతోపాటే సీఆర్పీఎఫ్ పెట్రోలింగ్ వాహనం కూడా ఉంది. సడన్‌గా పెద్ద చప్పుడు వినిపించింది. అటు వైపు చూసేసరికి సాహు కిందపడిపోయి ఉన్నాడు. ఏం జరిగిందని ఒక్కక్షణం అర్థం కాలేదు. అంతలోనే మా బైక్ స్కిడ్ అయింది. మేం రోడ్డు పక్కన పడిపోయాం. ఈ దాడిలో సుమారు 200 నుంచి 250 మంది నక్సల్స్ పాల్గొని ఉండొచ్చు. కొన్ని గ్రెనేడ్లు విసిరేశారు. ఐఈడీలు, వైర్లు కూడా కనిపించాయి. సుమారు 45 నిమిషాలపాటు కాల్పులు కొనసాగాయి.

ధీరజ్ కుమార్, దూరదర్శన్ రిపోర్టర్


‘మేం ప్రెస్ అని సాహు చెబుతూనే ఉన్నాడు. కెమెరా కూడా చూపిస్తున్నాడు. మేం కూడా డీడీ మైక్ చూపించడానికి ప్రయత్నిస్తున్నాం. కానీ, అంతలోనే బుల్లెట్లు దూసుకొచ్చేశాయి.’ అని లైట్ అసిస్టెంట్ మర్ముక్త్ శర్మ తెలిపారు. మీడియా వారితోపాటు వెళ్లిన ఎస్పీ అభిషేక్ పల్లవ్ వారి కంటే కొంచెం ముందుగా వెళ్లి రెండు కిలోమీటర్ల దూరంలో ఎదురుచూస్తున్నారు. కాల్పులు శబ్దం విన్నవెంటనే ఎస్పీ అభిషేక్ వెంటనే ఘటన ప్రదేశానికి వచ్చారు. అయితే, అప్పటికే కెమెరామన్ సాహు, మరో ఇద్దరు జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. ‘ఒకవేళ మీడియా వారిని రక్షణ లేకుండా పంపించి ఉంటే వారిని మావోయిస్టులు కిడ్నాప్ చేసే అవకాశం ఉంది. మావోయిస్టుల అసలు టార్గెట్ నేను అయి ఉండొచ్చు. కానీ, వారు మీడియాకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. అంటే వారికి మీడియా మీద ఎంత కోపం ఉందో అర్థం అవుతోంది.’ అని ఎస్పీ అభిషేక్ తెలిపారు.

నవంబర్ 12న ఛత్తీస్‌గఢ్‌లో తొలిదశ ఎన్నికలు జరుగుతున్నాయి. మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలు కూడా అందులో ఉన్నాయి. ఈ సారి ఎన్నికల కోసం దంతెవాడ జిల్లాలోని నీలభయ గ్రామంలలో ఐదు పోలింగ్ బూత్‌లు ఏర్పాటు చేశారు. ఆ వివరాలను కవర్ చేసేందుకు దూరదర్శన్ ప్రతినిధులు వెళ్లారు. మావోయిస్టు ప్రభావిత ప్రాంతం కావడంతో గత 20 ఏళ్లుగా అక్కడ ఓటింగ్ జరగడం లేదు. ఎవరూ ఓటేసేందుకు ముందుకు రావడం లేదు. తాజా ఘటన తర్వాత అక్కడ ఈ ఏడాది కూడా పోలింగ్ నమోదవడం కష్టమే అని అభిప్రాయపడుతున్నారు.

ఇవి కూడా చదవండి
First published: October 30, 2018, 9:34 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading