అయోధ్య రామమందిరం ప్రసాదం అందుకున్న తొలి వ్యక్తి ఎవరో తెలుసా...

అయోధ్యలో రామమందిరం ప్రారంభోత్సవంగా సిద్ధం చేసిన ప్రసాదాన్ని ఓ దళితుడికి తొలుత అందజేశారు.

news18-telugu
Updated: August 6, 2020, 5:50 PM IST
అయోధ్య రామమందిరం ప్రసాదం అందుకున్న తొలి వ్యక్తి ఎవరో తెలుసా...
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అయోధ్యలో రామమందిరం నిర్మాణానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా నిన్న అంగరంగ వైభవంగా, శాస్త్రోక్తంగా భూమిపూజ జరిగింది. భారత్‌తో ప్రపంచదేశాల్లో ఉన్న కోట్లాది మంది ఈ కార్యక్రమాన్ని టీవీల్లో ప్రత్యక్షంగా వీక్షించారు. అత్యంత కట్టుదిట్టమైన భద్రత, అతికొద్దిమంది ఆహ్వానితులు మాత్రమే హాజరైన ఈ వేడుకకు సంబంధించిన ప్రసాదాన్ని పంచడం ప్రారంభించారు. ఈ ప్రసాదం అందుకున్న తొలి వ్యక్తి ఓ దళితుడు. మహాబీర్ అనే వ్యక్తి అయోధ్య రామమందిరం ప్రసాదాన్ని అందుకున్నారు. ఆయనకు ప్రసాదం లడ్డూతోపాటు రామచరిత మానస్ పుస్తకం, ఓ తులసిమాలను అందజేశారు. మహాబీర్ గతంలో ప్రధానమంత్రి ఆవాస యోజన ద్వారా లబ్ధిపొందారు. లోక్ సభ ఎన్నికల సమయంలో ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మహాబీర్ ఇంటికి వెళ్లి భోజనం కూడా చేశారు.
Published by: Ashok Kumar Bonepalli
First published: August 6, 2020, 5:50 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading