హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Helicpter Crash: మన దేశంలో భయపెడుతున్న హెలికాప్టర్‌ ప్రమాదాలు.. ప్రాణాలు కోల్పోయిన ఎందరో ప్రముఖులు

Helicpter Crash: మన దేశంలో భయపెడుతున్న హెలికాప్టర్‌ ప్రమాదాలు.. ప్రాణాలు కోల్పోయిన ఎందరో ప్రముఖులు

భారత దేశాన్ని భయపెడుతున్న హెలీకాఫ్టర్ ప్రమాదాలు

భారత దేశాన్ని భయపెడుతున్న హెలీకాఫ్టర్ ప్రమాదాలు

Helicpter Crash: హెలీకాఫ్టర్ లో వెళ్లాలి అంటేనే ప్రముఖులు భయపడాల్సి వస్తోంది. ఎందుకంటే ఇప్పటికే ఎంతో మంది ప్రముఖులను ఇలా హెలీకాఫ్టర్ బలితీసుకున్న ఘటనలు ఉన్నాయి. ప్రముఖ రాజకీయ నేతలు, ముఖ్యమంత్రులు, సినిమా స్టార్లు ఎంతో మంది హెలీకాఫ్టర్ ప్రమాదాల కారణంగానే తుది శ్వాస విడిచారు.

ఇంకా చదవండి ...

Dangerous Helicopter Crashes: అమ్మో హెలీకాఫ్టర్ అని గజ గజా వణకాల్సిన పరిస్థితి వస్తుందేమో.. ఇప్పటికే భారత దేశంలోని ప్రముఖులను హెలీకాఫ్టర్ ప్రమాదాలు భారీగా భయపెడతున్నాయి. తాజాగా మరో ఘటన ఉలిక్కి పడేలా చేసింది. తమిళనాడులోని జరిగిన  ఆర్మీ హెలికాప్టర్ ప్రమాదం (Helicopter Crash)లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాప్ బిపిన్ రావత్ (Army Chief General Bipin Rawat), ఈ ఘోర ప్రమాదంలో బిపిన్ భార్య సహా 13 మంది మృతి చెందారు. ఈ విషయాన్ని ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ధృవీకరించింది. మొత్తం 14 మంది ప్ర‌యాణిస్తుండగా.. ప్రమాదంలో కెప్టెన్ వరుణ్ సింగ్ గాయాలతో బయటపడ్డారు. మిగిలిన 13 మంది మరణించారు. అందులో చిత్తూరు వాసి ఒకరు. ఇలాంటి ప్రమాదంలో గతంలో అనేకమంది ప్రముఖుల ప్రాణాలు తీసుకుంది. దీంతో హెలీకాఫ్టర్ ప్రమాదం అంటేనే భయ పడాల్సి వస్తోంది. అన్ని సవ్యంగా ఉన్నాయని నిర్ధారించుకున్న తరువాతే బయలుదేరినా.. ప్రమాదాలు వెంటాడుతూనే ఉన్నాయి.  ఈ నేపథ్యంలో హెలీకాఫ్టర్ ప్రమాదాలు మరోసారి చర్చనీయాంశమవుతున్నాయి.

సంజయ్‌ గాంధీ                                                                                          అంతకుముందు కూడా కాంగ్రెస్ నేత హెలీకాఫ్టర్ ప్రమాదానికి బలయ్యారు. 1980 జూన్‌ 23న దిల్లీలో సఫ్దర్‌జంగ్‌ విమానాశ్రయంలో జరిగిన విమాన ప్రమాదంలో సంజయ్‌ గాంధీ మరణించారు. కాంగ్రెస్‌ నేత, మాజీ ప్రధాని ఇందిరాగాంధీ చిన్న కుమారుడాయన.

ఇదీ చదవండి : ఉదయం భార్య పిల్లలతో వీడియో కాల్.. ఇంతలో ఊహించని విషాదం.. చివరి మాటలు ఇవే

మాధవరావు సింథియా

జాతీయ స్థాయిలో మంచి గుర్తిపు ఉన్న నేత.. కాంగ్రెస్‌ సీనియర్‌, ప్రస్తుత పౌర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాధిత్య సింథియా తండ్రి మాధవరావు సింథియా విమాన ప్రయాదంలో దుర్మరణం చెందారు. 2001 సెప్టెంబర్‌ 30న కాన్పూర్‌లో జరిగిన ఈ ఘటనలో సింథియా సహా ఏడుగురు మరణించారు.

