Home /News /national /

CYCLONE YAAS LIVE UPDATES VILLAGES FLOODED AS CYCLONE HITS ODISHA COAST BENGAL HERE IS TERRIFIC VIDEOS FROM SOCIAL MEDIA SK

Cyclone YAAS: భారీ వర్షాలు.. భీకర గాలులు.. యాస్ తుపాను బీభత్సాన్నిఈ వీడియోల్లో చూడండి..

వర్షాల ధాటికి నీట మునిగిన కార్లు

వర్షాల ధాటికి నీట మునిగిన కార్లు

భారీ వర్షాలు.. భీకర గాలులతో విరుచుకుపడింది. పలు చోట్ల సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. తీరానికి దగ్గరగా ఉన్న గ్రామాలు నీటిలో మునిగిపోయాయి.

    తూర్పు తీరంలో యాస్ తుపాను బీభత్సం సృష్టిస్తోంది. ఒడిశాలోని తీర ప్రాంత గ్రామాలను ముంచెత్తింది. భారీ వర్షాలు.. భీకర గాలులతో విరుచుకుపడింది. పలు చోట్ల సముద్రం ముందుకు చొచ్చుకొచ్చింది. తీరానికి దగ్గరగా ఉన్న గ్రామాలు నీటిలో మునిగిపోయాయి. తుపాను ధాటికి ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో భారీగా వర్షాలు కురుస్తున్నాయి. గంటకు 180 కి.మీ. వేగంతో రాకాసి గాలులు వీస్తున్నాయి. ఒడిశాలోని ధమ్రా పోర్టు సమీపంలో ఉదయం 09.15 నిమిషాలకు తీరాన్ని తాకింది. తీరాన్ని దాటే ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఒడిశాలోని భద్రక్ జిల్లాలపై దీని ప్రభావం ఎక్కువగా ఉంది. చాలా చోట్ల చెట్ల కూలిపోయాయి. ఇళ్ల పైకప్పుడు ఎగిరిపోయాయి. లోతట్టు ప్రాంతాలన్నీ నీట మునిగిపోయాయి.


    ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో తుపాన్ బీభత్సాన్ని ఈ వీడియోల్లో చూడండి.









    ఒడిశా, పశ్చిమ బెంగాల్‌లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయి. నేలకొరిగిన చెట్లను ఎప్పటికప్పుడు తొలగిస్తున్నాయి. తుపాను నేపథ్యంలో భువనేశ్వర్, కోల్‌కతా ఎయిర్‌పోర్టుల నుంచి విమాన రాకపోకలు నిలిచిపోయాయి. రైళ్లు కూడా రద్దయ్యాయి. తుపాన్ ప్రభావంతో ఝార్ఖండ్, బీహార్ రాష్ట్రాల్లోనూ భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ తెలిపింది.
    Published by:Shiva Kumar Addula
    First published:

    Tags: Cyclone, Cyclone alert, Cyclone Yaas, Odisha, Weather report

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు