శివలింగంపై చెక్క పలకలు..సల్మాన్ మూవీపై హిందూ సంఘాల ఆగ్రహం

మూవీ సెట్‌లో శివలింగం కనిపించడం..దాని మీద చెక్క పలకలు ఉండడం వివాదానికి కారణమైంది. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి.

news18-telugu
Updated: April 5, 2019, 1:22 PM IST
శివలింగంపై చెక్క పలకలు..సల్మాన్ మూవీపై హిందూ సంఘాల ఆగ్రహం
సల్మాన్ ఖాన్
news18-telugu
Updated: April 5, 2019, 1:22 PM IST
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ మరో వివాదంలో చిక్కుకున్నారు. దబాంగ్ 3 సినిమా షూటింగ్‌లో శివలింగాన్ని అవమానపరిచారంటూ బీజేపీ, హిందూ సంఘాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి. హిందువుల మనోభవాలు దెబ్బతినేలా వ్యవహరించారని చిత్ర యూనిట్‌పై మండిపడుతున్నారు. సినిమా సెట్స్‌లో శివలింగంపై చెక్క పలకలు ఉంచారని దుమ్మెత్తిపోస్తున్నారు. ఎన్నికల సమయం కావడంతో రాజకీయంగానూ ఈ అంశం దుమారం రేపుతోంది.

దుబాంగ్ 3 మూవీ షూటింగ్ ప్రస్తుతం మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో జరుగుతోంది. సల్మాన్ ఖాన్ స్వస్థలం మధ్యప్రదేశ్ కావడంతో తొలి సన్నివేశాలను అక్కడే చిత్రీకరించాలని చిత్ర యూనిట్ నిర్ణయించింది. ఈ క్రమంలో ఇటీవల మహేశ్వర్ సమీపంలోని నర్మదా నది తీరాన పలు సన్నివేశాలను చిత్రీకరించారు. ఐతే మూవీ సెట్‌లో శివలింగం కనిపించడం..దాని మీద చెక్క పలకలు ఉండడం వివాదానికి కారణమైంది. ఆ ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో హిందూ సంఘాలు ఆగ్రహం వ్యక్తంచేస్తున్నాయి.

మధ్యప్రదేశ్‌లో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి, సీఎంగా కమల్‌నాథ్ బాధ్యతలు చేపట్టాక రాష్ట్రంలో హిందువుల సంప్రదాయాలను కించపరుస్తున్నారు. శివలింగం పట్ల అమర్యాదగా వ్యవహరించిన దబాంగ్ 3 చిత్రయూనిట్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలి.
రామేశ్వర్ శర్మ, బీజేపీ నేత
బీజేపీ నేతలది సంకుచిత మనస్తత్వం. వారి మాటలపై స్పందించాల్సిన అవసరం లేదు. సల్మాన్ ఖాన్ మంచి నటుడు. ఆయన మత సామరస్యాన్ని వ్యాప్తిచేస్తాడు. బీజేపీ నేతలు విద్వేషపూరితంగా వ్యవహరిస్తున్నారు. దీనిపై రాజకీయాలు చేసి ఎన్నికల్లో లబ్ధి పొందాలని చూస్తున్నారు.
జీతూ పట్వారి, మధ్యప్రదేశ్ మంత్రి
ఈ వివాదం పెద్దదవడంతో స్వయంగా సల్మాన్ ఖాన్ స్పందించారు. తాము శివలింగాన్ని అవమానపరచలేదని, షూటింగ్ ముగిసేవరకు పాడవకుండా ఉండేందుకు చెక్కల వేదిక కింద తామే దాచామని వివరణ ఇచ్చారు. ఇక ఎన్నికల సీజన్ కావడంతో ఈ అంశంపై బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం జరుగుతోంది. సల్మాన్‌ఖాన్‌ను కాంగ్రెస్ వెనకేసుకొస్తుండగా..బీజేపీ మాత్రం తీవ్ర విమర్శలు గుప్పిస్తోంది.

First published: April 5, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...