ఇదీ చదవండి : ఆరేళ్ల క్రితం మృత్యువును జయించారు.. మళ్లీ అదే హెలికాఫ్టర్ యమపాశమైంది

ధోర్జీ ఖండూ

అరుణాచల్‌ ప్రదేశ్‌ సీఎం ధోర్జీ ఖండూ హెలికాప్టర్‌ ప్రమాదంలో 2011 ఏప్రిల్‌ 30న మరణించారు. ఆయన ప్రయాణిస్తున్న పవన్‌ హాన్స్‌ బీ8 మోడల్‌ హెలికాప్టర్‌ అరుణాచల్‌ ప్రదేశ్‌లోని తవాంగ్‌ వద్ద ప్రతికూల వాతావరణ పరిస్థితుల వల్ల కుప్పకూలిపోయింది. ఈ ఘటనలో ఆయనతో పాటు మరో నలుగురు మరణించారు.

ఇదీ చదవండి : టీఆర్ఎస్ లో అంతర్మథనం.. అంతా ఒకే.. అయినా ఎక్కడో డౌట్

ఓపీ జిందాల్

హరియాణాకు చెందిన మంత్రి ఓపీ జిందాల్‌ 2005 మార్చి 31న మరణించారు. ఆయన ప్రయాణిస్తున్న హెలికాప్టర్‌ ఉత్తర్‌ప్రదేశ్‌లోని షెహరాన్‌పూర్‌ వద్ద కుప్పకూలిపోయింది.

ఇదీ చదవండి : ఎమ్మెల్సీ కవిత Vs మంత్రి ప్రశాంత్ రెడ్డి.. ఆదిప‌త్య పోరులో ఆమె నెగ్గారా..?

వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డి

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ను సైతం ఈ హెలీకాఫ్టర్ ప్రమాదాలు చాలాసార్లు భయపెట్టాయి. ఎన్నో విషాదాలను నింపాయి. ముఖ్యంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా రెండోసారి బాధ్యతలు చేపట్టిన కొద్ది రోజులకే హెలికాప్టర్‌ ప్రమాదంలో వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి మృతి చెందారు. 2009 సెప్టెంబర్‌ 2న చిత్తూరు జిల్లా పర్యటనకు బయల్దేరి వెళుతుండగా.. ఆయన ప్రయాణిస్తున్న బెల్‌ 430 హెలికాప్టర్‌ నల్లమల అడవుల్లో కుప్పకూలిపోయింది. ఆయన సహా మొత్తం ఐదుగురు ఆ ప్రమాదంలో మరణించారు. రాజశేఖర్ రెడ్డి మరణం రెండు తెలుగు రాష్ట్రాలకు తీరని లోటుగానే మిగిలింది.

ఇదీ చదవండి : ఇలియానా ఏంటి ఇలా మారింది..? టాలీవుడ్ బ్యూటీలను చూసేందుకు ఎగబడ్డ జనం

జీఎంసీ బాలయోగి

అంతకుముందుకూ కూడా ఓ కీలక నేతను ఆంధ్రప్రదేశ్ కోల్పోవలసి వచ్చింది. అప్పటి లోక్‌సభ స్పీకర్‌, తెలుగుదేశం పార్టీ నేత జీఎంసీ బాలయోగి హెలికాప్టర్‌ ప్రమాదంలో అనూహ్యంగా మరణించారు. 2002 మార్చి 3న ఆయన ప్రయాణిస్తున్న బెల్‌ 206 హెలికాప్టర్‌ పశ్చిమ గోదావరి జిల్లాలో కుప్పకూలిపోయింది. ఆయన మరణం టీడీపీకి తీరని లోటుగా మారింది.

ఇదీ చదవండి : నాభి అందాలతో రెచ్చగొడుతున్న బిగ్ బాస్ బ్యూటీ.. టాలీవుడ్ రీ ఎంట్రీ ఖరారైందా..?

సౌందర్య

కేవలం రాజకీయ నాయకులే కాదు.. టాలీవుడ్ లోనూ ఈ హెలీకాఫ్టర్ ప్రమాదం పెను విషాదం నింపింది. తెలుగు సినీ ప్రేక్షకుల మనసుల్లో చెరగని ముద్ర వేసిన సౌందర్య కూడా హెలికాప్టర్‌ ప్రమాదంలో మరణించారు. 2004 ఏప్రిల్‌ 17న బెంగళూరులో ఈ ప్రమాదం జరిగింది. తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం సహా పలు భాషల్లో ఆమె నటించారు. ఆమె మరణాన్ని ఇప్పటికే తెలుగు ప్రేక్షక లోకం మరిచిపోదు.

(Read all the Latest News, Breaking News on News18 Telugu. Follow us on Facebook, Twitter and Google News)

First published:

Tags: Army, Army Chief General Bipin Rawa, Army Of The Dead, Bipin Rawat

ఉత్తమ కథలు