హోమ్ /వార్తలు /ఇండియా న్యూస్ /

Dalai Lama: నేడు దలైలామా 87వ పుట్టినరోజు.. ఈ ఆధ్యాత్మిక గురువు గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే

Dalai Lama: నేడు దలైలామా 87వ పుట్టినరోజు.. ఈ ఆధ్యాత్మిక గురువు గురించి తెలుసుకోవాల్సిన విషయాలు ఇవే

దలైలామా పాత చిత్రం

దలైలామా పాత చిత్రం

Dalai Lama Birth Day: దలైలామా పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రముఖ మత గురువు పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి అంతగా తెలియని కొన్ని వాస్తవాలను ఇప్పుడు తెలుసుకుందాం.

టిబెట్ ప్రజల ఆరాధ్యుడు, బౌద్ధుల ఆధ్యాత్మిక గురువు (Buddhist Spiritual Leader) దలైలామా (Dalai Lama) నేడు తన 87 వసంతంలోకి  (Dalai Lama Birth Day)అడుగుపెట్టారు. ఈ మహోన్నత వ్యక్తి జూలై 6, 1935న టిబెట్‌లోని ఈశాన్య దిక్కున టెన్జిన్ గ్యాట్సో (Tenzin Gyatso) అనే గ్రామంలో జన్మించారు. జగత్ మెచ్చిన ఈ గురువు ఒక రైతు కుటుంబంలో 14వ దలైలామాగా కన్ను తెరిచారు. పువ్వు పుట్టగానే పరిమళించినట్లు తన రెండో యేటాలోనే అద్భుతమైన ప్రతిభను కనబరిచారు. రెండేళ్ల వయసులో అతను 13వ దలైలామాకు చెందిన అనేక వస్తువులను సరిగ్గా గుర్తించారు. దాంతో తమ పూర్వీకులే దలైలామాగా పునర్జన్మ ఎత్తారని టిబెటన్ ప్రజలు భావించారు. అలాగే 13వ దలైలామా వారసునిగా ప్రకటించారు. 1950లో దలైలామాగా పట్టాభిషేకం చేశారు. మంచుతో శ్వేత వర్ణంలో నిత్యం కాంతులీనే టిబెట్‌లోని ప్రజలందరూ దలైలామాని శాంతి దేవతగా ఆరాధిస్తారు.

దలైలామా అంటే టిబెటన్ భాషలో మత గురువు అని అర్థం. దలైలామా అనే బిరుదును టిబెటన్ బౌద్ధమతానికి చెందిన గెలుగ్ పాఠశాల అత్యుత్తమమైన ఆధ్యాత్మిక నాయకుడికి అంకితం చేస్తారు. గతంలో చైనా పాలనకు వ్యతిరేకంగా టిబెటన్ ప్రజలు తిరుగుబాటు చేశారు కానీ విఫలమయ్యారు. ఆ తర్వాత 1959లో 14వ దలైలామా ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని సైనికుడి వేషంలో భారతదేశానికి పారిపోయారు. 50 ఏళ్ల క్రితమే భారత్‌ను శరణుకోరిన దలైలామా అప్పటి నుంచి హిమాచల్ ప్రదేశ్‌లోని ధర్మశాలలో ప్రవాస జీవితం గడుపుతున్నారు. నేడు దలైలామా పుట్టినరోజు సందర్భంగా ప్రముఖులు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. ప్రముఖ మత గురువు పుట్టినరోజు సందర్భంగా ఆయన గురించి అంతగా తెలియని కొన్ని వాస్తవాలను ఇప్పుడు తెలుసుకుందాం.

1. టిబెట్ నుంచి వచ్చినప్పటికీ, 14వ దలైలామా కుటుంబానికి టిబెటన్ భాష రాదు. ఈ భాషకు బదులుగా, వారు చైనాలోని పశ్చిమ ప్రావిన్సులలో మాట్లాడే చైనీస్ మాండలికంలో మాట్లాడేవారు. వారు ఈ చైనీస్ మాండలికాన్ని కూడా ఒక సవరించిన భాషలో మాట్లాడేవారు.

2. 14వ దలైలామా.. ఇతర దలైలామాలందరిలో ఎక్కువ కాలం పాలించిన, ఎక్కువ కాలం జీవించిన వ్యక్తి.

3. ప్రస్తుతం చైనాలో భాగమైన టిబెట్ రాజధాని లాసాలో జరిగిన ఒక వేడుకలో ఫిబ్రవరి 22, 1940న ఆయన దలైలామాగా సింహాసనాన్ని అధిష్టించారు.

4. 1989లో నోబెల్ ప్రైజ్‌తో పాటు ప్రపంచ శాంతి సామరస్యానికి చేసిన కృషికి అనేక అవార్డులను అందుకున్నారు.

ఫుడ్‌ బాక్స్‌లో రెజ్యూమ్.. ప్రతి ఆఫీస్‌కూ డెలివరీ.. మంచి ఉద్యోగం కోసం నిరుద్యోగి కష్టాలు

5. దలైలామాకు చిన్నప్పటి నుంచి సైన్స్‌పై ఆసక్తి ఉండేది. తన చిరుప్రాయంలో ఖాళీ సమయం చిక్కినప్పుడల్లా గడియారాలు, కార్లను రిపేర్ చేయడానికి ఎంతో ఇష్టపడే వారు. ఒక ఇంటర్వ్యూలో దలైలామా మాట్లాడుతూ తనని ఆధ్యాత్మిక గురువుగా పెంచకపోతే... ఇంజనీర్ అయ్యేందుకు ప్రయత్నించేవారిని అని అన్నారు.

Digital belts For Cows: ఆవులు, గేదెలకు అనారోగ్యమా? రెండు రోజుల ముందే మీకు తెలుస్తుంది..

6. దలైలామా తెల్లవారుజామున 3 గంటలకే నిద్ర లేస్తారు. ఉదయం 5 గంటల వరకు ధ్యానం చేసి, ఆ తర్వాత తన నివాస ప్రాంగణంలో కొద్దిసేపు మార్నింగ్ వాక్ చేస్తారు. తర్వాత గంజి/పాయసం, త్సంప (Tsampa), బార్లీ పిండితో కూడిన అల్పాహారాన్ని తీసుకుంటారు. ఉదయం బౌద్ధ గ్రంథాలను చదువుతారు.

First published:

Tags: Dalai Lama, National News

ఉత్తమ కథలు