Home /News /national /

CYCLONE YAAS TO FORM AROUND MAY 25 IN BAY OF BEGAL IT HEADS TOWARDS WEST BENGAL ODISHA COASTS SK

Cyclone Yaas: దూసుకొస్తున్న మరో తుపాను.. తూర్పు తీరానికి ముప్పు తప్పదా?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మే 22న ఉత్తర అండమాన్‌ సముద్రం, బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడనుంది. దాని ప్రభావంతో తూర్పు తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. ఆ అల్పపీడనం ఏర్పడిన 72 గంటల తర్వాత తుపానుగా బలపడనుంది

    అరేబియా సముద్రం ఏర్పడిన తౌక్టే తుపాను.. మన దేశ పశ్చిమ తీరంలో అల్లకల్లోలం సృష్టించిన విషయం తెలిసిందే. దాని ప్రభావంతో మహారాష్ట్ర, గుజరాత్‌లో ఊహకందని విధ్వంసం జరిగింది. ఆ కడలి కన్నీళ్లను మరవక ముందే మరో తుపాను దూసుస్తోంది. మొన్నటి వరకు పశ్చిమ తీరంలో తుపాను ఏర్పడగా.. ఇప్పుడు తూర్పు తీరాన్ని ముంచెత్తేందుకు మరో తుపాను వస్తోంది. మే 26, 27 తేదీల్లో తూర్పు తీరాన్ని తాకే అవకాశముందని భారత వాతావరణశాఖ అంచనావేసింది. ఐఎండీ అంచనాల ప్రకారమే.. అల్పపీడనం తుపాను‌గా మారితే దానిని యాస్‌ (YAAS)గా పిలుస్తారు. ఒమన్ దేశం ఆ పేరును సూచించింది.

    భాతర వాతావరణశాఖ చెప్పిన వివరాల ప్రకారం.. మే 22న ఉత్తర అండమాన్‌ సముద్రం, బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడడనుంది. దాని ప్రభావంతో తూర్పు తీర ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయి. ఆ అల్పపీడనం ఏర్పడిన 72 గంటల తర్వాత తుపానుగా బలపడనుంది. అది వాయువ్య దిశగా కదులుతూ ఒడిశా, పశ్చిమ వైపు వెళ్తుంది. మే 26 లేదా 27న తీరం దాటే అవకాశముంది. యాస్ తుపాను ప్రభావంతో అండమాన్ నికోబార్ దీవులు, ఒడిశా, పశ్చిమ బెంగాల్, అసోం, మేఘాలయ రాష్ట్రాల్లో మోస్తరు నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశముందని ఐఎండీ హెచ్చరించింది.

    ఇక ఈసారి నైరుతి రుతుపవనాలు సాధారణం కంటే కాస్త ముందుగానే వస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. మే 21 తర్వాత ఆగ్నేయ బంగాళాఖాతాన్ని ఆనుకొని దక్షిణ అండమాన్ సముద్రాన్ని రుతుపవనాలు తాకుతాయని వాతావరణ శాఖ వెల్లడించింది

    మరోవైపు పశ్చిమ తీరంలో తౌక్టే తుఫాన్ ధాటికి మహారాష్ట్ర, గుజరాత్ చిగురుటాకుల వణికిపోయాయి. అరేబియాలో సముద్రంలో భారీ నౌకలే కొట్టుకుపోయాయి. సముద్రంలో కొట్టుకుపోయిన ఓ నౌక నుంచి ఇవాళ 22 మృతదేహాలను రెస్క్యూ బృందాలు వెలికి తీశాయి. ఇక గుజరాత్, మహారాష్ట్రలో తుపాను ధాటికి పదుల సంఖ్యలో ప్రజలు మరణించారు. ముఖ్యంగా గుజరాత్‌లో భారీ నష్టం వాటిల్లింది. ఆయా ప్రాంతాల్లో ప్రధాని నరేంద్ర మోదీ ఏరియల్ సర్వే నిర్వహించారు. తక్షణ సాయంగా రూ.1000 కోట్లు ప్రకటించారు.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Bay of Bengal, Cyclone, Cyclone alert, WEATHER, Weather report

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు