యూపీలో బీజేపీకి షాక్..ఎంపీ సావిత్రి ఫూలె రాజీనామా

యోగిపై ఆమె తీవ్రంగా మండిపడ్డారు. హనుమంతుడు దళితుడే..కానీ మనువాదులకు వ్యతిరేకమని ఆమె చెప్పారు. హనుమంతుడు దళితుడు అయినందునే..రాముడు ఆయన్ను కోతిని చేశాడని సంచలన వ్యాఖ్యలు చేశారు.

news18-telugu
Updated: December 6, 2018, 4:07 PM IST
యూపీలో బీజేపీకి షాక్..ఎంపీ సావిత్రి ఫూలె రాజీనామా
సావిత్రి భాయి ఫూలె
news18-telugu
Updated: December 6, 2018, 4:07 PM IST
అంబేద్కర్ వర్ధంతి రోజున బీజేపీకి షాక్ తగిలింది. ఉత్తరప్రదేశ్‌కు చెందిన దళిత ఎంపీ సావిత్రి బాయి ఫూలె..ఆ పార్టీకి రాజీనామా చేశారు. ఐతే ఎంపి పదవికి మాత్రం రాజీనామా చేయలేదు. పదవీకాలం ముగిసే వరకు ఎంపీగా కొనసాగుతానని స్పష్టంచేశారు. బహ్రెయిచ్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న సావిత్రి..కొంతకాలంగా సొంత పార్టీపైనే తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు. రాజకీయాల కోసం సమాజంలో విభజన తెస్తోందని..ప్రజల మధ్య చిచ్చు పెడుతోందని మండిపడ్డారు.

ఇవాళ్టి నుంచి బీజేపీతో నాకు సంబంధం లేదు. దళిత్ అయినందునే నన్ను పార్టీ విస్మరించింది. దళితులకు వ్యతిరేకంగా బీజేపీ కుట్ర చేస్తోంది. ఎస్సీ, ఎస్టీ రిజర్వేషన్లను కూడా మెల్లగా తొలగిస్తారు. రాజ్యాంగ పరిరక్షణ కోసం నా పోరాటం కొనసాగుతుంది. జనవరి 23న లక్నోలో భారీ ర్యాలీ నిర్వహిస్తాం.
సావిత్రి బాయి, బహ్రెయిచ్ ఎంపీ
ఈ సందర్భంగా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌పై సావిత్రి బాయి ఫూలె తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో హనుమంతుడు దళితుడన్న ఆయన వ్యాఖ్యలను సావిత్రి ఫూలె ప్రస్తావించారు. హనుమంతుడు దళితుడే..కానీ మనువాదులకు వ్యతిరేకమని ఆమె చెప్పారు. హనుమంతుడు దళితుడు అయినందునే..రాముడు ఆయన్ను కోతిని చేశాడని సంచలన వ్యాఖ్యలు చేశారు. దళితులకు రామ మందిరం అవసరం లేదని రాజ్యాంగమే కావాలని స్పష్టంచేశారు. దళితులపై యూపీ సీఎం కపట ప్రేమ చూపిస్తున్నారని..ఆయన్ను ఎవరూ నమ్మవద్దని విమర్శించారు సావిత్రి.
First published: December 6, 2018
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...