Home /News /national /

DANDI MARCH 2 TO BE STARTED TODAY IN NAXAL HIT AREAS OF CHHATTISGARH SK

దండి మార్చ్ 2.. నేడే ప్రారంభం.. ఛత్తీస్‌గఢ్‌లో నక్సల్స్ ప్రభావిత ప్రాంత ప్రజల శాంతి ర్యాలీ

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

హింస ద్వారా ఏమీ సాధించలేమని నక్సల్ ప్రభావిత ప్రాంత ప్రజలు వాపోతున్నారు. నక్సల్స్, భద్రతా బలగాల యుద్ధంలో అమాయక అడవి బిడ్డలు అల్లాడిపోతున్నారని గిరిజన సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. దీనికి అంతం ఎప్పుడని.. ప్రశ్నిస్తున్నారు.

    బ్రిటిష్ నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా గాంధీజీ దండీ మార్చ్ (ఉప్పు సత్యాగ్రహం) నిర్వహించిన విషయం తెలిసిందే. స్వాంతంత్ర్య పోరాటంలో ఆ కార్యక్రమం ఎంతో కీలకమైనది. ఐతే దండీ మార్చ్ జరిగిన సరిగ్గా 91 ఏళ్ల తర్వాత దండీ మార్చ్ 2 జరగబోతోంది. ఛత్తీస్‌గఢ్ ఈ భారీ నేటి నుంచి ప్రారంభంకానుంది. ఇటు మావోయిస్టులు, అటు భద్రతా బలగాల మధ్య తాము నలిగిపోతున్నామని.. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లలోని ప్రజలు శాంతియుతంగా ఆందోళనలు చేస్తున్నారు. మావోయిస్టులు, ప్రభుత్వాలు చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించాలని కోరుతున్నారు. ఈ డిమాండ్‌తోనే దండీ మార్చ్ 2 ర్యాలీని తలపెట్టారు.

    ఛత్తీస్‌గఢ్‌లోని నారాయణపూర్ జిల్లా అబూజ్‌మడ్ నుంచి నేడు ర్యాలీ ప్రారంభం కానుంది. 11 రోజుల పాటు 222 కి.మీ. సాగే దండీ మార్చ్ 2 ర్యాలీ మార్చి 23న ఛత్తీస్‌గఢ్ రాజధాని రాయ్‌పూర్‌లో ముగియనుంది. మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన వారి కుటుంబాలు, భద్రతా బలగాల వేధింపులకు గురైన బాధితులంతా ఈ ర్యాలీలో పాల్గొంటున్నారు. న్యూ పీస్ ప్రాసెస్ (కొత్త శాంతి విధానం) పేరిట కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. మహాత్మా గాంధీ మార్చి 12న ఉప్పు సత్యాగ్రహాన్ని ప్రారంభించినందున అదే రోజు దండి మార్చ్ 2ని తలపెట్టారు. మార్చి 23న రాయ్‌పూర్‌లోని చైక్లీ మండీలో జరగనున్న భారీ బహిరంగ సభ ద్వారా ఈ కార్యక్రమం ముగుస్తుంది.

    హింస ద్వారా ఏమీ సాధించలేమని నక్సల్ ప్రభావిత ప్రాంత ప్రజలు వాపోతున్నారు. నక్సల్స్, భద్రతా బలగాల యుద్ధంలో అమాయక అడవి బిడ్డలు అల్లాడిపోతున్నారని గిరిజన సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. దీనికి అంతం ఎప్పుడని.. ప్రశ్నిస్తున్నారు. కేవలం చర్చల ద్వారానే పరిష్కారం లభిస్తుందని చెబుతున్నారు. కనీసం ఇప్పటికైనా మావోయిస్టు పార్టీ, ప్రభుత్వాల మధ్య సానుకూల చర్చలు జరగాలని.. తద్వారా అడవుల్లో రక్తపాతానికి అడ్డుకట్ట వేయాలని కోరుతున్నారు. అప్పుడే పచ్చని అడవులు ప్రశాంతంగా ఉంటాయని అభిప్రాయపడుతున్నారు. గిరిజనులు హాయిగా బతుకుతారని అంటున్నారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Chhattisgarh, Maoists

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు